తెలంగాణలో రద్దుల పర్వం మొదలు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రద్దుల పర్వం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న అనేక నిర్ణయాలను ఈ ప్రభుత్వం తిరగదోడుతోంది. ఆ ప్రభుత్వం వివిధ సంస్థలకు, సొసైటీలకు మంజూరు చేసిన భూములను తిరిగి తీసుకుంటోంది. ఉమ్మడి వాసన వచ్చే ప్రతిదాన్ని రద్దు చేసుకుంటూ పోతోంది.
ఉమ్మడిరాష్ట్రంలో ఉన్న భూదాన్ ట్రస్ట్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రద్దు చేసింది. త్వరలో తెలంగాణకు కొత్త బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ఈ విధంగా ఇంకా అనే సంస్థలను, నిర్ణయాలను రద్దు చేసే అవకాశం ఉంది.