breaking news
Bigg Boss Agnipariksha
-
బిగ్‌బాస్ నుంచి ఇద్దరు అవుట్.. ఈ షోకి పనికిరావంటూ రెడ్ కార్డ్!
మరో నాలుగు రోజుల్లో బిగ్‌బాస్ 9 తెలుగు (Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతోంది. ఈసారి ఇంకా కంటెస్టెంట్ల ఎంపికపై టీమ్ తర్జనభర్జన పడుతూనే ఉంది. మొదటినుంచి నేను రెడీ అంటూ ముల్లెమూట సర్దేసుకున్నవారు పారితోషికం, నెగెటివిటీ గురించి ఆలోచించి ఓ అడుగు వెనక్కు వేస్తున్నారు. మరికొందరేమే ఓసారి ట్రై చేస్తే పోలా అని షోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఇద్దరు ఎలిమినేట్ఇదిలా ఉంటే కామన్ మ్యాన్ కోసం బిగ్‌బాస్ అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఈ షోలో 15 మందిని సెలక్ట్ చేశారు. వారిలో ఐదుగురిని హౌస్‌కు పంపించనున్నారు. జడ్జిలు బిందుమాధవి, నవదీప్, అభిజిత్.. వారిని సానబెట్టి రాటుదేలుస్తున్నారు. అలాగే సరిగా పర్ఫామెన్స్ ఇవ్వనివారిని బయటకు పంపించేస్తున్నారు. అలా లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రసన్నకుమార్, శ్వేతను ఎలిమినేట్ చేశారు. ఈ పంచాయితీ సెట్టవదుఅయితే ప్రసన్నకు రెడ్ కార్డ్ ఇవ్వగానే అతడు నా జర్నీ ఇంతటితో ఆగిపోదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక్కడున్న అందరికంటే నువ్వు వెయ్యి రెట్లు స్ట్రాంగ్.. నిన్ను చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యా.. కానీ, ఈ షో నీ వల్ల కాదు, ఈ లొల్లి, ఈ పంచాయితీ నీతో కాదు.. అని నవదీప్ చెప్పాడు. అభిజిత్ సైతం.. నేను రియాలిటీ షో గెలిచుండొచ్చు, కానీ నువ్వు రియాలిటీలో గెలిచావు అని అభినందించాడు.చదవండి: మర్యాదగా నా ఫోటోలను డిలీట్ చేయండి: హీరోయిన్ వార్నింగ్ -
బట్టలు చించుకుంటున్నారు.. ఎవడ్రా బిగ్‌బాస్? కట్ చేస్తే షోలో కన్నీళ్లు!
మరికొద్దిరోజుల్లో బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను కన్ఫార్మ్ చేసేశారు. అయితే తారలు మాత్రమే ఉంటే ఎలా? సామాన్యులు కూడా ఉండాలని ఆలోచించారు. ఎవరో ఒకర్ని కాకుండా అగ్నిపరీక్ష అనే షో పెట్టి అందులో తమ సత్తా చూపించినవారికే రియాలిటీ షోలో అడుగుపెట్టే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ అగ్నిపరీక్ష మొదలైంది. 15 మంది మధ్య పోటీ జరుగుతోంది.ఓటేయండి ప్లీజ్వీరిలో ఇన్ఫ్లుయెన్సర్ అనూష రత్నం (Anusha Ratnam) కూడా ఉంది. తాజాగా హాట్‌స్టార్ ఆమె ఓట్ అప్పీల్ చేసిన వీడియో రిలీజ్ చేసింది. అందులో అనూష మాట్లాడుతూ.. ఉద్యోగం చేశా, ట్యూషన్ టీచర్‌గా చేశా.. కంటెంట్ క్రియేటర్‌గానూ పని చేశాను. మీలో ఒకరిగా సోషల్ మీడియాలో ఎంటరయ్యాను. ప్రతి తెలుగింటికి నా గొంతు వినిపించాలంటే నన్ను బిగ్‌బాస్‌లోకి పంపించాలి. బిగ్‌బాస్‌కు నన్ను పంపించాలంటే ఓటింగ్ ముఖ్యం. కాబట్టి నాకు ఓటు వేసి పంపించండి.గర్వపడేలా చేస్తా..ఈమెను ఎందుకురా పంపించాం? అని నిరాశ చెందకుండా గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా.. మీ ఇంటి ఆడపిల్ల అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను అంటూ తనకు ఓటేయమని వేడుకుంది. అనూష రత్నం వరంగల్ అమ్మాయి. తండ్రి మరణించడంతో చెల్లి చదువు బాధ్యతను తనే భుజాన వేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆమె తర్వాత ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. ఇటీవల వర్జిన్ బాయ్స్ మూవీ ఈవెంట్లో యాంకరింగ్ కూడా చేసింది. ఎవడ్రా బిగ్‌బాస్?బిగ్‌బాస్‌కు వెళ్లాలని తహతహలాడుతున్న ఈమె గతంలో ఈ షోపై చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదంటే? అందరూ బిగ్‌బాస్, బిగ్‌బాస్ అని బట్టలు చించేసుకుంటున్నారు. ఎవడ్రా బిగ్‌బాస్ అని హేళన చేసింది. కట్ చేస్తే అదే షోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన లైఫ్ స్టోరీ చెప్తూ ఎమోషనల్ కావడంతో ఆమెను నేరుగా టాప్ 15కి పంపించారు. అప్పుడు విష్ణుప్రియ.. ఇప్పుడు అనూషఅక్కడినుంచి నేరుగా బిగ్‌బాస్ 9కి పంపమని వీడియోలు చేస్తోంది అనూష. మరి తను బిగ్‌బాస్ 9లో ఉంటుందా? లేదా? అనేది చూడాలి! గతంలో విష్ణుప్రియ కూడా.. షోకి వెళ్లేదే లేదని తెగేసి చెప్పింది. కట్ చేస్తే గత సీజన్లో ప్రత్యక్షమైంది. ఆట ఆడకుండా పిక్నిక్కు వచ్చినట్లు కూర్చుంది. మరి ఈ అనూష షోకి వెళ్తుందా? వెళ్తే ఎలా ఆడుతుంది? అన్నది చూడాలి! View this post on Instagram A post shared by Telugu Heartful (@telugu_heartful) చదవండి: కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో.. టీజర్ రిలీజ్ -
పడ్డచోటే నిలబడ్డ కల్కి, కంటతడి పెట్టుకున్న జవాన్.. రెండోసారి బంపరాఫర్!
