bhongir fort
-
ట్రెక్కింగ్‌కి కేరాఫ్‌గా భువనగిరి కోట..!
హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగి ఇల్లు చేరాలంటే భువనగిరి కోట ఒక చక్కటి టూరిస్ట్ ప్లేస్. ఐదు వందల అడుగుల ఎత్తులో, నలభై ఎకరాల్లో విస్తరించిన నిర్మాణం ఇది. భువనగిరి కోటను నిర్మించిన రాజు పేరు త్రిభువన మల్ల విక్రమాదిత్య. ఈ కోట 11వ శతాబ్దం నాటిది. చరిత్ర పుటల్లో అతడి పేరుతోనే త్రిభువనగిరిగా ఉంటుంది. వ్యవహారంలో భువనగిరి, బోన్గిర్ అయిపోయింది. ఈ కోట ముందు సర్దార్ సర్వాయపాపన్న విగ్రహం ఉంటుంది. గూగుల్ మ్యాప్ డైరెక్షన్ కోట సమీపం వరకు మాత్రమే. ఎంట్రన్స్ ఎటు వైపు ఉందో తెలియక తిరిగిన రోడ్లలోనే చుట్టు తిరగాల్సి వస్తుంది. కాబట్టి స్థానికుల సహాయంతో ముందుకెళ్లాలి. టూరిస్ట్ ప్లేస్‌గా ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. ఎంట్రీ టికెట్, కెమెరాకి టికెట్ తీసుకోవాలి. వాటర్ బాటిళ్లు, తినుబండారాలు తగినన్ని వెంట తీసుకువెళ్లాలి. కోట సమీపంలో కూడా పర్యాటకులకు సౌకర్యాలు పెద్దగా లేవు. వాహనం పార్కింగ్‌కి కోట ముందు విశాలమైన ప్రాంగణం ఉంది. కానీ నీడ కోసం ఎటువంటి ఏర్పాటూ లేదు. తగినన్ని ఏర్పాట్లు లేవనే అసౌకర్యం నిజమే. కానీ వాహనాల హారన్ల మోతలు లేకుండా, పిన్ డ్రాప్ సైలెన్స్‌తో కూడిన వాతావరణం హైదరాబాద్ నగరవాసికి స్వర్గమనే చెప్పాలి. స్వచ్ఛమైన చల్లటి గాలి ఒంటిని తాకుతుంటే కలిగే హాయిని ఫీల్ అవ్వాల్సిందే, మాటల్లో వర్ణించలేం. పదిహేనేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల వాళ్లు కూడా ఈ ట్రెక్కింగ్ టూర్‌ను చక్కగా ఆస్వాదించగలుగుతారు.ఈ టూర్‌కి వెళ్లేటప్పుడు షూస్ చక్కగా ట్రెకింగ్‌కి అనువుగా ఉండాలి. అలాగే హైదరాబాద్– వరంగల్ హైవే మీద ఉన్న హోటళ్లలో తినేసి వెళ్లాలి. తిరుగు ప్రయాణంలోనూ ఆకలి తీర్చేది కూడా హైవే మీదున్న హోటళ్లే. ట్రెకింగ్ పూర్తయిన తర్వాత తిరుగుప్రయాణంలో చేసే భోజనంలో థాలి రుచి కూడా అంతే అద్భుతం. (చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!) -
వైఎస్సార్ లాంటి నేతలు లేరు: ఎంపీ కోమటిరెడ్డి
-
వైఎస్సార్ లాంటి నేతలు లేరు: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం ఇందుకు సంబంధించిన లేఖను న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లోని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి అందజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైన కిషన్‌రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. నూతనంగా చేపట్టిన పర్యాటక రంగంలో కొత్త విధానాలు తీసుకువచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. అలాగే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న చారిత్రక ప్రదేశం భువనగిరి కోట అభివృద్ధికి సాయం చేయాలని కేంద్రమంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యక్తిగా కిషన్‌రెడ్డికి భువనగిరి కోట విశిష్టత తెలుసని, ప్రత్యేక తెలంగాణలో రాష్ట్ర సర్కార్ కోట అభివృద్ధికి సహకరించడం లేదని తెలిపారు. నేటికి దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగమనంలో కలిసిపోయాయని అన్నారు. ఇప్పటికైనా పట్టించుకోకుంటే భువనగిరి కోట కూడా అలాగే అవుతుందని తెలిపారు. కోట అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ కిషన్‌రెడ్డిని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించి నిధులను వెంటనే మంజూరు చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారని ఆయన మీడియాకు తెలిపారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘‘ పీసీసీ నా దృష్టిలో చాలా చిన్న పదవి. రేవంత్‌రెడ్డి గురించి నా దగ్గర మాట్లాడవద్దు. మల్కాజ్‌గిరిలో 40 డివిజన్లలో పార్టీ డిపాజిట్ కోల్పోయింది. తెలంగాణ కాంగ్రెస్‌లో నియోజకవర్గ స్థాయి నేతలు తప్ప.. వైఎస్సార్ లాంటి నేతలు లేరు. కాంగ్రెస్‌లోనే ఉంటా.. పార్టీ మారే ఆలోచన లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ముందుకు నడిపై సమర్ధవంతమైన నాయకుడు లేడు. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతా’’నని కోమటిరెడ్డి అన్నారు. -
