Bike thief arrested
-
వయసు 21.. కేసులు 20.. జల్సాల కోసం వాహనాల చోరీ
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్‌లో పని చేసే అతగాడికి ద్విచక్ర వాహనాలంటే సరదా. వాటిపై తిరగాలనే కోరికకు తన ఆర్థిక స్థోమత అడ్డు వస్తోంది. దీంతో వాహనాలను చోరీ చేసి చక్కర్లు కొట్టడం మొదలెట్టాడు. చోరీ వాహనాలను విక్రయించినా, ఒకే దానిపై ఎక్కువ రోజులు తిరిగినా పోలీసులకు చిక్కుతుండటంతో తస్కరించిన దానిపై కొన్నాళ్లు చక్కర్లు కొట్టి వదిలేయడం మొదలెట్టాడు. ఈ పంథాలో ఇప్పటి వరకు 20 నేరాలు చేసిన 21 ఏళ్ల ఎం.వెంకటేశ్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం పట్టుకున్నట్లు డీసీపీ డి.సునీత రెడ్డి వెల్లడించారు. ఆసిఫ్‌నగర్ పరిధిలోని జిర్రా ప్రాంతానికి చెందిన వెంకటేష్ పాఠశాల స్థాయిలోనే చదువుకు స్వస్థి చెప్పాడు. ఆపై చిన్న చిన్న పనులు చేసినప్పటికీ ప్రస్తుతం ఓ పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. వివిధ రకాలైన ద్విచక్ర వాహనాలపై తిరగాల న్నది ఇతడి కోరిక. అయితే వాటిని ఖరీదు చేయడానికి తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో 2016 నుంచి చోరీలు చేయడం మొదలెట్టాడు. తొలినాళ్లల్లో చోరీ చేసిన వాహనాలపై తిరిగి వదిలేసేవాడు. ఆపై వాటికి ఉన్న డిమాండ్ గుర్తించిన ఇతగాడు జిర్రా ప్రాంతంలో అనేక మందికి మాయమాటలు చెప్పి తక్కువ రేటుకు అమ్మాడు. ఆ సందర్భంలో ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు ఆయా వాహనాలను రికవరీ చేశారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై వచ్చిన ఇతడిని ఆ వాహనాలు ఖరీదు చేసిన వారు నిలదీయడంతో పాటు దాడులకు పాల్పడ్డారు. ఇకపై చోరీ చేసిన వాహనాన్ని ఎవరికీ విక్రయించకూడదని నిర్ణయించుకున్న వెంకటేష్ తన పంథా కొనసాగించాడు. 15 రోజుల తర్వాత.. మే నెల నుంచి ఇప్పటి వరకు ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, టప్పాచబుత్ర, మంగళ్‌హాట్, బోయిన్పల్లి పోలీసుస్టేషన్ల పరిధి నుంచి ఎనిమిది వాహనాలు తస్కరించాడు. ఒకదాన్ని చోరీ చేసిన తర్వాత పది పదిహేను రోజులు దానిపై చక్కర్లు కొడతాడు. ఆపై నిర్మానుష్య ప్రాంతంలో ఆ వాహనాన్ని పడేసి మరోటి చోరీ చేస్తాడు. ఇతడి వ్యవహారాలపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, కె.నర్సింహులు, షేక్ బురాన్‌లతో కూడిన బృందం వలపన్ని అదుపులోకి తీసుకుంది. ఇతడి నుంచి రూ.5 లక్షల విలువైన 8 వాహనాలు స్వాదీనం చేసుకుని ఆసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించింది. వీటితో సహా ఇప్పటి వరకు ఇతడిపై మొత్తం 20 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: పల్సర్ బైక్‌లే టార్గెట్.. ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు ఏర్పడిన పరిచయం.. -
పగలు మెకానిక్.. రాత్రి బైక్‌ల చోరీ