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష షో (Bigg Boss 9 Agnipariksha)లో 15 మంది మిగిలారు. వీరిమధ్య రకరకాల పోటీలు పెడుతూ ఏరోజుకారోజు ఫలానా కంటెస్టెంట్ బెస్ట్, ఫలానా కంటెస్టెంట్ వరస్ట్ అని ప్రకటిస్తున్నారు. మీకు నచ్చిన వ్యక్తికి ఓటేసుకోమని జియోహాట్‌స్టార్‌లో ఓటింగ్ వెసులుబాటు కల్పించారు. నిన్నటి ఎపిసోడ్లో శ్రీజ బెస్ట్ అయితే కల్కిని వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించారు. మరి ఈ రోజు ఏం జరిగిందనేది నేటి (ఆగస్టు 28) ఎపిసోడ్ రివ్యూలో చూసేద్దాం..లీడర్‌గా దాలియాఇప్పటికే నిన్న గేమ్ గెలిచిన ప్రియ.. నేడు కూడా లీడర్‌గానే కొనసాగింది. మరో లీడర్ కోసం టైమ్ గేమ్ ఆడించారు. అందరినీ బాక్సుల్లో కూర్చోబెట్టి సరిగ్గా రెండు నిమిషాల్లో లేవాలన్నారు. అయితే ఫస్ట్, లాస్ట్ లేచినవారు ఆటలో ఎలిమినేట్ అవుతారని ట్విస్ట్ ఇచ్చారు. తొమ్మిదో స్థానంలో నిలబడ్డవారికి టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. అలా దాలియా గెలిచి లీడర్ అవగా.. షాకిబ్, మనీష్ తొలి, చివరి స్థానాల్లో లేచి ఆటలో లేకుండా పోయారు.కుండ పగిలిందిప్రియ, శ్రీజ, పవన్ కల్యాణ్, నిఖిత, నాగ ప్రశాంత్, శ్రేయ ఒక టీమ్‌గా; దాలియా.. ప్రసన్న, శ్వేత, పవన్, అనూష, కల్కి మరో టీమ్‌గా ఏర్పడ్డారు. వీళ్లందరికీ కుండ గేమ్ ఇచ్చారు. వేలితో కుండ కట్టి ఉన్న తాడును పట్టుకోవాలన్నారు. కుండ కింద పడేసినవాళ్లు ఎలిమినేట్ అవడం కాదు కానీ, ఆ కుండలో ఎవరి ఫోటో ఉంటుందో వారు ఎలిమినేట్ అయినట్లు అని మెలిక పెట్టారు. ఈ గేమ్‌లో ప్రియ టీమ్ నుంచి పవన్ కల్యాణ్, దాలియా టీమ్ నుంచి కల్కి చివరి వరకు ఉన్నారు. కంటతడి పెట్టుకున్న జవాన్తన టీమ్ లీడర్ ప్రియ.. కుండ పడేసేయ్ అని చెప్పడంతో పవన్ తనకు సత్తా ఉన్నా సరే, దాన్ని కిందపడేశాడు. తీరా చూస్తే అందులో ప్రియ ఫోటోనే ఉండటంతో వారి టీమ్ ఓడిపోయింది. చివరి వరకు ఉన్న కల్కి కుండలో తన ఫోటోనే ఉంది. అలా తాను గెలవడంతో పాటు తన టీమ్‌ను సైతం గెలిపించింది. అయితే చివరి వరకు వచ్చి ఓడిపోయానని సైనికుడు పవన్ కంటతడి పెట్టుకున్నాడు. నా జీవితంలో ఎప్పుడూ ఇంతే.. ఎంత కష్టపడ్డా చివరకు ఇలాగే జరుగుతుందని ఎమోషనల్ అయ్యాడు. రెండోసారి ఓట్ అప్పీల్ఈ ఎపిసోడ్లో పవన్ కల్యాణ్‌ను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ప్రకటించడంతో అతడు ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ఈ బంపరాఫర్ ఇతడికి రెండోసారి రావడం విశేషం! అలాగే తన టీమ్‌ను గెలిపించిన కల్కికి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. నిన్న వరస్ట్ ప్లేయర్ అన్నవారితోనే సూపర్ అనేలా గేమ్ ఆడింది. మర్యాద మనీష్‌ను వరస్ట్ ప్లేయర్‌గా ప్రకటించారు. చదవండి: 17 ఏళ్ల తర్వాత ఇలా.. లేహ్‌లో చిక్కుకుపోయిన హీరో మాధవన్! -
టాప్ 15లో తనే చెత్త కంటెస్టెంట్.. దమ్మున్న శ్రీజకు సూపర్ పవర్
బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో సామాన్యుల మధ్య పోటీ జరుగుతోంది. వీరిలో టాప్ 15 సెలక్షన్ జరిగిపోయింది. ఈ పదిహనుమంది మధ్యలో గేమ్స్ పెట్టి ఐదు లేదా తొమ్మిది మందిని ఎంపిక చేసి బిగ్‌బాస్ 9వ సీజన్‌కు పంపించనున్నారు. మరి ఎలాంటి టాస్కులు పెట్టారు? అసలు టాప్ 15లో ఎవరున్నారనేది నేటి (ఆగస్టు 27) ఎపిసోడ్ రివ్యూలో చూసేద్దాం..టాప్ 15 వీళ్లే..ప్రసన్న కుమార్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, అనూష రత్నం, దమ్ము శ్రీజ, సైనికుడు పవన్ పడాల, దాలియా, కల్కి, షాకిబ్, శ్వేతా శెట్టి, దివ్య వేలమురి, శ్రేయ, డిమాన్ పవన్, నాగ ప్రశాంత్, హరిత హరీశ్ (మాస్క్ మ్యాన్).. వీరందరూ అగ్నిపరీక్ష షో (Bigg Boss 9 Agnipariksha)లో టాప్ 15కి చేరారు. వీరందరికీ నాగార్జున ఆల్ ద బెస్ట్ చెప్పిన వీడియో ప్లే చేయడంతో కంటెస్టెంట్లు సంతోషించారు. ఇక షో అంతా అరగుండుతో ఉండాల్సిందే అని మాస్క్ మ్యాన్‌కు పెట్టిన కండీషన్‌ను తీసేశారు. అరగుండు ఎందుకులే అంటూ బిందుమాధవి అతడికి గుండు గీసింది.రెండు టీమ్స్..వీళ్లందరికీ 1 నుంచి 15 వరకు స్టాండ్స్ ఇచ్చి.. మీకు అర్హత ఉన్న స్థానాల్లో నిలబడమన్నారు. దీంతో చాలామంది మొదటి మూడు స్థానాల కోసం పోటీపడ్డారు. నీకంటే నాకే అర్హత ఉంది, నువ్వు ఎమోషనల్‌గా వీక్.. ఇలా రకరకాల కారణాలు చెప్పుకుంటూ ర్యాంకుల కోసం కొట్లాట జరిగింది. ఎవరికైనా ఫోన్ చేసి డబ్బులు వేయించుకోవాలన్న టాస్క్‌ను గుర్తు చేసిన మనీష్.. కల్కి ముందే ప్లాన్ చేసి తన ఫ్రెండ్‌కు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండమని చెప్పడంతో ఆ గేమ్ తను గెలిచేసిందన్నాడు. అది నిజం కాదని కల్కి ఎక్కువగా వాదించకపోవడంతో ఒకరకంగా తను దాన్ని ఒప్పుకున్నట్లుగానే కనిపించింది. ఓట్ అప్పీల్ఇక ఈ గేమ్‌లో మొదటి ఆరు స్థానాల్లో ఉన్న వారిని రెడ్ టీమ్‌గా, తర్వాతి ఆరు స్థానాల్లో ఉన్నవారిని బ్లూ టీమ్‌గా విడదీశారు. చిట్టిచివర్లో 15వ స్థానంలో ఉన్న దాలియాను సంచాలక్‌గా పెట్టారు. ఈ గేమ్‌లో ప్రసన్నకుమార్‌ను సంచాలక్ అన్యాయంగా ఎలిమినేట్ చేసింది. దీంతో ఆట యూటర్న్ తిరిగింది. బ్లూ టీమ్ గెలిచి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ దక్కించుకుంది. టీమ్ లీడర్ ప్రియ.. చివరి వరకు ఆడి గెలిపించిన పవన్ పడాలను సెలక్ట్ చేసింది. దీంతో అతడు ఓట్లేయమని అడిగాడు. చెత్త ప్లేయర్బిందుమాధవి.. వరస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఎపిసోడ్‌గా కల్కిని ప్రకటించింది. వాల్యుబుల్ ప్లేయర్‌గా శ్రీజను ప్రకటించగా ఆమె స్టేజీపైకి వచ్చింది. దమ్ము మాటల్లోనే కాదు చేతల్లోనూ ఉంది. నా వాయిస్ చిరాకుగా ఉన్నా ఆట ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఒక్క ఛాన్సిస్తే లేడీ విన్నర్ అయి చూపిస్తా అని తనకు ఓటేయమని అభ్యర్థించింది. ఆమె చలాకీతనం చూసిన అభిజిత్.. నువ్వు షోలో ఉండొద్దని రెడ్ కార్డ్ చూపించా.. కానీ, ఇప్పుడు నా మనసు మారిందన్నాడు. చదవండి: ఒక్కసారిగా కళ్లముందుకు.. మనసంతా సంతోషంగా ఉంది: నిహారిక -
మాట తూలి.. ఇప్పుడు సారీ చెప్పిన నవదీప్
బిగ్‌బాస్ షో మరో రెండు వారాల్లో మొదలవుతుంది. ఈసారి సామాన్యులకు ఎక్కువమందికి అవకాశం కల్పించేందుకు అగ్నిపరీక్ష పేరుతో ఓ షో ప్లాన్ చేశారు. గత నాలుగైదు రోజుల నుంచి పలు గేమ్స్ పెడుతూ టాప్-15 కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేశారు. అయితే సోమవారం ఎపిసోడ్లో ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్.. ఓ లేడీ కంటెస్టెంట్‌పై మాట తూలాడు. ఈ విషయమై విమర్శలు రావడంతో ఇప్పుడు క్షమాపణ చెప్పుకొచ్చాడు.సోమవారం టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్లో కల్కి, షాకీబ్ అనే కంటెస్టెంట్స్ మధ్య చిన్న గేమ్ పెట్టారు. ఎవరికైనా ఫోన్ చేసి ఆన్లైన్ ద్వారా డబ్బులు వేయమని చెప్పారు. అయితే ఈ పోటీలో కల్కికి గేమ్ గురించి క్లియర్‌గా చెప్పారు. షాకీబ్‌కి మాత్రం సరిగా వివరించలేదు. దీంతో అతడికి తక్కువ డబ్బులు మాత్రమే పడ్డాయి. ఇది ఎవరికైనా అన్ ఫెయిర్ అనిపించిందా? అని కూర్చున్న కంటెస్టెంట్స్‌ని నవదీప్ అడగ్గా.. శ్రీజ చేయి ఎత్తింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో హాలీవుడ్ పవర్ హౌస్.. బిగ్ ప్లాన్ రెడీ)దీంతో శ్రీజని నవదీప్ స్టేజీపై రమ్మన్నాడు. అన్ ఫెయిర్ అని ఎందుకు అనిపించింది? అని ఈమెని అడగ్గా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గెలుస్తారని కల్కికి వివరంగా చెప్పారు, కానీ, అతడికి ఆ మాట చెప్పలేదని ధైర్యంగా అనేసింది. దాంతో నవదీప్ కోప్పడ్డాడు. నువ్వు అతిగా ఆలోచించొద్దు. బిగ్‌బాస్ అనేది చాలా భాషల్లో ఎన్నో సీజన్లు జరిగాయి. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్‌ఫెయిర్ అని చెప్పడానికి.. నీకంత సీన్ లేదు. ఇంకోసారి ఇలా చేయకు అంటూ ఆమెను చులకన చేసి మాట్లాడాడు.అయితే 'ఊరి నుంచి వచ్చావ్' అని నవదీప్ కామెంట్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఇప్పుడు తన ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు. ''ఊరి నుంచి వచ్చి' అన్న మాటకు ఫీలైన సున్నితమైన మనసులకు ప్రేమలో సారీ చెబుతున్నా. కుదిరితే క్షమించండి. ఐ లవ్యూ' అని నవదీప్ రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్’లో ప్రేమాయణం.. పెళ్లి చేసుకున్న జంటలివే) -
ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్ ఓవరాక్షన్
బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో టాప్ 15కి ఆరుగురు సెలక్ట్ అయ్యారు. మిగిలిన తొమ్మిది స్థానాల కోసం 16 మంది పోటీపడుతున్నారు. వీరికి డేర్ ఆర్ డై అంటూ రకరకాల టాస్కులిచ్చారు. గెలిచినవారిని టాప్ 15కి పంపించారు. మరి ఎవరెవరు ఫైనల్స్‌లో అడుగుపెట్టారో నేటి (ఆగస్టు 25) ఎపిసోడ్లో చూసేద్దాం..అరగుండుతో బిగ్బాస్లోమొదటగా మాస్క్ మ్యాన్ హరీశ్, సాయికృష్ణను పిలిచి అరగుండు చేసుకోవాలని ఛాలెంజ్ విసిరారు. సీజన్ అంతా అరగుండుతోనే ఉండాలని మెలికపెట్టారు. మాస్క్ మ్యాన్ క్షణం ఆలోచించకుండా వెంటనే ట్రిమ్మర్ అందుకుని అరగుండు గీసుకున్నారు. దీంతో అతడిని విజేతగా ప్రకటించి టాప్ 15కి పంపించారు. నెక్స్ట్ దమ్ము శ్రీజ, ఊర్మిళను పిలిచి ఐయామ్ లూజర్ అని నుదుటిపై పచ్చబొట్టు వేసుకోవాలన్నారు. ఊర్మిళ మోడల్ కాబట్టి తాను రిజెక్ట్ చేసింది. శ్రీజ ధైర్యంగా ముందుకు వచ్చింది. అయితే ఐయామ్ లూజర్కు బదులుగా ఐ లవ్ బిగ్‌బాస్ అని పచ్చబొట్టు వేయించారు.పది నిమిషాల్లో కిలో బరువుతర్వాత సోల్జర్ పవన్ కల్యాణ్, అబూకు 10 నిమిషాల్లో కిలో బరువు పెరగాలని బిర్యానీ, బర్గర్ ముందు పెట్టారు. ఈ గేమ్‌లో పవన్ గెలిచాడు. ఒంటిచేత్తో బెలూన్ పగలగొట్టాలన్న గేమ్‌లో ప్రియ రెండు చేతులుపయోగించి దాలియాను ఓడించింది. కానీ, జడ్జిలు దాన్ని గమనించకపోవడంతో ప్రియను విజేతగా ప్రకటించి ఫైనల్స్‌కు పంపించారు. షాకీబ్, కల్కిలకు శ్రీముఖి ఓ ఛాలెంజ్ ఇచ్చింది. ముందుగా షాకీబ్ను బయటకు పంపేసి.. ఎవరికైనా ఒకరికి కాల్ చేసి అర్జంట్‌గా డబ్బులు వేయించుకోవాలి. (Bigg Boss Agnipariksha)షాకీబ్‌కు అన్యాయంఎవరి అకౌంట్లో ఎక్కువ అమౌంట్ పడుతుందో వారు నెక్స్ట్ లెవల్‌కు వెళ్తారంది. దీంతో కల్కి తన ఫ్రెండ్‌కు రెండుసార్లు ఫోన్ చేయగా రూ.90 వేలు అకౌంట్లో పడ్డాయి. తర్వాత షాకీబ్ను స్టేజీపైకి పిలిచారు. కానీ మరీ అంత క్లారిటీగా టాస్క్ చెప్పలేదు. ఎవరికైనా కాల్ చేసి వీలైనంత డబ్బు నీ అకౌంట్లో వేయించుకో అంది శ్రీముఖి. కేవలం డబ్బు పడితే చాలేమో అనుకుని రూ.10 వేలు అడిగాడు. అతడి అమాయకత్వం చూసి మరో ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు అతడి అకౌంట్లో రూ.50 వేలు పడ్డాయి.దమ్మున్న శ్రీజఎవరి దగ్గర ఎక్కువుంటే వారే విజేత అన్నది స్పష్టంగా షాకీబ్‌కు చెప్పుంటే బాగుండేది అని అందరికీ అనిపించింది. ఈ గేమ్‌లో కల్కి గెలిచింది. తనకు క్లియర్‌గా టాస్క్ వివరించి చెప్పలేదని షాకీబ్ ప్రశ్న లేవనెత్తాడు. దీంతో శ్రీముఖి.. ఎవరికైనా అన్‌ఫెయిర్ అనిపించిందా? అని అడగ్గా.. దమ్ము శ్రీజ చేయెత్తింది. తన తప్పు గమనించి ప్రశ్నిస్తారని ఊహించని శ్రీముఖి.. అయితే కూర్చో అంటూ శ్రీజను మాట్లాడనివ్వలేదు. నవదీప్, శ్రీముఖి ఓవరాక్షన్కానీ నవదీప్ మాత్రం శ్రీజను స్టేజీపైకి పిలిచాడు. ఎందుకు అన్‌ఫెయిర్‌గా అనిపించిందని ప్రశ్నించాడు. అందుకు శ్రీజ.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గెలుస్తారని కల్కికి వివరంగా చెప్పారు, కానీ, అతడికి ఆ మాట చెప్పలేదని ధైర్యంగా అనేసింది. దాంతో నవదీప్ కోప్పడ్డాడు. నువ్వు అతిగా ఆలోచించొద్దు. బిగ్‌బాస్ అనేది చాలా భాషల్లో ఎన్నో సీజన్లు జరిగాయి. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్‌ఫెయిర్ అని చెప్పడానికి.. నీకంత సీన్ లేదు. ఇంకోసారి ఇలా చేయకు అంటూ ఆమెను చులకన చేసి మాట్లాడాడు. మొత్తానికి నాలుగు ఎపిసోడ్లో హరీశ్, శ్రీజ, ప్రియ, కల్కి.. టాప్ 15లో అడుగుపెట్టారు. చదవండి: నారీమణులతో.. ఒకే ఒక్కడు.. ఫోటో వైరల్ -
భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్‌బాస్‌లో ఛాన్స్, మా వాళ్లే వెనక్కులాగారు!
