Biggest Loss
-
భారీగా పుంజుకున్న చమురు ధర
సోమవారం నాటి భారీ పతనం నుంచి చమురు ధరలు భారీగా ఎగిసాయి. కోవిడ్-19 (కరోనా వైరస్) భయాలకు తోడు, రష్యా సౌదీ అరేబియా ప్రైస్ వార్ నేపథ్యంలో 29 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన చమురు మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్) తో చర్చలు కొనసాగవచ్చని రష్యా సూచనలతో ముడి చమురు ధర 11శాతం పెరిగింది. ముడి చమురు ప్రస్తుతం బ్యారెల్‌కు 38 డాలర్లుగా వుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) 11 శాతం పెరిగి బ్యారెల్‌కు 34 డాలర్లకు చేరుకుంది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటున్నామని రష్యా ఇంధన మంత్రి ఆశావహ వ్యాఖ్యలతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కూడా మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది. అటు గ్లోబల్ మార్కెట్లు కూడా భారీ పతనంనుంచి కాస్త తెప్పరిల్లాయి. డౌజౌన్స్ 900 పాయింట్లు జంప్ చేసింది. ఎస్ అండ్ పీ 3.5 శాతం, నాస్డాక్ 3.6 శాతం ఎగిసింది. కాగా దేశీయ స్టాక్‌మార్కెట్లకు హోలీ సందర్భంగా మంగళవారం సెలవు. తాజా పరిణామాల నేపథ్యంలో కీలక సూచీలు రేపు (బుధవారం) భారీగా రికవరీ సాధించే అవకాశం ఉంది. -
రూపాయికి ఫివర్.. మార్కెట్లకూ దెబ్బ
డెరివేటివ్‌ల సిరీస్ ముగింపు సెషన్లో 2013 ఆగస్టు తర్వాత మొదటిసారి దేశీయ మార్కెట్లు భారీ స్థాయిలో నష్టపోయాయి. సెన్సెక్స్ 191.64 పాయింట్లు నష్టపోయి 25,860.17 వద్ద, నిఫ్టీ 67.80 పాయింట్ల నష్టంతో 7965.50 పాయింట్ల వద్ద ముగిసింది. టీసీఎస్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టాటా స్టీల్ గురువారం ట్రేడింగ్‌లో లాభాలనార్జించగా... టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, మహింద్రా అండ్ మహింద్రాలు నష్టాలు గడించాయి. గ్లోబల్ మార్కెట్లో అమెరికా కరెన్సీ డాలర్ పుంజుకోవడంతో గురువారం రూపాయి భారీ స్థాయిలో పడిపోయింది. నేటి ట్రేడింగ్‌లో 30 పైసలు నష్టపోయిన రూపాయి ఆల్ టైమ్ కనిష్టా స్థాయికి చేరింది. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగి, భారీ ఎత్తున డాలర్ అమ్మకాలు చేపట్టడంతో రూపాయి కొంత కోలుకుని, 18 పైసల నష్టంతో 68.74వద్ద ముగిసింది. భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోతున్న అవుట్‌ఫ్లోస్‌తో రూపాయి విలువ భారీ స్థాయిలో పడిపోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే కొన్ని నెలల్లో రూపాయి విలువ 70కి పడిపోయిన ఆశ్చర్యం లేదని పేర్కొంటున్నారు. ఇటు డాలర్ విలువ బలపడుతుండటంతో పాటు దేశీయంగా నోట్ల బ్యాన్ కొనసాగుతుండటంతో బంగారం ధరలు కూడా దిగొస్తున్నాయి. నేటి ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 106 రూపాయిల నష్టపోయి 28,723గా నమోదైంది. -
భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఆరంభంలోనే మదుపర్లు షాకిచ్చిన మార్కెట్లు మిడ్ సెషన్లో కొద్దిగా కోలుకున్నా చివరికి భారీ నష్టాల్లోనే ముగిశాయి. 443 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 28,353 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 8,715, వద్ద క్లోజ్ అయ్యాయి. బ్రెగ్జిట్ సంక్షోభం తర్వాత ఇదే భారీ పతనమని మార్కెట్ల వర్గాలు అంచనావేశాయి. ప్రధానంగా అన్ని రంగాల సూచీలు నష్టాల బాట పడ్డాయి. మిడ్ సెషన్ నుంచీ పెరిగిన అమ్మకాలతో బ్యాంక్ సెక్టార్ భారీగా పతనం కాగా, ఐటీ సెక్టార్ లాభాలను ఆర్జించింది.. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. దీంతో రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆటో, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు కూడా ఇదే బాట పట్టాయి. హిందాల్కో బీవోబీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, యస్‌బ్యాంక్, అంబుజా, టాటా పవర్, ఏసీసీ, స్టేట్‌బ్యాంక్, భెల్ నష్టపోగా, ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్, టీసీఎస్ లాభపడ్డాయి. అమెరికా మందగమనం, బ్రెక్సిట్ వంటి అంశాల కారణంగా ఇటీవల నీరసించిన ఈ రంగంలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడం దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు బక్రీద్ సందర్భంగా మంగళవారం మార్కెట్లకు సెలవు. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మరింత నేల చూపులు చూస్తోంది. 22 పైసల భారీ పతనంతో 66.94 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. ల పసిడి రూ.102 నష్టంతో రూ. 31,115 వద్ద ఉంది.