దర్శకేంద్రుడు, సుద్దాలకు డాక్టరేట్లు
విశాఖపట్నం: ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్లకు గీతం యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్లను ప్రకటించింది. మంగళవారం విశాఖపట్నంలోని గీతం యూనివర్శిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే అగ్నిక్షిపణుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త, డి.ఆర్.డి.వో డైరెక్టర్ జనరల్ అవినాష్ చందర్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను ప్రకటించింది.
ఈ నెల 13న జరిగే యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఈ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నట్లు గీతం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వివిధ రంగాలకు చెందిన రాఘవేంద్రరావు (సినీ రంగం), సుద్దాల అశోక్ తేజ (సాహిత్యం), శైలజాకిరణ్ (పారిశ్రామిక)లకు గౌరవ డాక్టరేట్లకు... అవినాష్ చందర్ (శాస్త్ర సాంకేతిక) డాక్టర్ ఆఫ్ సైన్స్ కి ఎంపిక చేసినట్లు గీతం పేర్కొంది.