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha)కు వేలాదిమంది అప్లై చేశారు. వారిలో ట్రాన్స్‌జెండర్ అంకితనాయుడు ఒకరు. పలు రౌండ్లలో ముందుకు వెళ్లిన ఆమె అగ్నిపరీక్ష స్టేజీపై మాత్రం కనిపించలేదు. అందుకు గల కారణాన్ని, తన జర్నీని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అంకిత నాయుడు మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఇంట్లో ఎవరూ లేనప్పుడు చీరకట్టుకుని, బొట్టు పెట్టుకుని గాజులు వేసుకునేదాన్ని. అక్కల పెళ్లయ్యాకే..18 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను అమ్మాయిలా మారాలని నిర్ణయించుకున్నాను. ఇద్దరు అక్కల పెళ్లయ్యే వరకు ఆగి ఆ తర్వాతే అమ్మాయిగా మారాను. ఈ మధ్య నాకు బిగ్‌బాస్ షోలో ఛాన్స్ వచ్చింది. బిగ్‌బాస్ షో చాలా పెద్ద ప్లాట్‌ఫామ్. అలాంటి ప్లాట్‌ఫామ్‌కు నేను సెలక్ట్ అయ్యానని తెలిసి సంతోషపడ్డాను. నాకు మొదటి నుంచీ ఈ షో అంటే ఇష్టం!భిక్షాటన చేశా.. తర్వాత..అయితే గతంలో నేను భిక్షాటన చేశాను, వేశ్యగా మారాను, షాప్ ఓపెనింగ్స్‌కు వెళ్లాను. ఇవన్నీ దాటుకుని వచ్చాను. ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఛాన్స్ వస్తే అక్కడ నన్ను నేను నిరూపించుకోవచ్చనుకున్నాను. నేను వెళ్లి నా కమ్యూనిటీకి ఆదర్శంగా నిలవాలనుకున్నాను. గతంలో బిగ్‌బాస్ (Bigg Boss Reality Show)కు వెళ్లిన ప్రియాంక సింగ్.. చాలామందికి డ్రీమ్‌గర్ల్ అయిపోయారు. తను నాకు రోల్‌మోడల్. స్టేజీపైకి వెళ్లకుండానే..ఈ సీజన్లో నాకు ఆఫర్ వచ్చింది. కానీ, నా కమ్యూనిటీ వాళ్లు నన్ను వెనక్కు లాగేశారు. అగ్నిపరీక్ష షోలో శ్రీముఖి నన్ను స్టేజీపైకి రమ్మని ఆహ్వానించింది. ఓ పాట కూడా ప్లే చేశారు. ఇంతలో వెళ్లకుండానే ఆపేశారు. మా కమ్యూనిటీ వాళ్లు.. బిగ్‌బాస్ టీమ్‌కు నేను వేశ్యగా పనిచేసినప్పటి వీడియోలు పంపారు. దాంతో వాళ్లు నన్ను తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీనివల్ల మీకే కాదు, షోకి సైతం నెగెటివిటీ వస్తుందన్నారు. వాళ్ల ఆలోచనప్రకారం వాళ్లు కరెక్టే! ఎప్పుడో జరిగినదాన్ని..మా కమ్యూనిటీ వాళ్లే ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎప్పుడో జరిగినదాన్ని ఇప్పుడు తీసి చూపించడం నచ్చలేదు. మా వర్గాన్ని ముందుకు తీసుకెళ్తాం అని బీరాలు పలికే లీడర్స్.. నేను సెలక్ట్ అయితే ఎందుకు జీర్ణించుకోలేకపోయారు? పైగా అదే లీడర్ అక్కడ సెలక్ట్ అయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె ఎంపికవలేదు. మా వాళ్లు నన్ను నెగిటివ్ చేసి ఇంకెప్పుడూ బిగ్‌బాస్‌కు వెళ్లకుండా చేశారు అని అంకిత నాయుడు చెప్పుకొచ్చింది.చదవండి: సీక్రెట్‌గా వీడియో షూట్.. కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొణె -
సిద్దిపేట మోడల్‌కు షాక్.. 16 మందికి అసలైన అగ్నిపరీక్ష!
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Aagnipariksha)లో చిరాకు తెప్పించిన కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు. కొందరిని హోల్డ్‌లో పెట్టారు. మరికొందరిని నేరుగా టాప్ 15లోకి పంపించారు. మరి మూడో ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం.. మొదటగా ఆర్మీ జవాన్ వచ్చాడు. అతడికి యాక్టింగే ఎక్కువ ఇష్టమన్నాడు. ఒకవేళ బిగ్‌బాస్ గెలిచి ఆఫర్లు వస్తే ఆర్మీకి రిజైన్ చేస్తానన్నాడు. షో నుంచి ఎలిమినేట్ అయితే ఆర్మీకి వెళ్లిపోతానన్నాడు. అతడికున్న క్లారిటీ జడ్జిలకు నచ్చింది. అలా అని ఇతడిని నేరుగా టాప్ 15కి పంపించలేదు, ఎలిమినేట్ కూడా చేయలేదు. ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారు.సిద్దిపేట మోడల్‌కు షాక్సింగర్, డ్యాన్సర్ అంటూ స్టేజీపైకి వచ్చిన షకీం.. స్టేజీపై సరిగా డ్యాన్స్ చేయలేకపోయాడు. అయినా ఇతడికి నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్‌కు పంపించాడు. సిద్దిపేట మోడల్ స్టేజీపై రాగానే అతడి మాట తీరు జడ్జిలకు నచ్చలేదు. నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీవి అంటూ పంపించేశారు. ఇన్ఫ్లుయెన్సర్ అనూష రత్నం తన స్టోరీ చెప్పింది. తండ్రి లేకపోయినా తనే కుటుంబం కోసం నిలబడి అప్పులు తీర్చానని, చెల్లిని విదేశాల్లో చదివించానని పేర్కొంది. 98 మంది ప్రపోజ్అయితే నామినేషన్స్ చేయమంటే మాత్రం తడబడింది. అప్పటికే తన స్టోరీ విని కరిగిపోయిన జడ్జిలు ముగ్గురూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి ఆమెను టాప్ 15లోకి పంపించారు. తనకు 98 మంది ప్రపోజ్ చేశారంటూ స్టేజీపైకి వచ్చిన శ్రీకృష్ణను, డాక్టర్ నిఖితను.. మరికొందరిని హోల్డ్‌లో పెట్టారు. యూకే నుంచి బిగ్‌బాస్ కోసమే వచ్చానన్న శ్వేతను టాప్ 15లోకి పంపించారు. ఈమె తల్లికి క్యాన్సర్ కాగా.. ఈ ఎపిసోడ్ వచ్చేకంటే ముందే ఆమె కన్నుమూయడం విషాదం! రివ్యూయర్ ఉత్తర ప్రశాంత్, ఖమ్మం టెడ్డీ బేర్ సహా చాలామందిని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసి పంపించేశారు. 