సుడిగాలిలో చిక్కిన విమానం; ఎమర్జెన్సీ ల్యాండింగ్
గువహటి: అసోంలో ఓ విమానం సుడిగాలిలో చిక్కుకున్న ఘటన కలకలం రేపింది. విమానాన్ని వెంటనే గువహటి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
భూటాన్‌కు చెందిన విమానం 90 మంది ప్రయాణికులతో పాకిస్తాన్ నుంచి బయలుదేరింది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా గువహటిలో ఒక్కసారిగా సుడిగాలి సంభవించింది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది చాకచాక్యంగా విమానాన్ని గువహటి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు.