Biker Movie
-
బైకర్, రాకాస.. తొలిరోజు వసూళ్లు ఎవరికెన్ని కోట్లు?
ఈ వీకెండ్ థియేటర్లలోకి 'బైకర్', 'రాకాస' అనే తెలుగు సినిమాలు వచ్చాయి. రెండింటికి సూపర్ రెస్పాన్స్ రానప్పటికీ పర్లేదు చూడొచ్చనే టాక్ అయితే వచ్చింది. ఒకటి బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కాగా, మరొకటి హారర్ కామెడీ థ్రిల్లర్. ఈ రెండింటి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి? ప్రస్తుతం వీటి పరిస్థితి ఏంటనేది చూద్దాం.(ఇదీ చదవండి: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'రాకాస' విషయానికొస్తే.. మెగాడాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరించగా, సంగీత్ శోభన్-నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు. మానస శర్మ అనే మహిళా దర్శకురాలు ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది. రిలీజ్ శుక్రవారమే అయినప్పటికీ ముందురోజు రాత్రి ప్రీమియర్లు వేశారు. వాటితో కలిపి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. వీకెండ్ అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ కావొచ్చేమో అనిపిస్తుంది.'బైకర్' విషయానికొస్తే.. శర్వానంద్ హీరోగా నటించిన మోటో రేసింగ్ డ్రామా మూవీ ఇది. ఒకప్పటి హీరో రాజశేఖర్ ఇందులో కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు కాగా యువీ క్రియేషన్స్ నిర్మించింది. రేసింగ్ సీన్స్ బాగున్నప్పటికీ ఎమోషన్స్ అనుకున్నంత వర్కౌట్ కాలేదని టాక్ అయితే వచ్చింది. దీని తొలిరోజు కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రీమియర్లతో కలిసి మొదటిరోజు రూ.2.41 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. చూస్తుంటే ఈ రెండు చిత్రాలతో బాక్సాఫీస్ కాస్త ఊపిరి పీల్చుకునేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ‘బైకర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
ఈ బ్యానర్లో నాకు నాలుగో హిట్: శర్వానంద్
‘‘బైకర్’ ద్వారా నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఇండియా గర్వించే సినిమా తీస్తామని చెప్పాం... తీశాం. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే చిత్రం ‘బైకర్’. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని గర్వంగా చెబుతాను’’ అని హీరో శర్వానంద్ తెలిపారు. శర్వానంద్, మాళవికా నాయర్ జోడీగా నటించిన చిత్రం ‘బైకర్’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ప్రభాస్ అన్నకి థాంక్స్అదే రోజు సాయంత్రం నిర్వహించిన బంపర్ బ్లాక్ బస్టర్ మీట్లో శర్వానంద్ మాట్లాడుతూ–‘‘బైకర్’ని సపోర్ట్ చేసిన ప్రభాస్ అన్నకి థాంక్స్. ఈ చిత్రకథని నా వద్దకు పంపిన నిర్మాత వంశీ అన్నకి థ్యాంక్స్. యూవీ క్రియేషన్స్‌లో ఇది నాకు నాలుగో హిట్. ‘రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు, బైకర్’. ఈ సినిమాను అద్భుతంగా నిర్మించిన వంశీ అన్నకి ధన్యవాదాలు. బైకర్ క్యారెక్టర్ కోసం 22 కిలోలు బరువు తగ్గాను. ‘బైకర్’ని యూత్ చూస్తున్నారు. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్. పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. ‘బైకర్’కి బ్లాక్‌బస్టర్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.రెండేళ్ల కష్టం‘‘బైకర్’కి వస్తున్న స్పందన చూసి చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఇది రెండేళ్ల కష్టం’’ అన్నారు మాళవిక. ‘‘ఈ సినిమాలో బైక్ రేసింగ్‌తో పాటు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుందని చెప్పాను. ఆడియన్స్ ఆ ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యారు’’ అని అభిలాష్ రెడ్డి పేర్కొన్నారు. నటుడు రాజశేఖర్, నటి జీవిత, డైరెక్టర్ సంపత్ నంది, కెమెరామెన్ యువరాజ్, నటుడు నిరూప్ నందకుమార్, ఎడిటర్ అనిల్ మాట్లాడారు. -
‘బైకర్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పెళ్లి ఫొటోలు ఎక్కడ? విడాకులు నిజమేనా?
ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో సక్సెస్ అందుకున్న శర్వానంద్.. ఇప్పుడు 'బైకర్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. దీనికి కూడా మిశ్రమ స్పందన వినిపిస్తోంది. వీకెండ్ దాటితే అసలు రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. సరే ఈ విషయాలు పక్కనబెడితే ఈ హీరో విడాకుల రూమర్స్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అందుకు ఓ కారణం కూడా ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్)సహాయ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. 2022లో 'ఒకే ఒక జీవితం' సినిమాతో హిట్ కొట్టాడు. తర్వాత ఏడాది జూన్‌లో రక్షితా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. జైపూర్‌లో ఈ వేడుక జరగ్గా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులు, సిద్ధార్థ్-అదితీ తదితరులు హాజరయ్యారు. వివాహం జరిగిన ఏడాదికే శర్వా-రక్షితకు కూతురు పుట్టింది. ఈ చిన్నారికి లీలా దేవి మైనేని అనే పేరు పెట్టారు. ఓ ఫొటోని కూడా శర్వా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.అయితే గతేడాది సెప్టెంబరులో శర్వానంద్ విడాకులు గురించి కొన్ని పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం శర్వా, అతడి భార్య రక్షిత విడివిడిగా ఉంటున్నారనే విషయం బయటకొచ్చింది. కూతురు కొన్నిరోజులు తండ్రి దగ్గర, మరికొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటోందని టాక్ కూడా వినిపించింది. అలాంటిదేం లేదని శర్వా టీమ్ అప్పుడు క్లారిటీ ఇచ్చింది. దీంతో అంతా సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు శర్వా.. సోషల్ మీడియాలో తన పెళ్లి ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలని డిలీట్ చేసేశాడు. దీంతో గతంలో వినిపించిన రూమర్స్ నిజమేనా అని ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.శర్వా ఇన్ స్టాలో ప్రస్తుతం సినిమాల పోస్టర్స్, వ్యక్తిగత ఫొటోలు తప్పితే భార్య ఫొటో గానీ కూతురు ఫొటో, కుటుంబం ఫొటోలు ఎక్కడా లేకపోవడంతోనే విడాకుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: అప్పుడు దెయ్యంగా.. ఇప్పుడు రొమాంటిక్ సినిమాలో) -
‘బైకర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : బైకర్నటీనటులు: శర్వానంద్, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులునిర్మాణ సంస్థ: యూవి క్రియేషన్స్నిర్మాతలు:వంశీ-ప్రమోద్దర్శకత్వం: అభిలాష్ రెడ్డిసంగీతం: జిబ్రాన్సినిమాటోగ్రఫీ: జె యువరాజ్ఎడిటింగ్: అనిల్ కుమార్ పివిడుదల తేది: ఏప్రిల్ 3, 2026శర్వానంద్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘బైకర్’ తో వచ్చాడు. ఇండియాలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శర్వా ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ (శర్వానంద్) మోటోక్రాస్ రేసర్. తండ్రి సునీల్ నారాయణ్ అలియాస్ బుల్లెట్ సునీలే ఆయన గురువు. ఎప్పుటికైనా ఇండియాలో కూడా మోటోక్రాస్ రేసింగ్‌కు గుర్తింపు తీసుకురావాలనే తండ్రి కల కోసం విక్కీ అహర్నిశలు కష్టపడతాడు. నెంబర్ వన్ బైక్ రేసర్‌గా నిలుస్తాడు. కొడుకు ఛాంపియన్‌గా మారిన తర్వాత అంతర్జాతీయ స్థాయి రేసింగ్ పోటీల్లోకి దించాలనుకుంటాడు సునీల్. అందుకోసం ఐఎన్జీ అనే స్పాన్సరింగ్ కంపెనీ అధినేత(అతుల్ కులకర్ణి)ని ఒప్పిస్తాడు. అగ్రిమెంట్ కాగితాలపై సంతకం చేసిన తర్వాత విక్కీ అనూహ్యంగా రేసింగ్ నుంచి తప్పుకుంటాడు. తండ్రిని చిన్న మాట అంటేనే భరించలేని విక్కీ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనన్య(మాళవిక నాయర్) ఎవరు? ఆమె విక్కీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? కొన్నాళ్ల పాటు రేసింగ్‌కు దూరంగా ఉన్న విక్కీ.. మళ్లీ మోటోక్రాస్ రేసర్‌గా ఎందుకు మారాడు? తిరిగి వచ్చిన కొడుక్కి సునీల్ మళ్లీ కోచింగ్ ఇచ్చాడా? లేదా? చివరకు తండ్రికొడుకులు కలిశారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..