19 ఏళ్ల అబ్బాయికి అన్యాయం?19 ఏళ్ల అమ్మాయి శ్రేయను ఎంకరేజ్ చేసిన జడ్జిలు అదే వయసులో ఉన్న అబ్బాయి జనిత్‌ను మాత్రం ఎలిమినేట్ చేయడం గమనార్హం! ఒక ప్రమాదంలో తల్లికి 80% గాయాలయ్యానని, అయినా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషించిందన్నాడు. తండ్రి చనిపోయినా అన్నీ తనే చూసుకుందన్నాడు. ఒకమ్మాయి విదేశాల్లో చదివించి, మరో అమ్మాయికి పెళ్లి చేసి, అతడిని చదివిస్తోంది అని తల్లి గొప్పదనం చెప్పాడు. అది విని జడ్జిలు లేచి చప్పట్లు కొట్టారు. తాను ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నానన్నాడు. జీవితంపై క్లారిటీ ఉన్న ఇతడిని రిజెక్ట్ చేశారు.టాప్ 15 కోసం పోటీఫైనల్గా ఇప్పటివరకు టాప్ 15లో ఆరుగురిని సెలక్ట్ చేశారు. 16 మందిని హోల్డ్‌లో పెట్టారు. ఈ పదహారు మందికి రకరకాల టాస్కులు పెట్టి వారిలో 9 మందిని టాప్ 15లో చేర్చనున్నారు. మరి ఆ టాస్కులేంటి? ఎవరు సెలక్ట్ అవుతారన్నది రేపటి ఎపిసోడ్ రివ్యూలో చూద్దాం..చదవండి: శ్రీలీల సక్సెస్ వెనుక జూనియర్ ఎన్టీఆర్.. అప్పుడే డిసైడయ్యా! -
అగ్నిపరీక్ష: చిరాకు తెప్పించిన అతడు, బిందు, శ్రీముఖినే ఓడించిన ఆమె
బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో 45 మంది రానున్నారు. వీరిలో ఫైనల్స్‌కు 15 మందిని సెలక్ట్ చేసి అందులో 5 లేదా 9 మందిని బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌కు పంపించనున్నారు. ఈ ఎంపిక బాధ్యత బిందుమాధవి, నవదీప్, అభిజిత్‌లపై ఉంది. ఫస్ట్ ఎపిసోడ్లో ఎనిమిది మందిని టెస్ట్ చేశారు. మరి రెండో ఎపిసోడ్లో ఎవరెవరు వచ్చారు? జడ్జిలు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో చూసేద్దాం..మాటల తుపానుమొదటగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ డెమాన్ పవన్ స్టేజీపైకి వచ్చాడు. యాక్టింగ్ కోసమే బిగ్‌బాస్ (Bigg Boss 9 Telugu)కు రావాలనుకుంటున్నానన్న ఇతడు శరీరంపై రెండు టైర్లు పెట్టుకుని 25 పుషప్స్ చేశాడు. ఇతడికి ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. దమ్ము శ్రీజ.. రాగానే ఓవర్ చేసింది. ఆమె నోటివాగుడుకు అందరూ బెంబేలిత్తిపోయారు. ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. నీ ఆడపులి టైటిల్ నేను లాగేసుకుంటానని బిందుమాధవితో సవాలు చేసింది. ఆమె మాటలు ఎవరికీ నచ్చలేదు. నవదీప్ ఒక్కడే తనకు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.పేడ రుద్దుకోమనగానే..తర్వాత తేజ సజ్జ మిరాయ్ ప్రమోషన్స్ జరిగాయి. తర్వాత వచ్చిన మోడల్ ఊర్మిళ చౌహాన్‌కు మాస్ టాస్కులిచ్చారు. పిడకలు చేయమనగానే చేసింది. చెంపలకు పేడ రుద్దుకోమనగానే బుగ్గలపై పూసుకుంది. ఈమెక్కూడా నవదీప్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. చిదానందశాస్త్రి, గొంగలి కప్పుకుని వచ్చిన నర్సయ్య తాత, మిస్ ఇండియా మాధురిని జడ్జిలు ఎలిమినేట్ చేశారు. అడ్వొకేట్ నాగప్రశాంత్కు నవదీప్ మాత్రమే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.అబ్బాయిలే గ్రేట్19 ఏళ్ల శ్రేయకు ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి టాప్ 15కి పంపించారు. అబ్బాయిలే గ్రేట్ అంటూ అమ్మాయిలను చులకన చేసిన రవి అనే కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశారు. ఆడవాళ్లు ప్రెగ్నెన్సీలో 30 నిమిషాలు పురిటినొప్పులు భరిస్తారు, అదొక్కటే గ్రేట్ అన్నట్లుగా మాట్లాడాడు. తొమ్మిది నెలల జర్నీ అతడి కళ్లకు కనిపించలేదా? అని అక్కడున్నవాళ్లు షాకయ్యారు. కోపంతో బిందుమాధవి అతడిని గెంటేసినంత పని చేసింది. సింగర్ శ్రీతేజ్‌కు ఒక ఛాన్సిద్దామంటూ అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. తర్వాత ఎవరూ ఇంట్రస్టింగ్‌గా లేరంటూ దాదాపు ఏడుగురిని వెంటవెంటనే ఎలిమినేట్ చేశారు (Bigg Boss Agnipariksha).బిందు, శ్రీముఖిని ఓడించిన కల్కిఅనంతరం ఫోర్బ్స్ అండర్ 30లో నిలిచిన మర్యాద మనీష్ స్టేజీపైకి వచ్చాడు. ఇతడికి బిందు మినహా మిగతా ఇద్దరూ గ్రీన్ ఫ్లాగ్‌తో నెక్స్ట్ లెవల్‌కు పంపించారు. మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి స్టేజీపైకి వచ్చి.. మా నాన్నకు ఆడపిల్లలంటే ఇష్టం లేరు. కానీ మా నాన్నకు ముగ్గురం ఆడపిల్లలమే అంటూ తన స్టోరీ చెప్పింది. హ్యాండ్ రెజ్లింగ్‌లో బిందు, శ్రీముఖిని ఓడించింది. ఈమెక్కూడా బిందుమినహా మిగతా ఇద్దరూ ఓ ఛాన్సిద్దామని గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.చదవండి: ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ -
పేడ రుద్దుకున్న కంటెస్టెంట్.. శ్రీముఖికి ఇచ్చిపడేసిందిగా!