సాక్షి, ఉక్కునగరం(గాజువాక): అతని వృత్తి మెకానిక్.. ప్రవృత్తి బైకుల చోరీ. పగలు వాహనాలను బాగు చేసే ఆయన రాత్రి వేళ బైకుల చోరీని అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా ఒకటి, రెండు కాదు ఏకంగా 200 బైకులను అపహరించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర సౌత్ జోన్ పోలీసులు దర్యాప్తుముమ్మరం చేశారు. ఎట్టకేలకు కేసును ఛేదించారు. వందకు పైగా బైకులను రికవరీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. పరవాడలో బైక్ రిపేర్ షాపు నిర్వహిస్తూ.. పరవాడలో సుమారు 15, స్టీల్‌ప్లాంట్‌లో దాదాపు 40, ఇలా అనకాపల్లి, గాజవాక పరిధితో పాటు పలు చోట్ల మొత్తం సుమారు 200 బైకులు అపహరణకు గురయ్యాయి. పోలీసులకు సవాలుగా మారిన ఈ దొంగతనాల మూలం పరవాడలో ఉన్నట్టు తేలింది. నిందితుడు పరవాడలో బైక్ రిపేర్ షాపు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన వ్యకిగా గుర్తించారు. బయటకు మెకానిక్‌గా కనిపిస్తూ రాత్రుళ్లు బైకుల దొంగతనం చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్థారించారు. చోరీ బైక్‌ల విడిభాగాలను విక్రయిస్తూ.. చోరీ చేసిన బైకుల విడి భాగాలను తీసి స్పేర్‌పార్టులుగా అమ్మకం చేసేవాడు. ఆ వ్యాపారం విస్తరించడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన మెకానిక్‌లు కూడా ఈయన వద్ద నుంచే స్పేర్‌పార్టులు కొనుక్కునేవారు. ఇటీవల దొరికిన ఒక సాక్ష్యం ద్వారా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా తప్పించుకున్నాడు. తప్పించుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రకాశం, ఖమ్మం జిల్లాలకు రెండు బృందాలను పంపిం చారు. ఖమ్మంలోని అతని బంధువు ఇంట్లో ఉండగా పట్టుకున్నట్టు తెలిసింది. అతడి నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఇప్పటికే వందకు పైగా బైకులను పోలీసులు రికవరీ చేశారు. స్పేర్ పార్ట్‌లను రికవరీ చేస్తూ.. నిందితుడి నుంచి స్పేర్ పార్టులు కొనుగోలు చేసిన మెకానిక్‌లను కూడా అదుపులోకి తీసుకుని మరికొన్ని స్పేర్ పార్టుల రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నగర క్రైం ఏడీసీపీ సురేష్‌బాబు నేతృత్వంలో గాజువాక క్రైం సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు క్రైం ఎస్‌లు ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బైకులను స్టీల్‌ప్లాంట్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఉంచారు. దొరికిన స్పేర్ పార్టులతో బిగించి తిరిగి బైకులను సిద్ధం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో బైక్‌లు రికవరీ దిశగా.. జిల్లాలో ఇప్పటి వరకు అత్యధికంగా 90 చోరీ బైకులను రికవరీ చేయగా.. ఈ సారి అంతకంటే ఎక్కువ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకునే దిశగా దర్యాప్తు సాగుతోంది. అతి త్వరలో పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. -
