రెండురోజుల ఆడశిశువు మృతదేహం లభ్యం
నిజామాబాద్ (బిచ్కుంద) : నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలంలోని అయ్యప్ప గుడి పక్కన రెండు రోజుల వయసు గల ఆడ శిశువు మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేయటంతో వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శిశువు మృతదేహాన్ని బిచ్కుంద ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పోస్టుమార్టం అనంతరం శిశువు మృతదేహాన్ని ఖననం చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఆడశిశువు చనిపోతే అక్కడ పడవేశారా? లేక ఆడపిల్ల పుట్టిందని చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఇటీవల డెలివరీ అయిన మహిళల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.