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)లో అడుగుపెట్టాలన్నది చాలామంది ఆశ. ఎలాగైనా సరే బిగ్‌బాస్ టీమ్ కంట్లో పడాలని చిత్రవిచిత్ర పనులు చేసిన జనాలున్నారు. అందులో మల్టీస్టార్ మన్మద రాజా ఒకరు. ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇతడు అగ్నిపరీక్ష షోకి సెలక్ట్ అవగా.. ఫస్ట్ ఎపిసోడ్లో స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు.పేడ రుద్దుకోమని టాస్క్కానీ ఏడుపొక్కటే ఆయుధం అన్నట్లుగా కేవలం సింపతీ కోసమే ట్రై చేశాడు. ఇది చూసి జడ్జిలు ముగ్గురూ అతడిని రిజెక్ట్ చేశారు. బిగ్‌బాస్‌లో ఛాన్స్ కావాలంటూ సోషల్ మీడియాలో పిచ్చిపనులు చేసే వాళ్లందరికీ హౌస్‌లో ఎంట్రీ ఉండదని అతడి ఎలిమినేషన్‌తో క్లారిటీ ఇచ్చేశారు. ఇకపోతే తాజాగా సెకండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో పేడ రుద్దుకోమని చెప్పగానే ఓ లేడీ కంటెస్టెంట్ ఏమాత్రం ఆలోచించకుండా బుగ్గలపై పేడ పూసుకుంది. మరో లేడీ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ స్టేజీపై కాస్త అతిగా ప్రవరిస్తూ జడ్జిలకు చిరాకు తెప్పించింది.శ్రీముఖికి కౌంటర్ఆమె అరుపులకు శ్రీముఖి స్పందిస్తూ.. ఇలా మొత్తుకుంటే పిల్ల ఏం అరుస్తుందని టీవీలు బంద్ చేస్తారని సరదాగా అంది. అలాగైతే సీజన్ 3లో నువ్వున్నప్పుడే టీవీలు ఆఫ్ చేసేవారని శ్రీజ కౌంటరిచ్చింది. ఆమెకు అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇవ్వగానే.. ఓ, పవర్‌ఫుల్‌గా ఉండేవాళ్లను హ్యాండిల్ చేయలేక రెడ్ ఇచ్చారా? అని నిలదీసింది. మరో ప్రోమోలో గొంగలి కప్పుకుని వచ్చిన తాత నర్సయ్య తన పాటతో అదరగొట్టాడు. ఈ ఎపిసోడ్లో మిరాయ్ ప్రమోషన్స్ కూడా జరిగాయి. చదవండి: అగ్నిపరీక్ష: బిగ్‌బాస్ కోసం నిరాహార దీక్ష.. గెంటేసిన జడ్జిలు -
అగ్నిపరీక్ష: బిగ్‌బాస్ కోసం నిరాహార దీక్ష.. గెంటేసిన జడ్జిలు
బిగ్‌బాస్ 9వ సీజన్లో సామాన్యుల ఎంట్రీ ఉండబోతోంది. కానీ ఆ సామన్యులెవరన్నది తేల్చేందుకు అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha) షో మొదలుపెట్టారు. ఇందులో 45 మంది పాల్గొననున్నారు. సామాన్యుల కలను నెరవేర్చడానికే ఈ అగ్నిపరీక్ష అంటూ తొలి ఎపిసోడ్ జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. మరి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం..రెడ్ ఫ్లాగ్ ఇచ్చారంటే ఎలిమినేట్అగ్నిపరీక్ష స్టేజీపై వచ్చిన సామాన్యులకు బిగ్‌బాస్ షోలో ఉండే అర్హత ఉందా? లేదా? అన్నది జడ్జిలు నవదీప్, అభిజిత్, బిందుమాధవి తేల్చనున్నారు. ఏ కంటెస్టెంట్కైనా వీరు ముగ్గురూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చారంటే మాత్రం అతడు/ఆమె నేరుగా ఎలిమినేట్ అయినట్లు లెక్క! మొదటగా విజయవాడ నుంచి దివ్య నిఖిత నైటీలో వచ్చింది. ఈమె ఎంబీబీఎస్ చదువుతోంది. ఒక సాయిపల్లవి, ఒక శ్రీలీల.. ఒక దివ్య నిఖితలా అందరికీ గుర్తుండిపోవాలన్నదే తన కోరిక అంది.డేర్ అండ్ డాషింగ్అభిజిత్ను నామినేట్ చేయమని టాస్క్ ఇవ్వగా.. ఒకే ఒక మైండ్ టాస్క్ ఆడి గెలిచావు. ఎప్పుడూ సోఫాలోనే కూర్చుంటూ గేమ్ కంటే కూడా వేరేవాళ్లమీదే ఫోకస్ పెట్టావు. నీ ఆట నాకు నచ్చలేదు. గేమ్‌పై ఫోకస్ లేని నిన్ను నామినేట్ చేస్తానంటూ ధైర్యంగా మాట్లాడింది. తర్వాత నాన్న గురించి చెప్తూ ఎమోషనలైంది. ఆమెకు ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు.మాస్క్ మ్యాన్ ఎంట్రీతర్వాత మాస్క్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఏడేళ్లుగా మాస్క్ వేసుకునే తిరుగుతున్నట్లు చెప్పాడు. ఇతడి పేరు హృదయ్ మానవ్ అని తెలిపాడు. తిక్కగా మాట్లాడుతున్న అతడి వైఖరి నచ్చిక అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇవ్వడంతో మానవ్ హర్టయ్యాడు. నన్ను చూడగానే జడ్జి చేస్తున్నారు.. బిగ్‌బాస్ కోసం ఈ మాస్క్ వేసుకోలేదన్నాడు. గత మూడు సీజన్ల నుంచి మంచి కంటెస్టెంట్లే రాలేదు, అందుకే నేనొచ్చానని తన గురించి తాను ఓవర్‌గా చెప్పుకున్నాడు. పెద్దావిడకు ఛాన్సిచ్చిన అభిజిత్దీంతో బిందుమాధవి.. మాస్క్ మ్యాన్‌కు లూజర్ అనే బోర్డు వేసింది. అయినా అతడు వెనక్కు తగ్గలేదు, జడ్జిలపై ఫైర్ అయ్యాడు. సరే, నీగురించి ఇంకాస్త తెలుసుకోవాలంటూ నవదీప్ ఒక్కడే.. అతడికి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. మూడో కంటెస్టెంట్‌గా.. ముసలి వయసులో ఉన్న కేతమ్మ వచ్చింది. తనకు ఛాన్సిద్దామని అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. నాలుగో కంటెస్టెంట్‌గా ప్రియా శెట్టి వచ్చింది. ముఖంలోనే కాకుండా తన మాటల్లోనూ క్యూట్‌నెస్ ఉంది. ఆమెకు అభిజిత్ మినహా ఇద్దరు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. మల్టీ స్టార్ మన్మధ రాజాకు ఝలక్ఐదో కంటెస్టెంట్‌గా మల్టీ స్టార్ మన్మధ రాజా వచ్చాడు. బిగ్‌బాస్‌లో ఛాన్స్ కోసం నిరాహార దీక్ష చేశానన్నాడు. తనకు ఆస్తులు లేవు, అయినవారు లేరంటూ ఏడుస్తూ సింపతీ పొందే ప్రయత్నం చేశాడు. సింపతీకి చోటు లేదంటూ జడ్జిలు అతడిని బయటకు పంపించేశారు. ఆరో కంటెస్టెంట్‌గా సయ్యద్ అబూ వచ్చాడు. నవదీప్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. ఏడో కంటెస్టెంట్‌గా దివ్యాంగుడు ప్రసన్నకుమార్ వచ్చాడు. ఒంటికాలుతోనే మారథాన్ చేసినట్లు తెలిపాడు. అతడి టాలెంట్‌కు అందరూ ఫిదా అయ్యారు. జడ్జిలు ముగ్గురూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. గ్రీన్ ఫ్లాగ్ వచ్చిన కంటెస్టెంట్లు నెక్స్ట్ రౌండ్‌కు వెళ్తారు.చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్ -
Bigg Boss Agnipariksha: ప్రోమో సూపర్.. కానీ టైమింగే తేడా!
