హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగి ఇల్లు చేరాలంటే భువనగిరి కోట ఒక చక్కటి టూరిస్ట్ ప్లేస్. ఐదు వందల అడుగుల ఎత్తులో, నలభై ఎకరాల్లో విస్తరించిన నిర్మాణం ఇది. భువనగిరి కోటను నిర్మించిన రాజు పేరు త్రిభువన మల్ల విక్రమాదిత్య. ఈ కోట 11వ శతాబ్దం నాటిది. చరిత్ర పుటల్లో అతడి పేరుతోనే త్రిభువనగిరిగా ఉంటుంది. వ్యవహారంలో భువనగిరి, బోన్‌గిర్ అయిపోయింది. ఈ కోట ముందు సర్దార్ సర్వాయపాపన్న విగ్రహం ఉంటుంది.
గూగుల్ మ్యాప్ డైరెక్షన్ కోట సమీపం వరకు మాత్రమే. ఎంట్రన్స్ ఎటు వైపు ఉందో తెలియక తిరిగిన రోడ్లలోనే చుట్టు తిరగాల్సి వస్తుంది. కాబట్టి స్థానికుల సహాయంతో ముందుకెళ్లాలి. టూరిస్ట్ ప్లేస్‌గా ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. ఎంట్రీ టికెట్, కెమెరాకి టికెట్ తీసుకోవాలి. వాటర్ బాటిళ్లు, తినుబండారాలు తగినన్ని వెంట తీసుకువెళ్లాలి. కోట సమీపంలో కూడా పర్యాటకులకు సౌకర్యాలు పెద్దగా లేవు. వాహనం పార్కింగ్‌కి కోట ముందు విశాలమైన ప్రాంగణం ఉంది.
కానీ నీడ కోసం ఎటువంటి ఏర్పాటూ లేదు. తగినన్ని ఏర్పాట్లు లేవనే అసౌకర్యం నిజమే. కానీ వాహనాల హారన్‌ల మోతలు లేకుండా, పిన్ డ్రాప్ సైలెన్స్‌తో కూడిన వాతావరణం హైదరాబాద్ నగరవాసికి స్వర్గమనే చెప్పాలి. స్వచ్ఛమైన చల్లటి గాలి ఒంటిని తాకుతుంటే కలిగే హాయిని ఫీల్ అవ్వాల్సిందే, మాటల్లో వర్ణించలేం. పదిహేనేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల వాళ్లు కూడా ఈ ట్రెక్కింగ్ టూర్‌ను చక్కగా ఆస్వాదించగలుగుతారు.
ఈ టూర్‌కి వెళ్లేటప్పుడు షూస్ చక్కగా ట్రెకింగ్‌కి అనువుగా ఉండాలి. అలాగే హైదరాబాద్– వరంగల్ హైవే మీద ఉన్న హోటళ్లలో తినేసి వెళ్లాలి. తిరుగు ప్రయాణంలోనూ ఆకలి తీర్చేది కూడా హైవే మీదున్న హోటళ్లే. ట్రెకింగ్ పూర్తయిన తర్వాత తిరుగుప్రయాణంలో చేసే భోజనంలో థాలి రుచి కూడా అంతే అద్భుతం.
(చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్‌బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!)
Comments
Please login to add a commentAdd a comment