
సాక్షి, భువనగిరి : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సోమవారం భువనగిరి, యాదగిరిగుట్టలో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాల ఆవరణలో భారీగా వర్షపు నీరు నిలవడంతో రైతుబజార్‌కు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా యాదగిరిగుట్ట పట్టణంలోనూ లోటస్ టెంపుల్ సమీపంలో లోతట్టు ప్రాంతంలోని ఇళ్ల మధ్య నీరు నిలవడంతో స్థానికులు, భక్తులు నానా అవస్థలు పడ్డారు. పలు కాలనీల్లో డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. భారీ వర్షల కారణంగా భువనగిర కోటపై నుంచి వర్షపు నీరు కిందకు జాలువారుతోంది. దీంతో కోట పాలకుండను తలపిస్తోంది. ఎన్నడూ లేనంతగా కోట నుంచి వరదనీరు ఉప్పొంగడంతో పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. కోట అందాలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియో పోస్ట్ చేయడంతో ఆవి కాస్తా వైరల్‌గా మారాయి. (వర్ష బీభత్సం: కొట్టుకొచ్చిన భారీ నౌక)
Comments
Please login to add a commentAdd a comment