బిగ్‌బాస్ 9 కంటే ముందు వస్తోన్న బిగ్‌బాస్ అగ్నిపరీక్ష షో (Bigg Boss Agnipariksha)పై మంచి బజ్ ఉంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ గురించి రెండు ప్రోమోలు రిలీజ్ చేయగా తాజాగా మూడో ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఫేమస్ యూట్యూబర్ గంగవ్వ వయసులో ఉన్న ఓ ముసలమ్మ స్టేజీపై అడుగుపెట్టింది. నెత్తిన బోనంతో పాటలు పాడుకుంటూ జోష్‌గా వచ్చింది. నల్గొండ దగ్గర కొండతిరుమలగిరి మా ఊరు.. చాలా కష్టాలు పడ్డాను సర్.. నా చిన్నబిడ్డ నన్ను, నా భర్తను పోషిస్తోంది. నా భర్తకు పక్షవాతం వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మీ అందరినీ కలిశా.. ఈ జన్మకు ఇంతే చాలు అని ఎమోషనలైంది.మాకు నిద్రుండదుఆయన స్టోరీ విన్న అభిజిత్.. మీ జీవితంలో సగం కూడా నేను చూడలేదు, కానీ లోపల ఆట నేను చూశాను. ఆ గేమ్ మీకు చాలా కష్టంగా ఉంటుందవ్వా.. అన్నాడు. అందుకామె మాత్రం నాకు తోచినంత ఆడతా.. అని తన ఆసక్తిని చూపించింది. తర్వాత దివ్యాంగుడు ప్రసన్నకుమార్ స్టేజీపైకి వచ్చాడు. అతడి స్టోరీ విన్న నవదీప్.. ఈ కథను మేము ప్రపంచానికి చూపించకపోతే మాకు నిద్ర ఉండదు అంటూ గ్రీన్ సిగ్నల్ చూపించాడు.అర్ధరాత్రి షోఇదంతా బాగానే ఉంది కానీ షో టైమింగ్స్ మాత్రమే కాస్త తేడాగా ఉంది. ఎప్పుడూ బిగ్‌బాస్ రాత్రి 9 లేదా 9.30 గంటల ప్రాంతంలో వచ్చేది. కానీ ఈ అగ్నిపరీక్ష మాత్రం ఎటూ కాకుండా అర్ధరాత్రి 12 గంటలకు రానుంది. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు జియో హాట్‌స్టార్‌లో కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేస్తారు. ఫలానా సమయం అని లేకుండా రోజులో మీకు నచ్చినప్పుడు దాన్ని చూసుకోవచ్చన్నమాట! ఇది చాలామందికి నచ్చడం లేదు. అగ్నిపరీక్షకు ప్రత్యేక సమయం కేటాయిస్తేనే బాగుంటుంది, ఇలా అర్ధరాత్రి అప్లోడ్ చేయడం అనవసరం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ నటి -
కోపమొస్తే కొట్టేస్తా.. మీరేమైనా దేవుళ్లా?.. నోరెళ్లబెట్టిన జడ్జిలు
వచ్చే నెలలో తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. అయితే అప్పటివరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss 9 Agnipariksha) మొదలుకానుంది. సామాన్యుల ఎంపిక కోసం ఈ షో డిజైన్ చేశారు. వేలాదిమంది అప్లై చేసుకుంటే బిగ్‌బాస్ టీమ్ వారిని జల్లెడపట్టి 45 మందిని సెలక్ట్ చేశారు. వారి మాట, ఆట తీరు బట్టి తొమ్మిదో సీజన్‌కు ఎవర్ని సెలక్ట్ చేయాలి? ఎవర్ని రిజెక్ట్ చేయాలన్నది బిందు మాధవి, నవదీప్, అభిజిత్ చేతిలో పెట్టారు.నీకొక్కడికే హృదయం ఉందా?ఈ క్రమంలో తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఓ మాస్క్ మ్యాన్ స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. నీ పేరేంటని జడ్జిలు అడగ్గా.. స్కిన్ నేమ్ మానవ్.. సోల్ నేమ్ హృదయ్ మానవ్ అన్నాడు. హృదయ్ మానవ్ పేరుకు అర్థమేంటన్న ప్రశ్నకు.. హృదయమున్న మానవుడు అని సింపుల్‌గా రిప్లై ఇచ్చాడు మాస్క్ మ్యాన్. అంటే మా అందరికీ హృదయాలు లేవా? అని నవదీప్ అడగ్గా పోనీ, అలాగే అనుకోండి అని ర్యాష్ ఆన్సరిచ్చాడు. కోపమొస్తే కొట్టేస్తా..చిన్నప్పటి నుంచి కోపిష్టిని, కోపమొస్తే ఆగను.. కొట్టేస్తా! అనడంతో జడ్జిలు షాక్‌తో నోరెళ్లబెట్టారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేది ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి కాదన్న మాటకు అభిజిత్ ఏకీభవించలేదు. ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు? అని అడిగితు.. ఫ్రెండ్స్‌కు ట్రోఫీ ఇచ్చేస్తామా? అని మాస్క్ మనిషి సెటైర్ వేశాడు. ఇతడి తీరు నచ్చక అభిజిత్ రెడ్ సిగ్నల్ చూపించాడు. దీంతో అతడు నాకు ఛాన్సివ్వాలని లేకపోతే ఓకే.. కానీ నా క్యారెక్టర్‌ను డిసైడ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు.జడ్జి చేయడానికి దేవుళ్లా?జడ్జి చేయడానికే ఇక్కడ కూర్చున్నామని నవదీప్ కౌంటరిచ్చాడు. అప్పటికీ అతడు మీరేమైనా దేవుళ్లా అంటూ.. మాట్లాడుతూనే పోయాడు. ఇక బిందు మాధవి.. అతడి మెడలో లూజర్(ఓటమిపాలు) బోర్డు తగిలించింది. ఈ ప్రోమో చూసిన జనాలు.. మాస్క్ మనిషి ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. అని కామెంట్లు చేస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష షో హాట్‌స్టార్‌లో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. చదవండి: నాగచైతన్యపై సెటైర్లు వేసిన ఈ బుడ్డొడు..ఇలా మారిపోయాడేంటి? -
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష.. అయ్యో, అతడ్ని ఎలిమినేట్ చేశారా?
జనాల దృష్టిని ఆకర్షించేందుకు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha) అంటూ ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. కామన్ మ్యాన్‌గా షోలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ మీదే అంటూ ఊరించడంతో దాదాపు 20 వేల మంది అప్లై చేసుకున్నారు. దశలవారీగా వారిని ఫిల్టర్ చేసి చివరకు 45 మందిని ఎంపిక చేశారు. వీరికి అగ్నిపరీక్ష అనే కార్యక్రమంలో రకరకాల టాస్కులు పెట్టి అందులో కనీసం ఐదుగురిని బిగ్‌బాస్ 9వ సీజన్ (Bigg Boss 9 Telugu)కు సెలక్ట్ చేయనున్నారు.దివ్యాంగుడి పేరిట రికార్డులుఈ షో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలో దివ్యాంగుడు ప్రసన్నకుమార్ సహా పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కనిపించారు. అందులో గంగవ్వ వయసులో ఉన్న మహిళ, మాస్క్ మ్యాన్.. ఇలా విభిన్న వ్యక్తులున్నారు. అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన వ్యక్తి ప్రసన్నకుమార్. ఇతడు ఫోటోగ్రాఫర్, ట్రావెలర్, బైక్ రైడర్, లెక్చరర్ కూడా! మారథాన్‌లో పరిగెత్తి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.అగ్నిపరీక్ష నుంచి ఎలిమినేట్ఇలాంటి వ్యక్తి.. షోలో అడుగుపెడితే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని అందరూ భావించారు. అతడు కచ్చితంగా బిగ్‌బాస్ 9వ సీజన్లో ఉండాల్సిందేనని బలంగా కోరుకున్నారు. కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం అతడు ఎలిమినేట్ అయ్యాడట! శ్వేతాశెట్టి అనే అమ్మాయితో పాటు ప్రసన్నకుమార్ ఎలిమినేట్ అయినట్లు ఓ వార్త వైరలవుతోంది. ఇది చూసిన జనాలు నిరాశచెందుతున్నారు. ప్రసన్న కుమార్‌ను కనీసం బిగ్‌బాస్ హౌస్ వరకైనా పంపించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రసన్న ఎలిమినేషన్ నిజమేనా? అతడు 9వ సీజన్లో అడుగుపెడతాడా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది. View this post on Instagram A post shared by prasanna kumar aliga (@prasanna_kumar_aliga)చదవండి: ఇండస్ట్రీలో మా పరిస్థితి చాలా దారుణం: ప్రముఖ సింగర్ ఆవేదన -
అగ్నిపరీక్ష.. ఏంటిది? బిగ్‌బాస్ వాయిస్ తేడాగా ఉందే!