తెలుగు తెరపై స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాదు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాక్సింగ్, హాకీ.. ఇలా వివిధ క్రీడల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో ఇప్పటివరకు సినిమా రాలేదు. అదొక్కటే బైకర్ ప్రత్యేకత. కథా, కథనం రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా సినిమాల మాదిరే సాగుతుంది. ఛాంపియన్‌గా ఉండే హీరో ఉన్నపళంగా క్రీడను వదిలేసి సాధారణ జీవితం గడపడం.. తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా మళ్లీ ఆయన క్రీడల్లోకి రావడం.. క్లైమాక్స్‌లో విజేతగా నిలవడం..స్పోర్ట్స్ డ్రామా చిత్రాలన్నీ దాదాపు ఇలానే సాగుతాయి. అయితే కథనం ఎలా సాగింది? ఎమోషన్ ఏమేరకు పండింది? అనేదానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. బైకర్లోనూ మంచి ఎమోషన్స్ ఉన్నాయి. సంఘర్షణ ఉంది. కానీ, అది ప్రేక్షకుడిపై అంతగా ప్రభావం చూపించలేకపోయింది. విజువల్స్‌తో పాటు రేసింగ్ సన్నివేశాలు మాత్రం అదిరిపోతాయి. రేసింగ్ సీన్లను తెరపై చూస్తుంటే గూస్బంప్స్ వస్తాయి. రేసింగ్ వదిలేసి సాధారణ జీవితం గడుపుతున్నట్లుగా హీరో పరిచయ సన్నివేశాలు ఉంటాయి. భార్య, కొడుకుతో హాయిగా గడుపుతున్న సమయంలో తండ్రి గురించి ఓ వార్త వినడం.. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మొదలయిన తర్వాత నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. హీరో, హీరోయిన్ల లవ్‌స్టోరీ ఒకవైపు.. రేసింగ్ సీన్లు మరో వైపు.. ఫస్టాఫ్ అంతా ఇలా సాగుతుంది. ప్రతీది డీటైలింగ్‌గా చెప్పడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెంకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం చాలా వరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తండ్రి కోసం మళ్లీ రేసర్‌గా మారడం.. ప్రాక్టీస్ సమయంలో హీరో పడే ఇబ్బందులు.. విలన్ చేసే కుట్రలను ఛేదించి.. చివరకు విజేతగా నిలవడం.. ఇలా ఊహకందేలా కథనం సాగుతుంది. ముందుగా చెప్పినట్లు భావోద్వేగాలను మరింతగా పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు రేసింగ్ సీన్లపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. అవి ఆకట్టుకున్నాయి కూడా! అదే స్థాయిలో భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉండి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం శర్వా నటన అని చెప్పొచ్చు. తెరపై చూస్తుంటే అచ్చమైన స్పోర్ట్స్ మెన్లానే ఆయన లుక్ ఉంది. అటు యాక్షన్, ఇటు ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించాడు. ఈ మూవీ కోసం శర్వానంద్ పడిన కష్టమంతా తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. హీరో తండ్రి, కోచ్ బుల్లెట్ సునీల్‌గా రాజశేఖర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయనకు పెద్దగా డైలాగులు లేకున్నా.. కథ మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది. హీరోయిన్ మాళవిక నాయర్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సీన్లు ‘జెర్సీ’ సినిమాను గుర్తు చేస్తాయి. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. పాటలు కూడా సందర్భానుసారం వస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. రేసింగ్ సీన్లను తెరపై అద్భుతంగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సినీ కెరీర్.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్ (ఫోటోలు)
-
ఫిబ్రవరి, మార్చి పాయే.. ఏప్రిల్ ఏమవుతుందో?
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ అద్భుతమైన హిట్స్ అందుకుంది. చిరంజీవి, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ తదితరులు తమ సినిమాలతో హిట్స్ అందుకుని మంచి ఆరంభం ఇచ్చారు. కానీ దీన్ని ఫిబ్రవరి, మార్చి నెలల్లో టాలీవుడ్ కొనసాగించలేకపోయింది. కానీ ఏప్రిల్ మాత్రం సక్సెస్ అవుతుందనే ఆశలు రేపుతోంది. ఇంతకీ ఈ నెలలో తెలుగులో రాబోతున్న చిత్రాలేంటి? వాటిపై హైప్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: 'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు: గుణశేఖర్)ఈనెల తొలివారంలో శర్వానంద్ 'బైకర్' మూవీతో రాబోతున్నాడు. ట్రైలర్ బాగుండేసరికి దీనిపై కాస్త బజ్ ఏర్పడింది. సంక్రాంతికి సక్సెస్ అందుకున్న శర్వా.. దీనితోనూ హిట్ కొట్టేలానే ఉన్నాడు. దీనితోపాటు 'రాకాస' అనే హారర్ కామెడీ చిత్రం రాబోతుంది. ట్రైలర్, పాటల్లాంటివి ఓకే ఓకే అనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో? వీటితోపాటు సముద్రఖని 'కార్మేని సెల్వం', శరవణనన్ 'లీడర్' లాంటి మూవీస్ కూడా జాబితాలో ఉన్నాయి కానీ వీటిపై ఎలాంటి బజ్ లేదు.రెండో వారంలో ప్రస్తుతానికైతే నాలుగు సినిమాలున్నాయి. నిఖిల్ 'స్వయంభు' ఇదే తేదీన రావాల్సి ఉంది కానీ ప్రమోషన్స్ ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. దీంతో వాయిదా పడుతుందా అనే అనుమానం కలుగుతోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత అడివి శేష్ నుంచి 'డకాయిట్' అనే చిత్రం వస్తోంది. ఈ రెండు కాస్త ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నప్పటికీ హైప్ ఓ మాదిరిగానే ఉంది. వీటితో పాటు పల్లి చట్టంబి అనే మలయాళ డబ్బింగ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే తమిళ డబ్బింగ్ మూవీస్ లైనులో ఉన్నాయి. ఇవి సక్సెస్ అయితే ఆశ్చర్యమే.మూడోవారంలో మూడు తెలుగు సినిమాలొస్తున్నప్పటికీ అవన్నీ చిన్నవే. మూడేళ్ల తర్వాత నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తిక్'గా వస్తున్నాడు. తిరువీర్ 'పాపం ప్రతాప్', హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రాలు కూడా లిస్టులో ఉన్నాయి. వీటిపై ప్రస్తుతానికి ఎలాంటి బజ్ లేదు. హిట్ అయితే అదృష్టమే అనే చెప్పొచ్చు.చివరివారంలో రామ్ చరణ్ 'పెద్ది' ఉన్న నేపథ్యంలో అంతకుముందు తెలుగు చిత్రాలు రిలీజ్ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. లెజెండరీ మైకేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్'.. 24వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఇక చరణ్ 'పెద్ది' మూవీపై హైప్ బాగానే ఉంది. ఇప్పటికే రిలీజైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీనికి పోటీగా ధనుష్ 'కర' మూవీ ఉంది. దీని ప్రమోషన్స్ కూడా ఇంతవరకు మొదలుపెట్టలేదు. చూడాలి మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో?ఏప్రిల్‌లో రిలీజయ్యే వాటిలో 'పెద్ది' మాత్రమే పెద్ద సినిమా. అందుకు తగ్గట్లే హైప్ ఉంది. మిగతా మూవీస్ పర్లేదనిపించే హైప్ ఉన్నప్పటికీ ఏవి హిట్ అవుతాయనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది' విడుదలపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్) -
ఆ అవకాశం ఇప్పటివరకూ రాలేదు