వైరల్: కోట నుంచి ఉప్పొంగుతున్న వరద
సాక్షి, భువనగిరి : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సోమవారం భువనగిరి, యాదగిరిగుట్టలో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాల ఆవరణలో భారీగా వర్షపు నీరు నిలవడంతో రైతుబజార్‌కు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా యాదగిరిగుట్ట పట్టణంలోనూ లోటస్ టెంపుల్ సమీపంలో లోతట్టు ప్రాంతంలోని ఇళ్ల మధ్య నీరు నిలవడంతో స్థానికులు, భక్తులు నానా అవస్థలు పడ్డారు. పలు కాలనీల్లో డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. భారీ వర్షల కారణంగా భువనగిర కోటపై నుంచి వర్షపు నీరు కిందకు జాలువారుతోంది. దీంతో కోట పాలకుండను తలపిస్తోంది. ఎన్నడూ లేనంతగా కోట నుంచి వరదనీరు ఉప్పొంగడంతో పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. కోట అందాలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియో పోస్ట్ చేయడంతో ఆవి కాస్తా వైరల్‌గా మారాయి. (వర్ష బీభత్సం: కొట్టుకొచ్చిన భారీ నౌక) (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
ఉప్పొంగుతున్న వరద
-
రాజరికపు జ్ఞాపకం... అనుభూతుల సంతకం
న్యూ ఇయర్ పార్టీ మూడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దానిని ఈ వీకెండ్ దాకా సిటీ కంటిన్యూ చేస్తోంది. ఉర్రూతలూగించిన నైట్‌పార్టీకి తోడుగా ప్రశాంతతను, రొటీన్‌కు భిన్నమైన ఆనందాన్ని పొందేందుకు వీకెంట్ టూర్ చేయాల్సిందే. ఇలా ఆలోచించేవారికి సిటీకి అతి చేరువలో ఉన్న భువనగిరి కోట ఒక చక్కని గమ్యం. - ఓ మధు గిరులు కోటలకు ఆవాసాలుగా మారిన తార్కాణాలెన్నో... గోల్కొండ, చంద్రగిరి, భువనగిరి ఆ కోవలోకి వచ్చే కోటలే... 12 వ శతాబ్దంలో కట్టిన ఈ కోట నేటికి రాచఠీవి కోల్పోకుండా తన దర్పాన్ని చూపిస్తుంది. సిటీకి దగ్గరగా... రొటీన్‌కు దూరంగా... నల్లగొండ జిల్లాలో సిటీకి 48 కి.మీ దూరంలో ఉన్న ఈ కోట సిటిజనులకు చక్కటి వీకెండ్ స్పాట్. ఈ కోట నిర్మాణ కౌశలం నేటికి ఆకట్టుకుంటోంది. చాళుక్య త్రిభువనమల్ల విక్రమాదిత్య ఈ కోటను నిర్మించాడని ఆయన పేరు మీదనే ఈ కోటకు త్రిభువనగిరి అని పిలిచేవారని చరిత్ర. తర్వాత కాలంలో ఇది భువనగిరికోటగా స్థిరపడింది. విశేషాలెన్నో... మత్తగజంలా కనిపించే శిలపై నిర్మించిన ఈ కోట మనను దూరం నుంచే ఆహ్వానిస్తున్నట్లుంటుంది. అంతటి నునుపైన శిలపై కోట ఎలా నిర్మించారో అర్థం కాదు. మొత్తం 50 ఎకరాలలో, 500 అడుగుల ఎత్తున్న ఏకశిల చూస్తే ప్రకృతి విచిత్రమే అనిపిస్తుంది. ఈ శిలకు రెండు వైపులా ద్వారాలున్నాయి. మెట్ల ద్వారా లేదా ట్రెక్కింగ్ చేస్తూ కోటకు చేరుకోవాల్సి ఉంటుంది. నేల మాలిగలు, ఆయుధాలు దాచే రహస్య స్థావరాలు, శత్రువులను తప్పు దోవ పట్టించే మార్గాలు, లోతైన కందకం ఇలా కోటలో విశేషాలు అనేకం. ఆవరణలో 2 తటాకాలు, కొన్ని లోతైన బావులు ఉన్నాయి. వాన నీటిని నిలువ చేసేందుకు ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్లో తామర తుండ్లు వికసించటం నేటికి చూడవచ్చు. భువనగిరి నుంచి గోల్కొండకు రహస్య మార్గం ఉండేదని అంటారు. రుద్రమదేవి, ఆమె మనవడు ప్రతాపరుద్రుడి కాలంలో ఎంతో వైభవంగా వెలిగింది ఈ కోట. ఎన్నోసార్లు శత్రువుల దాడులకు లోనయినా, దుర్భేద్యంగా నిలిచిన భువనగిరి కోట 15 వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ల చేతికి చిక్కింది. వారి ఫిరంగులు, గన్‌పౌడర్ దాడులకు తలొగ్గాల్సి వచ్చింది. వారి ఏలికలో ఇస్లామిక్ శైలిలో కోటకు కొన్ని మార్పులు జరిగాయి. ఆ తర్వాత 18 శతాబ్దం నుంచి ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా ఉన్న ఈ కోట నేడు దాదాపు శిథిలావస్థకు చేరింది. అయినప్పటికీ ఈ కోట ఆర్కిటెక్చర్ ఆధునికులను ఆశ్యర్యపరుస్తుంది. కోట పై భాగానికి చేరి భువనగిరి నగరాన్ని వీక్షిస్తుంటే, గతం మిగిల్చిన జ్ఞాపకాల నుంచి బయటపడి కొత్త ఏడాదిలోకి ప్రయాణం మొదలు పెట్టడానికి కావలసిన బలాన్ని, ఉత్తేజాన్ని అక్కడి గాలి మనకు అందిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడికి చేరువలోనే యాదగిరి గుట్ట, సురేంద్రపురి మ్యూజియం ఉన్నాయి.