ప్రతి ఏడాది బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show) వస్తుంది. అది కామన్.. కానీ, ఈసారి బిగ్‌బాస్ కంటే ముందు అగ్నిపరీక్ష వస్తోంది. సామాన్యులను సెలక్ట్ చేసే ప్రోగ్రామ్ ఇది. ఏదో ఆషామాషీగా కాకుండా ఎంతో ఘనంగా ఈ అగ్నిపరీక్ష ప్రోగ్రామ్‌ను జరిపించనున్నారు. దీనికి బిగ్‌బాస్ మాజీ విన్నర్స్ అభిజిత్ (Abhijeet), బిందు మాధవి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరించనున్నారు.నా తడాఖా చూపిస్తా!తాజాగా పెద్దపులి అభిజిత్ మళ్లీ వచ్చాడంటూ హాట్‌స్టార్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది. అందులో అభిజిత్ మాట్లాడుతూ.. ఓ కంటెస్టెంట్‌గా వచ్చిన నన్ను.. ఈరోజు మళ్లీ జడ్జిగా పిలిచారు.. థాంక్యూ! ఇప్పటిదాకా నన్ను స్వీట్ చాక్లెట్ బాయ్‌గానే చూశారుకదా.. ఈ ఆగస్టు 22 నుంచి నా జడ్జిమెంట్ ఎంత కష్టంగా ఉంటుందో బిగ్‌బాస్‌తో సహా వాళ్లకూ (కంటెస్టెంట్స్‌కు) చూపిస్తా.. అన్నాడు. అయితే ఈ వీడియోలో బిగ్‌బాస్ వాయిస్ మారింది. గంభీరంగా వినిపించే బిగ్‌బాస్ గొంతుక పేలవంగా మారిపోయింది. గొంతు మారిపోయిందిమరి ఇది ప్రోమో వరకేనా? లేదా అగ్నిపరీక్ష షోలో, బిగ్‌బాస్ 9వ సీజన్లో కూడా ఇదే గొంతు వినిపిస్తుందా? అని చాలామంది డౌట్ పడ్డారు. దీంతో హాట్‌స్టార్ ఈ అనుమానాలకు క్లారిటీ ఇచ్చింది. ప్రమోషన్స్ కోసమే ఈ కొత్త వాయిస్ వాడామని, బిగ్‌బాస్ షోలో పాత గొంతే వినిపిస్తుందని వివరణ ఇచ్చింది. ఇకపోతే అగ్నిపరీక్ష.. ఆగస్టు 22 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ అగ్నిపరీక్షలో సెలక్ట్ అయిన కంటెస్టెంట్లు బిగ్‌బాస్ 9లో కామనర్స్గా ఎంట్రీ ఇవ్వనున్నారు. The Peddha Puli @Abijeet roars Back! 🦁This time, not as a contestant, but as the formidable Judge of Bigg Boss Agnipariksha! A true test to crack. ⌛#BiggbossTelugu9 Agnipariksha starts from August 22nd exclusively on JioHotstar #BiggbossTelugu9#BiggbossAgnipariksha… pic.twitter.com/IXOzs4xyzZ— JioHotstar Telugu (@JioHotstarTel_) August 16, 2025 చదవండి: అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్ -
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జున కాదు
ప్రతి ఏడాది బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show) కోసం ఎదురుచూస్తారు. కానీ ఈసారి సీజన్ 9 కన్నా ముందు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఏదో తూతూమంత్రంగా కామనర్స్‌ను సెలక్ట్ చేయడం లేదు. వారికంటూ ప్రత్యేకంగా ఓ షో పెట్టి.. అందులో పోటీలు నిర్వహించి, జడ్జిల నిర్ణయాల ఆధారంగా సామాన్యులను ఎంపిక చేస్తారన్నమాట!వచ్చేవారమే అగ్నిపరీక్షతాజాగా ఈ అగ్నిపరీక్ష వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రోమో రిలీజ్ చేశారు. బిగ్‌బాస్ 4వ సీజన్ విన్నర్ అభిజిత్, నాన్‌స్టాప్ (ఓటీటీ) సీజన్ విజేత బిందు మాధవి, ఫస్ట్ సీజన్ థర్డ్ రన్నరప్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు. ఈ షో ఆగస్టు 22నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజు హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిపరీక్షకు యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించనుంది. మరి ఈ షోలో ఎవరెవరు పాల్గొననున్నారు? ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే ఇంకో 9 రోజులు ఆగాల్సిందే! చదవండి: థైరాయిడ్ క్యాన్సర్.. సర్జరీ తర్వాత గొంతు మూగబోయింది: యాంకర్ -
Bigg Boss: 15 మందికి అగ్నిపరీక్ష.. ఫైర్ మీదున్న జడ్జిలు!
బిగ్‌బాస్ (Bigg Boss Reality Show)కు రావాలని చాలామందికి ఆశ ఉంటుంది. అలాంటివారికి ఓ అవకాశం కల్పించేందుకు కామన్ మ్యాన్ ఎంట్రీ పేరిట కొందరిని హౌస్‌లోకి పంపిస్తూ ఉంటారు. అయితే ఈసారి కామన్ మ్యాన్‌గా రావాలనుకుంటే అగ్నిపరీక్షను గెలిచి రావాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. ఏదేమైనా సరే బిగ్‌బాస్ 9 (Bigg Boss 9 Telugu)వ సీజన్లో కనిపించాలని దాదాపు 20 వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. జడ్జిలుగా ముగ్గురువారిలో 100 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. ఈ ఇంటర్వ్యూల ద్వారా 45 మందిని సెలక్ట్ చేశారు. వీరిని అగ్నిపరీక్ష కార్యక్రమానికి పిలిచారు. ఈ కార్యక్రమానికి మాజీ కంటెస్టెంట్లు అభిజిత్, బిందు మాధవి, నవదీప్‌లను జడ్జిగా నియమించారు. వీళ్లు.. మొదటి రౌండ్లో 15 మందిని ఎంపిక చేశారు. వాళ్లెవరంటే..1. దివ్య నిఖిత (ఇన్ఫ్లుయెన్సర్)2. అనూష రత్నం (ఇన్ఫ్లుయెన్సర్)3. శ్వేతా శెట్టి4. శ్రియ5. డిమాన్ పవన్6. దమ్ము శ్రీజ (ఇన్ఫ్లుయెన్సర్)7. ప్రసన్న కుమార్ (దివ్యాంగుడు)8. ప్రశాంత్ (లాయర్)9. షాకీబ్ (ఇన్ఫ్లుయెన్సర్)10. కల్కి (మిస్ తెలంగాణ రన్నరప్)11. దాలియా షరీఫ్ (జిమ్ ట్రైనర్)12. మాస్క్ మ్యాన్13. పవన్ కల్యాణ్ (జవాన్)14. మరియాద మనీష్ (బిజినెస్మెన్)15. ప్రియా శెట్టిఅగ్నిపరీక్ష వీడియో లీక్..వీరిలో కల్కి.. అభిజిత్‌తో స్టెప్పులేయించిందని తెలుస్తోంది. ఇక అగ్నిపరీక్ష ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో లీకైంది. అందులో బిందు మాధవి.. ఏయ్, ఎందుకంత ఓవరాక్టింగ్ చేస్తున్నావ్? అంటూ ఓ కంటెస్టెంట్‌పై అసహనం వ్యక్తం చేసింది. నవదీప్ అయితే.. ఏ.. పో.. అంటూ సీటులో నుంచి లేచి వెళ్లిపోయాడు. ఇక అభిజిత్ కూడా కొందరు కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడని భోగట్టా! ఇకపోతే 15 మందిలో నుంచి 5 లేదా 9 మందిని సెలక్ట్ చేసి బిగ్‌బాస్ హౌస్‌కు పంపించనున్నారు. ఈ అగ్నిపరీక్ష షో జియోహాట్‌స్టార్‌లో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.చదవండి: నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా