సింగరేణికి భారమవుతున్న బొగ్గు
కొనుగోలుకు వినియోగదారుల విముఖత
పేరుకుపోతున్న నిల్వలు
యైటింక్లయిన్కాలనీ : బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతో అగ్రభాగాన ఉన్న సింగరేణి సంస్థకు వినియోగదారుల నుంచి బొగ్గు కష్టాలు మొదలయ్యాయి. నిర్దేశిత లక్ష్యాల సాధనలో ఉత్సాహంగా ముందుకు సాగుతున్న సింగరేణికి బొగ్గు వినియోగదారుల నుంచి అనుకున్నంత స్పందన లభించడంలేదు. దీంతో తీసిన బొగ్గు సకాలంలో రవాణా జరగక సంస్థవ్యాప్తంగా నిల్వలు పేరుకపోతున్నాయి. సింగరేణి సంస్థతోపాటు కోలిండియాలో బొగ్గు ఉత్పత్తి పెరిగిపోవడంతో వినియోగదారులకు బొగ్గు పుష్కలంగా అందుతోంది. దీంతో కోల్లింకేజీ కన్నా అదనపు బొగ్గు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారున్నారు. గతంలో కోలిండియా బొగ్గు ఉ త్పత్తి తక్కువగా ఉండటంతో సింగరేణి బొగ్గుకు డిమాండ్ ఉండేది. అయితే కోలిండియాలో కూ డా ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి పెరగడంతో బొగ్గు నిల్వలు భారీగా పెరుగుతున్నాయి.
దీంతో సింగరేణి బొగ్గు కొనుగోలు చేసేందుకు వినియోదారుల నుంచి పెద్దగా స్పందన లభించడం లేదు. లింకేజీకన్నా అదనంగా కొనుగోలు చేసిన వినియోగదారులు ఇప్పుడు ససేమిరా అంటున్నారు. ఓసీపీ సీహెచ్పీల వద్ద, కోల్యార్డుల్లో బొగ్గు నిల్వలు గుట్టలుగా పేరుక పో తున్నాయి. భూపాల్పల్లి పవర్ఫ్లాంట్ ప్రారంభమైతే ఇంత బొగ్గు నిల్వలు పెరిగేవి కాదంటున్నారు. ఈక్రమంలో వేచి చూసే ధోరణితో యాజమాన్యం ముందుకు సాగుతోంది.
మొదటి వారం నుంచి పెరుగుతున్న నిల్వలు
ఫిబ్రవరి మొదటి వారం నుంచి బొగ్గు నిల్వలు పెరిగిపోతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా ఐదు మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు పేరుకపోయాయి. అయితే కోలిండియాలో అంచనాలకు మించి బొగ్గు ఉత్పత్తి పెరిగిపోయింది. దీంతో కోలిండియాకు మన బొగ్గు ఎగుమతి తగ్గింది. వినియోగ దారులు కోల్లింకేజీకన్నా అదనంగా బొగ్గు కొనుగోలు చేయడం లేదు. భూపాల్పల్లి విద్యుత్ ప్లాంట్ ప్రారంభమైతే ఇంత ఇబ్బంది ఉండదు. మార్చిలో బొగ్గురవాణా ఊపందుకుంటుంది.- ప్రాజెక్టు అండ్ ప్లానింగ్డెరైక్టర్మనోహర్రావు