టెస్ట్ డ్రైవ్ చేస్తానని.. బైక్‌తో పరార్
ప్రొద్దుటూరు క్రైం : ‘బ్రదర్ మీ బైక్ చాలా బాగుంది.. ఎంతకు తీసుకున్నారు..? నేను ఇలాంటి బైక్ తీసుకోవాలనుకుంటున్నాను.. టెస్ట్ డ్రైవ్ చేస్తాను.. మీ బైక్ ఇస్తారా’.. అంటూ బైకు తీసుకుంటాడు.. అంతే.. బైక్‌తో వెళ్లిన అతను ఇక తిరిగిరాడు. ఇలా ప్రొద్దుటూరుతో పాటు కడపలో బైక్‌లను దొంగలించిన దుర్గం దివాకర్‌ను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం సీఐ రామలింగమయ్య అరెస్ట్ వివరాలను వెల్లడించారు. పట్టణంలోని ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న దివాకర్ 7వ తరగతి వరకు చదువుకున్నాడు. అతనికి తండ్రి లేడు. తల్లి ఉన్నా అతనికి దూరంగా ఉంటోంది. దీంతో అతను అవ్వా, తాత వద్ద ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన దివాకర్ చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డారు. నిద్రిస్తున్న సమయంలో వారి చేతిలో ఉన్న ఉంగరాలను చాక చక్యంగా దొంగిలించుకొని వెళ్లేవాడు. ప్రొద్దుటూరు, కడపలో అతనిపై చోరీ కేసులు ఉన్నాయి. తర్వాత బైక్‌లను దొంగిలించాలనే ఆలోచన అతనికి వచ్చింది. గ్రౌండ్లలో పార్కింగ్ చేసిన బైక్‌లే టార్గెట్ సాయంత్రం సమయాల్లో పాఠశాల, కళాశాల మైదానాలకు వెళ్లి అక్కడ పార్కింగ్ చేసిన బైక్‌లను దివాకర్ ఎంపిక చేసుకుంటాడు. బైక్ యజమానిని గుర్తించి అతని వద్దకు వెళ్తాడు. ‘అన్నా మీ బైక్ బాగుంది.. ఎంతకు కొన్నారు..? నేను ఇలాంటి బైక్‌ను కొనాలనుకుంటున్నాను.. బండి ఎలా ఉందో డ్రైవ్ చేసి ఇస్తాను ఇస్తారా’.. అని వారిని బతిమాలతాడు. తనపై వారికి నమ్మకం కుదిరేలా తన డొక్కు బైక్‌ను అక్కడే వదిలేసి వెళ్తాడు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీకి చెందిన ఎం ప్రసాద్ అనే వ్యక్తి తన హోండా షైన్‌ను గుర్తు తెలియని ఒక యువకుడు తీసుకెళ్లాడని ఈ నెల 28న వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్ఐ ఎంఏ ఖాన్ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు దివాకర్ రామేశ్వరంలోని శివాలయం వద్ద ఉన్నాడని సమాచారం రావడంతో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వెళ్లి సోమవారం అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి హోండా షైన్, టీవీఎస్ అపాచీ, రాయల్ ఎన్ఫీల్డ్ను స్వా«ధీనం చేసుకున్నారు. ఈ నెల 24న కడపలోని ఐటీఐ సర్కిల్ వద్ద ఆపాచీ, 25న కమలాపురం మండలం, అప్పాయపల్లి వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను దొంగిలించినట్లు అతను పోలీసుల వద్ద అంగీకరించాడు. నిందితుడి అరెస్ట్, వాహనాల రికవరీలో మంచి ప్రతిభ కనబరచిన ఎస్ఐ ఎంఏ ఖాన్, కానిస్టేబుళ్లు మహేష్, సింహరాయుడును సీఐ రామలింగమయ్య అభినందించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. -
బాలుడే.. చోరీల్లో మహా ముదురే!