‘‘చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్ల నా సినీ ప్రయాణం పట్ల ఒక నటిగా హ్యాపీగా ఉన్నాను. అయితే సంతృప్తిగా లేను. నేను పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే పాత్ర చేసే అవకాశం ఇప్పటివరకు రాలేదు. ఇంకా మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. అయితే ‘బైకర్’ సినిమాలో నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాను. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది’’ అని హీరోయిన్ మాళవికా నాయర్ చెప్పారు. శర్వానంద్, మాళవికా నాయర్ జోడీగా నటించిన చిత్రం ‘బైకర్’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా మాళవికా నాయర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బైకర్’ కథ మూడు టైమ్‌లైన్స్‌లో సాగుతుంది. నా పాత్ర కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. రేసింగ్ బ్యాక్‌డ్రాప్ సినిమా అయినప్పటికీ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. తండ్రీ కొడుకుల భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా స్ఫూర్తినిస్తుంది. ఇక ప్రతిసారీ కొత్త క్యారెక్టర్ చేయాలని ఉండటం వల్లే గ్యాప్ వస్తోంది. ఓ పాత్ర చేసే ముందు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుంటాను... కొత్తగా అనిపిస్తేనే చేస్తాను’’ అని తెలిపారు. -
'ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్'
శర్వానంద్ హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ బైకర్. ఇండియాలోనే తొలి మోటోక్రాస్ చిత్రంగా బైకర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్లలో దూసుకెళ్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ సైతం సందడి చేశారు. బైకర్ మూవీకి తన బైక్‌పై స్టైలిష్‌గా కనిపించారు. ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ డైలాగ్ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇది చూసిన శర్వానంద్ ఫుల్ ఖుషీ అయిపోయారు. థ్యాంక్ యూ ప్రభాస్ అన్న.. లవ్ యూ.. నువ్వు ఎప్పుడు నాకు అండగా ఉంటావ్.. మన బంధం ఎప్పటికీ ఇలానే పదిలంగా ఉండాలని కోరుకుంటున్నాని పోస్ట్ చేశారు. అవును... ట్రైలర్ చూసి కొన్ని నమ్మాల్సిందే అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ ఏప్రిల్ 3న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. Thank you, Prabhas Anna. Love you 🫂You’ve always been there for me. Our bond is something I’ll always cherish.Yes… trailer chusi konni nammeyali 😉Experience 𝐈𝐍𝐃𝐈𝐀’𝐒 𝐅𝐈𝐑𝐒𝐓 𝐌𝐎𝐓𝐎𝐂𝐑𝐎𝐒𝐒 𝐅𝐈𝐋𝐌 in Dolby Cinema, EPIQ, 4DX and PCX.#Biker Grand release on… pic.twitter.com/R4efg8BUi7— Sharwanand (@ImSharwanand) March 31, 2026 -
ఇష్టపడి కొన్న బైక్‌ని జీవిత అమ్మేసింది : రాజశేఖర్
శర్వానంద్ హీరోగా నటింటిన తాజా చిత్రం ‘బైకర్’. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా రాజశేఖర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా బైకర్. ఎప్పుడు ఏప్రిల్ 3 వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమా ఇది. నా సినిమాలానే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆడియన్స్ ఎంతలా మెచ్చుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.→ నేను ఏ క్యారెక్టర్ చేసిన అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను బైకర్ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండు నచ్చే ఈ సినిమా చేశాను. బైకర్ కథ పరంగా సూపర్ గా హిట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.→ నాకు చిన్నప్పటినుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్లో తిరిగేవాడిని. ఆ తర్వాత బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. శేషు సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి కొనుక్కొని ఆ షూటింగ్ కి వాడడం జరిగింది. ఆ తర్వాత అదే బైక్ ని రోజు నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి 'మీరు చాలా రిస్క్ తో నడుపుతున్నారని నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు (నవ్వుతూ).→ అభిలాష్ గారు చాలా మంచి డైరెక్టర్. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ మీద క్యారెక్టర్ మీద చాలా గ్రిప్ ఉన్నా దర్శకుడు . ఆయన అనుకునది వచ్చేంతవరకు ఎక్కడ కూడా రాజీపడరు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న డైరెక్టర్.→ ఇందులో బైక్ రేసింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి.→ నా కుటుంబమే నా బలం. ఈ సినిమా, నా క్యారెక్టర్ ఇంత అద్భుతంగా రావడానికి ఒక కారణం జీవిత, మా పిల్లలు. వాళ్ల సపోర్టు చాలా గొప్పది. ఈ సినిమా నేను చేసినప్పుడు నన్ను స్కూల్ కి డ్రాప్ చేసి మళ్లీ అక్కడి నుంచి తీసుకొచ్చే ఒక మదర్ లాగా చూసుకున్నారు.→ కొత్త సినిమాల విషయాలకొస్తే..పవన్ సాదినేనితో 'మగాడు' అనే సినిమా చేస్తున్నాను. అది ఇంకా 20% మిగిలింది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ అనుకుంటున్నారు. అలాగే నేను రమ్య విశ్వదేవ్ శివాని కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అది షూటింగ్ జరుగుతుంది త్వరలోనే టైటిల్ రిలీజ్ చేస్తాం. బైకర్ తో పాటు ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా నా కెరీర్లో చాలా మంచి సినిమాలు అవుతాయని నమ్మకం ఉంది. -
సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్
ఇప్పటి హీరోలు క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్దంగా ఉంటారు. తమ మేకోవర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. రీసెంట్గా వచ్చిన ఇద్దరు హీరోల లుక్స్ చూస్తే ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, మరొకరు అతడి బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్.వీరిద్దరూ తమ మేకోవర్స్‌తో టోటల్ ఇండస్ట్రీని ఆకర్షిస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ విషయానికొస్తే, తాజాగా తన పుట్టినరోజు నాడు రిలీజైన 'పెద్ది' సినిమా రెండో గ్లింప్స్ లో అందర్నీ ఆకట్టుకున్న అంశం చరణ్ బాడీ. ఆ పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో ఆ లుక్ చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది.చరణ్ ఈ లుక్ కోసం కొన్ని నెలల పాటు మాంసాహారం మానేశాడని సమాచారం. ఓవైపు అయ్యప్ప దీక్షలో ఉంటూనే, మరోవైపు పహిల్వాన్ లుక్ కోసం కసరత్తులు చేశాడు. పహిల్వాన్ లుక్ కోసం నిజమైన పహిల్వాన్లు చేసే కసరత్తులనే చరణ్ చేశాడు. అలా దాదాపు 8 నెలల పాటు ఎంతో కష్టపడి మరీ ఈ కండలు తిరిగే దేహాన్ని చరణ్ సొంతం చేసుకున్నాడు.అయితే శర్వానంద్ బైకర్ రోల్ కోసం మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చేశాడు. ఆ రోల్ కోసం ఇతడు పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బైకర్ చిత్ర దర్శకుడు శర్వాను 6-8 కిలోలు తగ్గితే చాలన్నాడట. కానీ శర్వానంద్ మాత్రం అంతకుమించి కష్టపడ్డాడు. అక్షరాలా రోజుకు 32 కిలోమీటర్లు పరుగెత్తేవాడని సమాచారం.42 సంవత్సరాల శర్వానంద్ 18 ఏళ్ల బైక్ రేసర్‌గా కనిపించేందుకు తన శరీరంలోని ప్రతి అణువునూ కరిగించేలా కసరత్తు చేశాడట. ప్రస్తుతం తన ఒంట్లో ఏమాత్రం కొవ్వు లేనంత బక్కపల్చగా తయారయ్యాడు. ఇలా టీనేజర్ గా కనిపించడం కోసం శర్వానంద్ ఏకంగా రెండేళ్లు కష్టపడ్డాడు. ఇక బైకర్ ట్రయిలర్ ఎంత క్లిక్ అయిందో, అందులో శర్వా లుక్ అంతకంటే ఎక్కువగా అందరి ప్రశంసలు పొందింది. -
‘బైకర్’ శర్వానంద్ 23 కిలోలు తగ్గాడు: అభిలాష్ రెడ్డి
