Big Freedom Sale
-
అమెజాన్‌కు పోటీ : ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ ఫ్రీడం సేల్’
అంతర్జాతీయ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌కు, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పోటీకి వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ సైతం ‘ది బిగ్ ఫ్రీడం సేల్’ను ప్రకటించింది. 72వ స్వాతంత్య్రం సందర్భంగా ఈ బిగ్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. 2018 ఆగస్టు 10 నుంచి ఆగస్టు 12 వరకు ఈ సేల్‌ను నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఈ సేల్‌లో భాగంగా అందించే ఆఫర్లను మాత్రం ఫ్లిప్‌కార్ట్ బహిర్గతం చేయలేదు. ఈ 72 గంటల సేల్‌లో బ్లాక్‌బస్టర్ డీల్స్‌ను, ప్రైస్ క్రాష్ ఆఫర్లను, రష్ అవర్ డీల్స్‌ను, ఫ్రీడం అవర్‌ను, గంట గంటకు పలు డీల్స్‌ను అందించనున్నట్టు మాత్రం పేర్కొంది. ఈ సేల్‌లో ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి ప్రైస్ క్రాష్ ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దాంతో పాటు ఆగస్టు 10న అంటే ఫ్లిప్‌కార్ట్ సేల్ ప్రారంభమయ్యే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ‘రష్ అవర్’ను చేపట్టనున్నట్టు పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ మూడు రోజుల సేల్‌లో ‘ఫ్రీడం కౌంట్‌డైన్’ను నిర్వహించనుంది. ఇది సాయంత్రం 7.47 గంటల నుంచి 8.18 గంటల వరకు ఉంటుంది. ఈ 31 నిమిషాల్లో పలు కేటగిరీలోని ఉత్పత్తులన్నింటిపై ధర తగ్గింపు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ ఫ్రీడం సేల్‌లో యూజర్లకు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. అంతేకాక షావోమి, శాంసంగ్, ఆపిల్ వంటి పలు బ్రాండ్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నాయని, ల్యాప్‌టాప్, ఆడియో ఈక్విప్మెంట్, కెమెరాలపై 80 శాతం వరకు తగ్గింపు ఉండనుందని సమాచారం. ఈ సేల్‌లో ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయాలని భావించే కస్టమర్లు విష్‌లిస్ట్‌లో మీకు ఇష్టమైన ప్రొడక్ట్‌లను యాడ్ చేయాలని, మీ అకౌంట్‌కు క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను సేవ్ చేసుకోవాలని, డెలివరీ అడ్రస్‌ను ముందస్తుగానే అప్డేట్ చేసుకోవాలని ఫ్లిప్‌కార్ట్ సూచించింది. ఫ్లిప్‌కార్ట్ కంటే ఒక్కరోజు ముందుగానే అమెజాన్ తన ఫ్రీడం సేల్‌ను ప్రారంభింబోతుంది. అమెజాన్ సేల్ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 12 వరకు ఉండనుంది. అమెజాన్ ఇండియా గత వారం ప్రకటించిన ఈ ‘ఫ్రీడం సేల్’లో వన్‌ప్లస్ 6, రియల్‌మి 1, మోటో జీ6 వంటి స్మార్ట్ఫోన్లపై పలు డీల్స్‌ను, ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడం సేల్: బంపర్ డీల్స్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ సేల్'ను ప్రకటించిన ఐదు రోజుల్లోనే మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా ఇండిపెండెన్స్ డే సేల్‌ను ప్రకటించింది. 'బిగ్ ఫ్రీడం సేల్' పేరుతో ఫ్లిప్‌కార్ట్ దీన్ని నిర్వహిస్తోంది. ఈ సేల్ ఆగస్టు 9న ప్రారంభమై, ఆగస్టు 11తో ముగుస్తోంది. బిగ్ ఫ్రీడం సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, హెడ్ఫోన్లు, కెమెరాలు, యాక్ససరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ బంపర్ డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. షావోమి ఫ్యాన్స్‌కు కోసం రెడ్మి నోట్ 4 సేల్‌ను 72 గంటల పాటు నిర్వహించనున్నట్టు కూడా పేర్కొంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు అదనంగా తక్షణ డిస్కౌంట్లను అందించనున్నట్టు చెప్పింది. మొబైల్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్స్... బిగ్ ఫ్రీడం సేల్ కోసం ముందస్తుగానే ఫ్లిప్‌కార్ట్ తన వెబ్సైట్లో పలు డిస్కౌంట్లను ఆవిష్కరించింది. రూ.16,999గా ఉన్న మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కి అందించనున్నట్టు తెలిపింది. అదేవిధంగా రూ.15,999గా ఉన్న మోటో ఎం స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,999కే విక్రయించనున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 12,499 రూపాయలుగా గల లెనోవో కే5 నోట్‌ను 9,999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్ విక్రయించనుంది. కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌పై 1000 రూపాయల డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. దీంతో 9999 రూపాయలుగా ఉన్న కే 6 పవర్ స్మార్ట్‌ఫోన్ రూ.8999కే లభ్యం కానుంది. గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ ధర 67వేల రూపాయల నుంచి 48,999 రూపాయలకు తగ్గించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అదేవిధంగా ఐఫోన్ 6, 32జీబీ మోడల్ ధరను కూడా తగ్గించినట్టు చెప్పింది. రెడ్మి నోట్ 4ను మూడు రోజుల పాటు 1000 రూపాయల తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ విక్రయించనుంది. కేవలం మొబైల్ ఫోన్లపైనే కాక ల్యాప్‌టాప్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై బంపర్ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. స్మార్ట్‌వాచ్‌లపై ఫ్లాట్‌పై 50 శాతం తగ్గింపును ఇవ్వనుంది. ఈ సేల్‌లో కనీసం 71 శాతం వరకు డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌లను ఆఫర్ చేస్తోంది. కాగ, అమెజాన్ కూడా ఆగస్టు 9వ తేదీ అర్థరాత్రి నుంచే గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహిస్తోంది. ఈ దిగ్గజం ఆగస్టు 12 వరకు ఈ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా 100 మిలియన్ ప్రొడక్ట్‌లను అందుబాటులో ఉంచుతుంది. ఎక్స్‌క్లూజివ్‌గా ప్రైమ్ ఓన్లీ డీల్స్‌ను అమెజాన్ అందిస్తోంది.