తిరుపతి క్రైం : మోటారు సైకిళ్ల దొంగను అరెస్టు చేసి 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. సోమవారం తన కార్యాలయంలోనాయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేణిగుంట–చంద్రగిరి మార్గంలో రామానుజపల్లె వద్ద ఎస్ఐ ఈశ్వరయ్య వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ బాలుడు వీరిని చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని, అనుమానం కొద్దీ అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తిరుపతిరూరల్ మండలం సాయినగర్ పంచాయతీ లింగేశ్వర్‌నగర్‌కు చెందిన 18 ఏళ్ల బాలుడని తేలిందన్నారు. అతను నడుపుతున్న మోటార్ సైకిల్ దొంగలించినదిగా గుర్తించి కేసు నమోదు చేశారు. మాట్లాడుతున్న అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ అంతకుముందు ముందు తిరుచానూరు పోలీసులు అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలై తిరుగుతున్నాడని, ప్రాథమిక విచారణలో ఆ బాలుడు తన స్నేహితులైన ఐక్య ఉపాధ్యానగర్‌కు చెందిన సంతోష్, సాయినగర్‌కు చెందిన వినయ్‌తో కలసి 2018 నుంచి ఇప్పటి వరకు 12 మోటారు సైకిళ్లను శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో దొంగలించినట్టు తేలిందని చెప్పారు. అయితే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్ల విలువ రూ.5.60 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసును ఛేదించడంలో ఎమ్మార్‌పల్లె సీఐ మన్సూరుద్దీన్, ఎస్ఐ ఈశ్వరయ్య, సిబ్బంది దీపిక, మోహన్, తిలక్‌కుమార్, అమరనాథరెడ్డి, కరీముల్లా, జగదీష్ కృషి చేశారని చెప్పారు. వారికి నగదు రివార్డులు అందజేశారు. -
బస్సులో వచ్చి..బైకుపై వెళ్తాడు!
కంటోన్మెంట్ : అతను ఓ గ్రామ ఉపసర్పంచ్‌గా పనిచేశాడు... కరీంనగర్ జిల్లాలోని తన ఊరి నుంచి నగరానికి బస్సులో వస్తాడు.. తిరిగి వెళ్లే క్రమంలో సికింద్రాబాద్ జేబీఎస్ సమీపంలో పార్కు చేసి ఉన్న ద్విచక్ర వాహనాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుని దానిపై ఉడాయిస్తాడు...వారం పదిరోజులకోసారి క్రమం తప్పకుండా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడితో పాటు అతడు చోరీ చేసిన వాహనాల చేసిస్ నెంబర్లు మార్చే వ్యక్తిని నార్త్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. నార్త్‌జోన్ డీసీపీ సుమతి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన అలుమల్ల విజేందర్‌రెడ్డి గ్రామ ఉపసర్పంచ్‌గా, వార్డు మెంబర్‌గా పనిచేశాడు. జేసీబీ కొనుగోలు చేసిన ఇతను ఆర్థికంగా నష్టపోయాడు. ఇందులోనుంచి బయపడేందుకు బైక్ చోరీలను ఎంచుకున్నాడు. తరచూ నగరానికి వచ్చే ఇతను బైకులను చోరీ చేసేవాడు. ఎత్తుకెళ్లిన వాహనాలను కరీంనగర్ జిల్లా, కశ్మీర్‌గూడకు చెందిన మహ్మద్ యూనిస్ మోయినుద్దీన్ సహకారంతో చేసిన నెంబర్ సహా రూపురేఖలు మార్చి విక్రయించే వాడు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో తరచూ బైక్‌లు చోరీకి గురవుతుండటంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో అతను పది బైక్‌లను చోరీ చేసినట్లు అంగీకరించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. 2016లోనూ నిందితుడు విజేందర్ రెడ్డిని అరెస్టు చేసిన కరీంనగర్ పోలీసులు అప్పట్లో 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన మార్కెట్ పోలీసులను అభినందించారు. సమావేశంలో మహంకాళీ ఏసీపీ ఏ. వినోద్ కుమార్, సీఐ ఎం. మట్టయ్య, డీఎస్ఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
బైక్ దొంగ అరెస్టు.. ఏడు బైక్‌లు స్వాధీనం
కరీంనగర్: జల్సాలకు అలవాటుపడి ఈజీమనీ కోసం దొంగతనాల బాట పట్టిన ఓ ద్విచక్రవాహనాల దొంగను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా పార్క్ చేసి ఉన్న బైక్‌లను దొంగలిస్తున్న ఓ యువకుడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 7 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.