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బైకర్’. ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించగా, రాజశేఖర్, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో అభిలాష్ రెడ్డి కంకర మాట్లాడుతూ– ‘‘బైకర్’లో రేసింగ్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన కల్పిత కథ ఇది. తండ్రీ–కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. శర్వానంద్‌గారి నటన అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం కోసం ఆయన ఆరు నెలలు ఫిజికల్‌గా, మెంటల్‌గా ప్రిపేర్ అయ్యారు. 23 కేజీల బరువు తగ్గారు. ‘బైకర్’ను శర్వాగారు తన కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్‌గా చెప్పారు. ఇందులో శర్వాగారి తండ్రి, కోచ్ పాత్రలో రాజశేఖర్‌గారు నటించారు. ఆయన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. శర్వానంద్, రాజశేఖర్గార్లు, మాళవిక ... ఇలా అందరూ ‘బైకర్’ సినిమా ఫస్ట్ నరేషన్‌లోనే ఓకే చెప్పారు. ఈ కథకు అంతలా కనెక్ట్ అయ్యారు. కథ 1990, 2000.. ఇలా రెండు డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికే దాదాపు 60 రోజులు పట్టింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి రేసర్స్‌ను తీసుకువచ్చి చిత్రీకరించాం. అలాగే 90స్లోని రెండు స్పోర్ట్స్ బైక్స్ ఉండేవి, అవి ఇప్పుడు లేవు. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. ఇండియాలో శ్యామ్ కొఠారి అనే రేసర్ ఉన్నారు. క్రికెటర్‌గా కపిల్ దేవ్‌కి వచ్చినంత గుర్తింపు, రేసింగ్‌లో శ్యామ్ కొఠారీకి రాలేదు. మా సినిమా మోటివ్ కూడా ఇలాంటి గుర్తింపులు దక్కాలనే. మా నిర్మాతలు ఫస్ట్ కాపీ చూసి, హ్యాపీగా ఉన్నారు. త్రీడీలో చేద్దామని నిర్మాతలు అడిగితే నేనే వద్దన్నాను. సౌండ్, ఆర్ఆర్ విషయంలో జిబ్రాన్ సరికొత్త మ్యూజిక్ అందించారు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఓ మంచి ఫీలింగ్‌తో బయటకు వస్తారు. నా తర్వాతి సినిమా ‘దిల్’ రాజుగారితో ఉంటుంది’’ అన్నారు. -
నా నవ్వు బాగుందని ఆ పాత్ర చేయమన్నారు.. కానీ
కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తెలుగులోనూ అలా చాలా మూవీస్ ఉన్నాయి. ఇవి చూస్తున్న ప్రతిసారి.. వీళ్లు తప్పితే మరెవరు నటించినా అస్సలు సూట్ కాదు కదా అని కచ్చితంగా అనిపిస్తుంది. అలాంటి వాటిలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ ఒకటి. మరీ ముఖ్యంగా ఇందులో ప్రకాశ్ రాజ్, రేలంగి మామయ్యగా జీవించేశాడు. ఇప్పటికీ ఎవరైనా నవ్వుతూ ఉంటే సరదాగా రేలంగి మామయ్య అని ఆటపట్టిస్తుంటారు. అంతలా జనాల్లో వెళ్లిపోయింది. అయితే ఈ పాత్ర కోసం సీనియర్ నటుడు రాజశేఖర్‌ని తొలుత అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ఎప్పుడూ నవ్వుతూ ఉంటే పాత్ర కోసం దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. నా నవ్వు బాగుంటుందనే విషయాన్ని గుర్తుచేస్తూ నేను చేస్తే బాగుంటుందని అడిగారు. కానీ చేయలేకపోయాను' అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. చేయనుందుకు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అని అడగ్గా.. అలాంటిదేం లేదని అన్నారు. ఒకవేళ రాజశేఖర్.. రేలంగి మామయ్య పాత్ర చేసుంటే ఎలా ఉండేదో ఊహించుకోండి!శర్వానంద్ హీరోగా చేసిన 'బైకర్' మూవీలో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. ఇది వచ్చే నెల 3వ తేదీన థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్ల సందర్భంగానే చాలా విషయాలని రాజశేఖర్ పంచుకుంటున్నారు. అప్పట్లో ఈయన్ని వెతుక్కుంటూ చాలానే క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు వచ్చాయి. కానీ పలు కారణాలతో వాటిని వదులుకున్నారు. ఇప్పుడేమో ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి అని ఈయనే టాలీవుడ్ దర్శకనిర్మాతలని రిక్వెస్ట్ చేస్తున్నారు.రాజశేఖర్ కెరీర్ విషయానికొస్తే అప్పట్లో అల్లరి ప్రియుడు, సింహరాశి, మా అన్నయ్య, అంకుశం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో రాజశేఖర్.. గత కొన్నేళ్లుగా తెరపై కనిపించట్లేదు. చెప్పాలంటే ఈయన్ని దర్శకులు పట్టించుకోవడం మానేశారు. కొన్నాళ్ల క్రితం నితిన్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' మూవీలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు 'బైకర్'పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇందులో హీరోకి తండ్రి, బైక్ రేసింగ్ కోచ్‌గా కనిపించనున్నారు.(ఇదీ చదవండి: శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది) -
వినోదాల సందడి
మార్చి నెల ముగింపుకు వచ్చింది. దీంతో ఏప్రిల్ నెలలో ఏయే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయనే చర్చ ఆడియన్స్‌లో మొదలైంది. వచ్చే నెలలో డిఫరెంట్ జానర్స్‌లోని సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ జాబితాలో ‘పెద్ది’ వంటి పెద్ద చిత్రం నుంచి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వంటి చిన్న చిత్రాలు చాలానే ఉన్నాయి. మరి... ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆ సినిమా ఎలా ఉండబోతోంది? అనే విషయాలు ఈ విధంగా...పెద్ది పోరాటం వచ్చే నెల చివర్లో థియేటర్స్‌లోకి రానున్నాడు పెద్ది. రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ అండ్ పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ పాల్గొంటుండగా క్లైమాక్స్‌కు చెందిన టాకీ పార్టు చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. అయితే ఇంకా సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉంది. తొలుత ‘పెద్ది’ని రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయా లనుకున్నారు మేకర్స్. కానీ ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో టీమ్ చాలా స్పీడ్‌గా షూటింగ్ చేస్తోంది. ఆల్రెడీ ఒకసారి సినిమా రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో మరోసారి ఇలా జరగకూడదని పక్కా ప్లాన్‌తో షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలిసింది. ఈ స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేస్తారని, ఇదే సాంగ్‌లో ఈ చిత్రం హీరో హీరోయిన్లు రామ్ చరణ్, జాన్వీ సైతం కాలు కదుపుతారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.అలాగే ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ నుంచి సర్ప్రైజింగ్గా ఓ యాక్షన్ టీజర్‌ను రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేసిందని తెలిసింది. ‘పెద్ది’ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌లో రామ్‌చరణ్ క్రికెటర్‌గానే కనిపించారు. కానీ రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా రాబోతున్న యాక్షన్ టీజర్లో చరణ్ కుస్తీ పడుతున్న సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇంకా ‘పెద్ది’ చిత్రంలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి ఇతర క్రీడల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది.అంతేకాదు... ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఊరిలో నెలకొన్న ఓ సమస్య కోసం హీరో పాత్ర పోరాటం చేస్తుందని సమాచారం. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎమోషనల్ బైకర్ ఏప్రిల్ 3న థియేటర్స్‌లోకి దూసుకు రానున్నాడు బైకర్. శర్వానంద్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘వాడికి రేసింగ్ అంటే ప్రాణం..’, ‘నువ్వు అందరికంటే ముందు రాలేదు... నీ కంటే అందరూ వెనకాల వచ్చారు.