గ్రామాలను దత్తత తీసుకోనున్న ఎన్నారైలు
వాషింగ్టన్: భారత్లో వెనుకబడిన 500 గ్రామాలను అమెరికాలోని ఎన్నారైలు దత్తత తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటన జూలై 1న సిలికాన్ వ్యాలీలో జరగనున్న ‘బిగ్ ఐడియాస్ ఫర్ బెటర్ ఇండియా’ సదస్సులో వెలువడే అవకాశం ఉంది. ఓవర్సీస్ వలంటీర్ ఫర్ బెటర్ ఇండియా (ఓవీబీఐ) నిర్వహించనున్న ఈ సదస్సులో ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్ ప్రసంగించనున్నారు.
అత్యధిక రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగిత ఆధారంగా 500 గ్రామాలను ఎంపిక చేసినట్లు ఓవీబీఐ అధ్యక్షుడు తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యాలన్న లక్ష్యంతో భూశాస్త్రజ్ఞులు, వ్యవసాయ నిపుణులతో కలసి పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు.