భూపాల్ పల్లిలో 20లక్షలతో పట్టుబడ్డ టీఆర్ఎస్ కార్యకర్త!
వరంగల్: ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండటంతో వరంగల్ జిల్లాలో డబ్బుల పంపిణీ ఊపందుకుంది. ఓటర్లను మభ్యపెట్టేందుకు అన్ని పార్టీలు మద్యం, డబ్బు పంపిణీకి దిగారు. అయితే ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
తనిఖీల్లో భాగంగా వరంగల్ జిల్లా భూపాల్ పల్లి నియోజకవర్గంలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త నుంచి 20 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో బండ్లపల్లి వద్ద ఓటర్లకు డబ్బు పంచుతున్న ఓ టీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.