ఏసీబీకి చిక్కిన వీఆర్వో
చెన్నూర్, న్యూస్‌లైన్ : వేమనపల్లి మండలం జిల్లెడ వీఆర్వో భీమయ్య గురు వారం చెన్నూర్ పట్టణంలోని వేమనపల్లి మండల కార్యాల యంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వేమనపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన రైతు జావిద్ ఖాన్ నుంచి రూ.13 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. కరీంనగర్ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. జిల్లెడ గ్రామ వీఆర్వో భీమయ్య లిం గాల గ్రామానికి సంబంధించిన భూవ్య వహారాలు చూస్తున్నాడు. ఈ నేప థ్యంలో జావిద్‌ఖాన్ తనకున్న 65 సర్వే నంబర్లో గత 17 గుంటల భూమి, అతని భార్య సాధిక పేరు మీద ఉన్న సర్వే నంబర్ 114లో 2.26 గుంటలు, చెల్లెలు సీమ పేరు మీద సర్వే నంబర్ 114లో 2.25 గుంటలు, బావమర్ది గౌస్‌పాషాకు గల ఎకరం భూమిని పట్టాదారు, పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్ల కోసం రెండు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు.
పట్టా కోసం తిరుగగా, భీమయ్య లంచం ఇస్తే పనిచేస్తానని తెలిపాడు. ఇందుకోసం రూ.18 వేలు డిమాండ్ చేశాడు. ఇందులో రెండేళ్ల క్రితం రూ.5 వేలు తీసుకున్నాడు. అప్పటి నుంచి జావిద్ తిరుగుతూనే ఉన్నాడు. మిగతా రూ.13 వేలు ఇస్తేనే పాస్‌పుస్తకాలు ఇస్తానని భీమయ్య తెగేసి చెప్పాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రీతం భీమయ్యను జావిద్ కలిశాడు. మిగతా డబ్బులు గురువారం ఇస్తానని చెప్పాడు. వెంటనే ఏసీబీ అధికారులను జావిద్ ఆశ్రయించాడు. అధికారుల పథకం ప్రకారం గురువారం రాత్రి జావిద్‌ఖాన్ భీమయ్యకు రూ.13వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.