రెండింటికి చాలా తేడా ఉంది’, ‘విక్కీతో కొంచెం మాములుగా ఉండొచ్చు కదా... ఎందుకంత కంట్రోల్ చేస్తావ్..., ఈగో ఇంపార్టెంట్ కాదు సుదర్శన్... నథింగ్ ఈజ్ బిగ్గర్ థేన్ స్పోర్ట్’, ‘నీలాంటి పిరికివాడితో పని చేయడం నాకు తెలియదు రా..’, ‘వాళ్ల నాన్నకు విక్కీ కొడుకు కాదు... రేసర్ అంతే..’, ‘కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రిని ఒక్కర్ని చూపించు’ వంటి డైలాగ్స్ ‘బైకర్’ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో వికాస్ నారాయణన్ పాత్రలో శర్వానంద్, బుల్లెట్ సునిల్ పాత్రలో రాజశేఖర్ నటించారు. ఇందులో రాజశేఖర్, శర్వానంద్ తండ్రీకొడుకులుగా చేశారు.‘బైకర్’ సినిమాలో రైసింగ్ అంశాలతో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా కథ 1990, 2000... ఇలా రెండు డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో సాగుతుంది. ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించగా, జిబ్రాన్ సంగీతం అందించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ‘బైకర్’ సినిమాను తొలుత గత ఏడాది డిసెంబరు 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్‌లో రాజీ పడకూడదని, యూనిట్ ఈ సినిమా రిలీజ్‌ను ఏప్రిల్ 3కి వాయిదా వేసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత శర్వానంద్ నుంచి రానున్న ‘బైకర్’ చిత్రంపై ఆడియన్స్‌లో అంచనాలు ఉన్నాయి.మాజీ ప్రేమికుల ప్రయాణం బ్రేకప్ తర్వాత ఇద్దరు మాజీ ప్రేమికులు మళ్లీ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రేమికులు తిరిగి ప్రేమలో పడతారా? ఈ ప్రయాణంలో వారు వాళ్ల గురించి ఏం తెలుసుకున్నారు? అన్న అంశాల నేపథ్యంలో ‘డెకాయిట్’ సినిమా తెరకెక్కిందని తెలిసింది. ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర చేశారు. దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు.అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ... ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దాదాపు 150 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో వచ్చే ఓ రాబరీ ఎపిసోడ్, అలాగే ‘కన్నె పిట్టరో..’ పాట హైలైట్స్‌గా ఉంటాయని సమాచారం. షానియల్ డియో దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరకర్త. సునీల్ నారంగ్ సహ–నిర్మాతగా వ్యవహరించారు.తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. తొలుత ‘డెకాయిట్’ సినిమాను మార్చి 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ తేదీకి రణ్వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా రిలీజ్‌కు షెడ్యూల్ కావడంతో ‘డెకాయిట్’ను ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. ఈ నెల 28న ఈ సినిమా నుంచి ‘చిచ్చుబడ్డి’ అనే పాట లిరికల్ వీడియో రిలీజ్ కానుంది.ఈ సంగతి ఇలా ఉంచితే... 2022లో అడివి శేష్ హీరోగా ‘హిట్: ది సెకండ్ కేసు’ సినిమా వచ్చింది. ఈ చిత్రం తర్వాత అడివి శేష్ సోలో హీరోగా మరో సినిమా థియేటర్స్‌కు రాలేదు. మూడు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా అడివి శేష్ నుంచి రాబోతున్న ‘డెకాయిట్’ సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి ఆడియన్స్‌లో నెలకొని ఉంది. ఇక గత ఏడాది నాని హీరోగా నటించిన ‘హిట్: ది థర్డ్ కేసు’ చిత్రంలో అడివి శేష్ ఓ అతిథి పాత్రలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.కాపాడే కవచం నిఖిల్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభూ’. సంయుక్త, నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిం చారు. ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. అయితే ‘స్వయంభూ’ సినిమాను తొలుత ఫిబ్రవరి 13న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అయితే ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చనే టాక్ తెరపైకి వచ్చింది.అంతేకాదు... ఏప్రిల్ 30న ‘పెద్ది’ సినిమా ఒకవేళ విడుదల కాకపోతే, ఆ తేదీకి తమ సినిమా విడుదలయ్యేలా ‘స్వయంభూ’ టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇక ఇటీవల ‘స్వయంభూ’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘సాక్షాత్తు ఆ సదాశివుడే దిగి వచ్చి, శ్రీరాముడికి అందించిన ఈ సింగోలుకి కూడా అరణ్యవాసమా?’, ‘యుద్ధమా?’, ‘అంతర్యుద్ధం..’, ‘కాలం కత్తై దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా..’, ‘బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా... కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది’ వంటి డైలాగ్స్ ఈ టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు.అమెరికా రిటర్న్స్ సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఫ్యాంటసీ అండ్ అడ్వెంచరస్ కామెడీ సినిమా ‘రాకాస’. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్‌కు రైటర్‌గా, ‘బెంచ్లైఫ్’ సిరీస్‌కు దర్శకురాలిగా చేసిన మానసా శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మానసా శర్మకు ఇది తొలి ఫీచర్ ఫిల్మ్. ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటించారు. ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇటీవల ‘రాకాస’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘నరకం నుండి సందేశం వస్తుంది.ఇక సమయం లేదు’, ‘మన ఊరి శాపం ఇది’, ‘మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత’, ‘ఐయామ్ వీరూ సార్... అమెరికా రిటర్న్స్’, ‘నేను రైట్ అడ్రస్‌కు వచ్చిన రాంగ్ పర్స్‌ని సార్... నాకు, ఈ ఊరికి అస్సలు సంబంధం లేదు సార్...’, ‘ఇది ఆఖరి హెచ్చరిక’ వంటి డైలాగ్స్ ఈ సినిమా టీజర్లో ఉన్నాయి. అయితే టీజర్‌లోని కంటెంట్, డైలాగ్స్‌ను బట్టి ‘రాకాస’ కథనం ఓ ఊరు, అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది. నేడు (బుధవారం) ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.ఇక ‘మ్యాడ్, మ్యాడ్ 2’ వంటి ఫీచర్ ఫిల్మ్స్‌లో సంగీత్ శోభన్ ఓ లీడ్ రోల్లో నటించారు. అలాగే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్‌లో హీరోగా చేశారు. కానీ ‘రాకాస’ చిత్రంలో మాత్రం సంగీత్ శోభన్ సోలో హీరోగా చేశారు. మరి... ఈ సినిమా సంగీత్ కెరీర్‌కు ఎంత మైలేజ్ ఇస్తుందన్న విషయం మరో పది రోజుల్లో తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఓ స్నేక్ డ్యాన్స్ ఉంది. ఇందులో హీరో హీరోయిన్లతో పాటు ఈ చిత్రనిర్మాత–నటి నిహారిక కొణిదెల గెస్ట్ రోల్ చేశారని తెలిసింది. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.తిమ్మరాజుపల్లిలో ఏం జరిగింది? సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ సినిమాకు వి. మునిరాజు దర్శకత్వం వహిం చారు. 1990 కాలంలో ఈ సినిమా కథనం సాగుతుంది. తేజ వేల్పుచర్లతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ సినిమా ప్రధాన కథాంశం తిమ్మరాజుపల్లి అనే ఊరి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఆ ఊరి ప్రజలు, హీరో ప్రేమకథ, శివరాత్రి జాగారం సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు... ఇలాంటి అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందట. వంశీకాంత్ రేఖన ఈ చిత్రానికి సంగీతం అందించారు.పాపం ప్రతాప్ ఇటీవలే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు తిరువీర్. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్.పి దుర్గా నరేష్ దర్శకత్వంలో రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ భార్యాభర్తలుగా నటించారు.అనువాద చిత్రాలూ ఉన్నాయికోలీవుడ్లో ఏప్రిల్‌లో విడుదలవుతున్న ముఖ్యమైన సినిమాల్లో ‘కర’ ఒకటి. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా, మమితా బైజు హీరోయిన్గా నటించారు. కేఎస్ రవికుమార్, జయరామ్, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి కె. గణేష్ ఈ సినిమాను నిర్మించారు. రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి మమితా బైజు, కేఎస్ రవికుమార్‌ల ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు.‘కర’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక తమిళ యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పత్య్రేకంగా చె΄్పాల్సిన అవసరం లేదు. ‘లవ్ టుడే, డ్రాగన్ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’), డ్యూడ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ప్రదీప్ దగ్గరయ్యారు. ఈ కుర్ర హీరో పటించిన తాజా చిత్రం ‘ఎల్.ఐ.కే ’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించారు. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నయనతార, ఎస్ఎస్ లలిత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేయాలనుకున్నారు.కానీ ఈ సినిమా ఏప్రిల్ 10కి వాయిదా పడిందని టాక్. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. శరవణన్ ‘లీడర్’ చిత్రం కూడా ఏప్రిల్‌లోనే రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇక బాలీవుడ్లో వచ్చే నెల రిలీజ్ కానున్న సినిమా ‘భూత్ బంగ్లా’. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ హారర్ సినిమాలో పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, టబు, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి మంగళవారం ‘తుహీ దిస్దా’ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను అర్జిత్ సింగ్ పాడారు.అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. మరోవైపు మాలీవుడ్‌లో ఏప్రిల్ 10న ‘పళ్లి చట్టంబి’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. టొవినో థామస్, కయదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.1950–1960 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. కన్నడలో ధ్రువ సర్జా నటించిన ‘కేడీ: ది డెవిల్’ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రేమ్ దర్శకత్వంలో ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ నిర్మించారు. సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి. రామచంద్రన్ ఈ మూవీలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఇలా వచ్చే నెల తెలుగులో రిలీజ్ కానున్న మరికొన్ని అనువాద సినిమాలు కూడా ఉన్నాయి.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఏప్రిల్‌లో రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
ప్రభాస్ అన్న చెప్పాడు సీనియర్స్ తరవాతే మేం సార్
-
శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్
అప్పట్లో అల్లరి ప్రియుడు, సింహరాశి, మా అన్నయ్య, అంకుశం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో రాజశేఖర్.. గత కొన్నేళ్లుగా తెరపై కనిపించట్లేదు. చెప్పాలంటే ఈయన్ని ఏ దర్శకులు కూడా తీసుకోవట్లేదు. కొన్నాళ్ల క్రితం నితిన్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' అనే మూవీలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ అస్సలు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈయన కీలక పాత్రలో నటించిన సినిమా 'బైకర్'. శర్వానంద్ హీరో. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలోనే రాజశేఖర్.. తనకు అవకాశాలు ఇవ్వాలని బతిమలాడుకున్నారు.(ఇదీ చదవండి: శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది)ఒకప్పుడు హీరోగా హిట్స్ కొట్టిన చాలామంది ఇప్పుడు తెరమరుగైపోయారు. మధ్యలో విలన్, సహాయ పాత్రలతో జగపతిబాబు లాంటి వాళ్లు వచ్చారు. ఒకరిద్దరు మాత్రమే బలంగా నిలబడ్డారు. ఇప్పుడు రాజశేఖర్ 'బైకర్'లో హీరో తండ్రిగా, రేసింగ్ కోచ్‌గా మంచి నిడివి ఉన్న పాత్రనే చేసినట్లున్నారు. అయితే తనని ఏ దర్శకుడు కూడా సంప్రదించకపోయేసరికి.. స్వయంగా ఈయనే 'ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి' అని రిక్వెస్ట్ చేశారు.సెకండ్ స్టేజీకి వచ్చేశానని ఇన్నాళ్లు అనుకున్నానని.. కానీ అలాంటివేం ఇప్పుడు లేవని తన కూతుళ్లు చెప్పడంతోనే 'బైకర్'లో నటించానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ చిత్ర షూటింగ్లో తనని రెండో హీరోలా ట్రీట్ చేశారని, శర్వానంద్ కూడా నేనే హీరోని అన్నట్లు ప్రవర్తించాడని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా రాజశేఖర్ లాంటి నటుడు.. ఇలా అవకాశాల కోసం బతిమలాడుకోవడం వింతగా అనిపించింది. రీసెంట్ టైంలో అయితే గోటీల ఫ్యాక్టరీ అనే మాటతో తెగ వైరల్ అవుతున్నారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?) -
శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది
శర్వానంద్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'బైకర్'. ఒకప్పటి హీరో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు కాగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది. లెక్క ప్రకారం గతేడాది డిసెంబరులోనే ఈ మూవీ రిలీజవ్వాలి. కానీ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది అదిరిపోయిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. అందులోనూ బైక్ రేసింగ్ కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు అయితే రాలేదు. ఇందులో శర్వానంద్, రాజశేఖర్.. తండ్రికొడుకులు పాత్రలు చేశారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉన్నాయి. మరి మూవీ ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?) -
శర్వానంద్ బైకర్ మూవీ.. మరో క్రేజీ సాంగ్ రిలీజ్
శర్వానంద్ హీరోగా వస్తోన్న రేసింగ్ చిత్రం బైకర్. ఈ సినిమాకు అభిలాష్ కంకర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డాల్బీ సినిమా, ఈపీఐక్యూ, 4డీఎక్స్, పీసీఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలోనూ విడుదల కానుంది.ఇప్పటికే ఓ సాంగ్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. జిద్దీ జిద్దీ అంటూ సాగే ఈ పాట ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఈ పాటను కంపోజ్ చేసిన జిబ్రాన్ తానే ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. -
డేరింగ్ బైక్ రేసర్
శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘బైకర్’. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించారు. రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలుపోషించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘‘ఈ చిత్రం డాల్బీ సినిమా, ఈపీఐక్యూ, 4డీఎక్స్, పీసీఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలోనూ విడుదల కానుంది.దీని ద్వారా ప్రేక్షకులకు మరింత అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ‘‘కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄÷ందిన చిత్రం ‘బైకర్’. ఇందులో శర్వానంద్ డేరింగ్ అండ్ ప్రొఫెషనల్ మోటార్ సైకిల్ రేసర్ పాత్రలో కనిపిస్తారు.ఈ పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రతి బైక్ రోర్, ప్రతి ఎమోషనల్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. నటుడు రాజశేఖర్ ‘బుల్లెట్ సునీల్’ అనే ఎక్స్ మోటోక్రాస్ లెజెండ్ పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: యువరాజ్. -
బుల్లెట్ సునీల్‌గా రాజశేఖర్.. గ్లింప్స్ చూశారా?
