వడదెబ్బకు ఇద్దరి మృతి
ఖమ్మం: ఎండల తీవ్రతకు ఖమ్మం జిల్లాలో సోమవారం ఇద్దరు మృతిచెందారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం మండలం గ్రామానికి చెందిన కోట భూషణం(62) సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. అలాగే, మధిర మండలం మునగాల గ్రామానికి చెందిన కోట రాంబాబు(21) అనే వికలాంగుడు కూడా మృత్యువాతపడ్డాడు. ఎండలు ఎక్కువగా ఉన్నందు వల్ల మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని డాక్టర్లు సలహా సూచిస్తున్నారు.