భలే ‘సైకిల్ అరక’
కేసముద్రం: పశువులు, ట్రాక్టర్ల సాయంతో అరక దున్నడం నిత్యం చూస్తుంటాం.. పనికి రాని పాత సైకిల్ కు అమర్చిన పారతో, ముందుచక్రం సాయంతో సునాయూసంగా దున్నుతున్నాడు వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామశివారు వెంకట్రాంతండాకు చెందిన రైతు భుక్యా చందు. తనకున్న సాగు భూమిలో పత్తి విత్తనాలు వేశాడు. ఈ క్రమంలో ఆ రైతుకు ఒక ఆలోచన తట్టింది...
పాత సైకిళ్ల వెనక చక్రాన్ని తొలగించి, పైడిల్ను తీసేసి ఆ చోట బోల్ట్ సాయంతో నాగలిపార (గుంటుక)ను బిగించాడు, మళ్లీ గుంటుకను తొలగించి దంతెలను, ఇతర పరికరాలను అమర్చేలా తయారు చేయించాడు. మొత్తం రూ.300తో సైకిల్ అరకను తయారుచేయించాడు. దీనితో భూమిని దున్నడం, విత్తనాలు విత్తడం, కలుపు తీయడానికి గుంటుకను అమర్చి మళ్లీ గుంటక తోలడం వంటి పనులను సునాయసంగా చేస్తున్నాడు.