'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు హీరో శర్వానంద్. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం బైకర్. ఇందులో శర్వానంద్ బైకర్‌గా నటించాడు. పర్ఫెక్ట్ బైకర్‌గా కనిపించేందుకు ప్రత్యేకమైన ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. బాగా బరువు తగ్గాడు కూడా! ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదల కానున్నట్లు ప్రకటించారు.బుల్లెట్ సునీల్బుధవారం (ఫిబ్రవరి 4న) నాడు బైకర్ నుంచి బుల్లెట్ సునీల్‌ను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ వదిలారు. ఈ స్పోర్ట్ క్రికెట్ కాదు సునీల్, ఎవరూ పట్టించుకోరు. టైం వేస్ట్ చేసుకోకు అన్న వాయిస్‌తో టీజర్ మొదలైంది. 'సునీల్ మాజీ మోటోక్రాస్ రేసర్, అప్పట్లో బుల్లెట్ సునీల్ అనేవారు.కీలక పాత్రలో రాజశేఖర్18 ఇండియన్ ఛాంపియన్షిప్స్.. 57 సౌత్ జోన్ టైటిల్స్.. 100కి పైగా రేసుల్లో పాల్గొన్నాడు' అంటూ రాజశేఖర్‌ను రేసర్‌గా పరిచయం చేశారు. గ్లింప్స్‌లో రాజశేఖర్ లుక్స్ చూస్తుంటే గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో సింహరాశి, అల్లరి ప్రియుడు వంటి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజశేఖర్. 2017లో పీఎస్ గరుడవేగతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కానీ ఆకట్టుకోలేకపోయాడు.సినిమాబైకర్ విషయానికి వస్తే మూడు తరాల నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బైక్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ఇండోనేషియాలో చిత్రీకరించారు. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించాడు. చదవండి: 2 నెలలుగా నరకం చూస్తున్నా: వడాపావ్ గర్ల్ -
శర్వానంద్ బైకర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు.ఈ సమ్మర్ కానుకగా బైకర్ థియేటర్లలో సందడి చేయనుందని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. The engine's revved up 🏍️The track is ready 🛣️Now, THERE IS NO STOPPING HIM ❤️🔥#BIKER grand release worldwide on April 3rd, 2026 💥💥#BIKERMovie #GoAllTheWay 🏁#BikerOnApril3rdCharming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha… pic.twitter.com/HhIsmshA7i— UV Creations (@UV_Creations) February 3, 2026 -
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ 'ఆట' మొదలైంది!
సినిమా ఇండస్ట్రీలో స్పోర్ట్స్ జానర్ చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ చిత్రాలు వస్తుంటాయి. ఈ చిత్రాల్లోని స్పోర్ట్స్, నటీనటుల ఎమోషన్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే చాలు... భాషతో కూడా పని లేకుండా సూపర్ హిట్ అయిన స్పోర్ట్స్ మూవీస్ చాలానే ఉన్నాయి. తాజాగా తెలుగులో కొన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు రూపొందుతున్నాయి. మరి.. ఏయే హీరోలు స్పోర్ట్స్‌కి సై అంటూ... బరిలోకి దిగి, ఆట మొదలుపెట్టారో ఓ లుక్ వేయండి.క్రికెట్... కబడ్డీ ఏదైనా స్పోర్ట్స్ డ్రామా సినిమా వెండితెరపైకి వస్తే, ఆ సినిమాలో ఒక స్పోర్ట్ గురించిన ప్రస్తావనే ఉంటుంది. కానీ ‘పెద్ది’ సినిమాలో ఆడియన్స్ మూడ్నాలుగు క్రీడలను చూడబోతున్నారు. అవును... రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ప్రధానంగా క్రికెట్ కనపడుతుంది. అలాగే ఈ సినిమాలో కోకో, కబడ్డీ, కుస్తీ వంటి ఆటల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి ‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా కనిపిస్తారనే విషయంపై క్లారిటీ వచ్చింది.మరి... మిగతా ఆటలతో రామ్‌చరణ్ పాత్ర ఏ విధంగా కనెక్ట్ అయ్యుంటుందనే విషయంపై వచ్చే ఏడాది మార్చిలో స్పష్టత రానుంది. మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘పెద్ది’లో రామ్‌చరణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణను ప్లాన్ చేశారు. ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ (బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి) పర్యవేక్షణలో, నవనీత్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు కొరియోగ్రఫీ వహిస్తున్నారు.హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, ‘పెద్ది’ టీమ్ ఢిల్లీకి వెళ్లనుందని తెలిసింది. ఢిల్లీలో ఓ పెద్ద క్రికెట్ మ్యాచ్‌ను షూట్ చేస్తారని సమాచారం. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో జరిగే ఓ లాంగ్ షెడ్యూల్‌తో ‘పెద్ది’ షూటింగ్ ఓ కొలిక్కి వస్తుందని తెలిసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.బైకర్ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ వారంలో అంటే... ఈ నెల 6న ‘బైకర్’ సినిమా థియేటర్స్‌కి వచ్చి ఉండేది. కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకూడదని, ఆడియన్స్‌కు నిజమైన స్పోర్ట్స్ సినిమా చూసిన మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలని ‘బైకర్’ సినిమా టీమ్ తమ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసింది. శర్వానంద్ హీరోగా నటించిన మోటో క్రాస్ రేసింగ్ ఫిల్మ్ ‘బైకర్’. ఈ చిత్రంలో శర్వానంద్ బైకర్‌గా నటించారు. ఈ సినిమా కోసం శర్వానంద్ తనను తాను కొత్తగా మలచుకున్నారు.వెండితెరపై పర్ఫెక్ట్ బైకర్‌గా కనిపించేందుకు సరైన ఫిట్నెస్ ట్రైనింగ్‌తో బైకర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఈ పాత్ర కోసం బాగా బరువు తగ్గారు కూడా. ఈ సినిమాలోని బైక్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ఇండోనేషియాలో చిత్రీకరించారు. అలాగే ‘బైకర్’ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ కావొచ్చు కానీ ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నట్లుగా తెలిసింది. మూడు తరాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. 1990, 2000ల టైమ్ పీరియడ్‌లో ‘బైకర్’ సినిమా ఉంటుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.తొలిసారి స్పోర్ట్స్ డ్రామా దాదాపు ఐదేళ్ల క్రితం విజయ్ దేవరకొండ ‘హీరో’ (అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన టైటిల్) అనే ఓ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా చేయాల్సింది. ఈ స్పోర్ట్స్ బేస్డ్ మ్యూజికల్ మూవీలో మాళవికా మోహనన్ హీరోయిన్. ఈ సినిమాకు ఆనంద్ అన్నామలై దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించాల్సింది. ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. అలా అప్పట్లో విజయ్ దేవరకొండ చేయాల్సిన స్పోర్ట్స్ మూవీ పట్టాలెక్కలేదు. కానీ ఐదేళ్లకు మళ్లీ విజయ్ దేవరకొండకు ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ నచ్చిందట.‘ఇష్క్, మనం, 24’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా కథను అనుకుంటున్నారట. ఈ కథను ఇటీవల విజయ్ దేవరకొండకు వినిపించగా, ఈ హీరో ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట విక్రమ్ కె. కుమార్. అయితే ప్రస్తుతం దర్శకుడు రవికిరణ్ కోలాతో విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యాన్‌తో విజయ్ మరో సినిమా చేయాల్సి ఉంది. ఇలా... ‘రౌడీ జనార్ధన, రాహుల్ సంకృత్యాన్లతో విజయ్ చేయాల్సిన సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విక్రమ్ కె. కుమార్ సినిమాను విజయ్ టేకప్ చేస్తారని ఊహించవచ్చు. అయితే విజయ్ దేవరకొండకు విక్రమ్ కె. కుమార్ ఎలాంటి కథ చెప్పారనే విషయంపై స్పష్టత లేదు. లబ్బరు పందు మేక్... క్రికెట్ నేపథ్యానికి లవ్ అండ్ ఫ్యామిలీ అంశాలను జోడించి తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘లబ్బరు పందు’. హరీష్ కల్యాణ్, దినేష్, శ్వాసిక, సంజన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 సెప్టెంబరులో విడుదలై, సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్నట్లుగా తెలిసింది. ఈ తెలుగు రీమేక్‌లో రాజశేఖర్, రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్, రమ్యకృష్ణ, ‘35’ సినిమా ఫేమ్ విశ్వదేవ్, ప్రధాన తారాగణంగా నటిస్తున్నారని సమాచారం.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లుగా తెలిసింది. ఈ సినిమాలో రాజశేఖర్, విశ్వ తేజ్ క్రికెటర్లుగా కనిపిస్తారు. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరోవైపు దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత రాజశేఖర్, రమ్యకృష్ణ ఈ సినిమా కోసం మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండం విశేషం.థండర్ హీరో ఆది పినిశెట్టి ఫిట్నెస్, కటౌట్ ఓ స్పోర్ట్స్ డ్రామాకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందుకు తగ్గట్లుగానే ఆది పినిశెట్టి ‘థండర్’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. ఈ మూవీ కోసం ఆది కొత్తగా మేకోవర్ అయ్యారట. ఈ సినిమా గురించి త్వరలోనే మరికొన్ని కొత్త విషయాలను తెలియజేస్తానని ఆది పినిశెట్టి ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు.మట్టి కుస్తీ సీక్వెల్ విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘గట్టా కుస్తీ’. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగు హీరో రవితేజ ఓ నిర్మాత. ఈ చిత్రం 2022లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగులో ‘మట్టి కుస్తీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా సీక్వెల్ రూపొందుతోంది.ఇటీవలే ‘మట్టి కుస్తీ 2’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తొలి భాగంలో నటించిన విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మిలే మలి భాగంలోనూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే చెల్లా అయ్యావుయే సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వేల్స్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో కలిసి విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.మండాడి తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు హీరో సుహాస్ విలన్‌గా నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మండాడి’. ఈ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అయితే గత ఏడాది అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగింది. యూనిట్ సభ్యులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ, సామాగ్రి పాడైపోయింది. మరి... ఈ సినిమా నెక్ట్స్ అప్డేట్ గురించి మేకర్స్ మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.ఇటు క్రికెట్... అటు లవ్ ‘సుడిగాలి’ సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జీఓఏటీ’. ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్గా నటించారు. మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా కథ ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. కథనం క్రికెట్ నేపథ్యంలో సాగినా, లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్‌లు కూడా ఉంటాయని సమాచారం. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వీ, ఆడుకులం నరైన్, ఆనంద రామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.పతంగుల పోటీ ఇప్పటివరకూ ఎన్నో స్పోర్ట్స్ డ్రామా సినిమాలు చూసి ఉంటాం. కానీ గాలి పటాల పోటీ నేపథ్యంలో సినిమా వచ్చి ఉండదు. పతంగుల పోటీ అనే కాన్సెప్ట్‌తో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన తారాగణంగా, సింగర్ ఎస్పీ చరణ్ మరో కీలక పాత్రలో నటించిన సినిమా ‘పతంగ్’. ఈ కామెడీ స్పోర్ట్స్ మూవీకి ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది.ఇంకా మరికొన్ని స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు సెట్స్‌పై ఉండగా, ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
శర్వానంద్ బైకర్.. రిలీజ్‌కు ముందే ఫుల్ వీడియో సాంగ్
చాలా రోజుల గ్యాప్ తర్వాత టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. బైకర్ మూవీ ఫస్ట్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రెట్టి బేబీ అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు.కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను జిబ్రాన్, యాజిన్ నైజర్, సుభ్లాషిణి ఆలపించారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ శర్వా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్
గత కొన్నిరోజులుగా 'ఇదేటమ్మా మాయ మాయ' అనే పాత పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. ఇప్పుడు అదే పాటని స్టేజీ మీద స్వయంగా రాజశేఖర్(Rajasekhar) హమ్ చేశారు. అలానే తను ఎప్పటినుంచో ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇంతకీ ఈ వ్యాధి ఏంటి? రాజశేఖర్ ఎక్కడ ఈ విషయాన్ని చెప్పారు.అంకుశం, అల్లరి ప్రియుడు, సింహరాశి లాంటి సినిమాలతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రాజశేఖర్.. తర్వాత కాలంలో హిట్స్ లేక పూర్తిగా డీలా పడిపోయారు. 2017లో 'పీఎస్ గరుడ వేగ'తో సక్సెస్ అందుకున్న ఈయన తర్వాత ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా కనిపించలేదు. లాక్ డౌన్ టైంలో కరోనా కారణంగా అనారోగ్యానికి గురైన ఈయన.. కొన్నాళ్లకు ఇంటికే పరిమితమయ్యారు కూడా.(ఇదీ చదవండి: శర్వానంద్ 'బైకర్' గ్లింప్స్ రిలీజ్)2023లో నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన రాజశేఖర్.. తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు శర్వానంద్ హీరోగా చేస్తున్న 'బైకర్'లో ఈయన కూడా ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు తెలిసింది. తాజాగా గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా రాజశేఖర్.. ఈవెంట్లో కనిపించారు. తను కూడా మంచి పాత్రలో కనిపించబోతున్నానని చెప్పారు.మాటల మధ్యలో తాను చాన్నాళ్ల నుంచి 'ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్'(Irritable Bowel Syndrome) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని రాజశేఖర్ చెప్పారు. ఈవెంట్‌కి రావాలని, నిన్న తనకు సమాచారం అందించారని.. దీంతో స్పీచ్ ఏం ఇవ్వాలనే యాంగ్జైటీతో నా కడుపు అంతా చెడిపోయిందని అన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాధి గురించి రాజశేఖర్ మాట్లాడారు.ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది దీర్ఘకాలిక జీర్ణశయాంతర సమస్య. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు,మలబద్ధకం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ సమస్య వల్లనే చాలా ఇబ్బందులు పడుతుంటానని, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టదని గతంలో రాజశేఖర్ ఓసారి చెప్పారు. ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని, దీనివల్ల చాలా కోపం వస్తుండేదని, నా గురించి తెలిసిన వాళ్లు నేను ఏమన్నా పట్టించుకునేవారు కాదని అప్పట్లో చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఈ వ్యాధి గురించి మాట్లాడటంతో మరోసారి ఇది చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?) -
శర్వానంద్ 'బైకర్' గ్లింప్స్ రిలీజ్
గత మూడేళ్లలో ఒక్కటంటే ఒక్కటే సినిమా చేశాడు హీరో శర్వానంద్. అది 'మనమే'. గతేడాది రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. ప్రస్తుతం మూడు చిత్రాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి 'బైకర్'. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు సడన్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గ్లింప్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నవంబర్ బాక్సాఫీస్.. అందరికీ చాలా కీలకం)మట్టిలో బైక్ రేసింగ్ అనేది విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఓ బైకర్ కథతో తీసిన సినిమాలా ఇది అనిపిస్తుంది. విజువల్స్, డైలాగ్స్ అయితే బాగున్నాయి. అభిలాష్ కంకర అనే దర్శకుడు కాగా గిబ్రాన్ సంగీతమందించాడు. మాళవిక నాయర్ హీరోయిన్. డిసెంబరు 6న 'బైకర్' చిత్రం థియేటర్లలోకి రానుందని ప్రకటించారు.డిసెంబరు 5న 'అఖండ 2' రిలీజ్ కానుంది. దీనికి పోటీగా వేరే సినిమాలేం లేవు. లెక్క ప్రకారమైతే ఈ తేదీన 'రాజాసాబ్' రావాలి. కానీ సంక్రాంతికి వాయిదా వేయడంతో ఇప్పుడు ఆ ప్లేసులోకి 'బైకర్' వచ్చింది. మరి శర్వానంద్ ఈసారైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడా? లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)


