క్షణికావేశంలో తోసేసిన కొడుకు..
కన్నుమూసిన తండ్రి
చిన్నచిన్న గొడవలు.. క్షణికావేశం.. వెరసి బంధాలు, బంధుత్వాలను లెక్క చేయడం లేదు. ఆ కోపంలో ప్రవర్తించిన తీరు ప్రాణాలపైకి తెస్తుండగా.. పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టే పరిస్థితి నెలకొంటోంది. అరుుతే, ఇక్కడ ఓ కొడుకు కారణమేమిటో తెలియకున్నా తండ్రి తలపై గొడ్డలితో బాదడంతో ఆయన కన్నుమూయగా.. మరో ఘటనలో దత్తత తీసుకుని కన్నబిడ్డలా పెంచి పోషించాడన్న విషయూన్ని మరిచిపోరుున మరో వ్యక్తి... తండ్రిని నెట్టివేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
నెల్లికుదురు : క్షణికావేశానికి లోనైన కుమారుడు తోసెయ్యడంతో తండ్రి మృతి చెందిన ఘటన ఇది. మండలంలోని రామన్నగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం ఇలా ఉన్నారుు. గ్రామానికి చెందిన గార బిక్షం(65)-ఎల్లమ్మ దంపతులు అదే గ్రామంలోని పేర్నాక సుధాకర్‌ను దత్తత తీసుకుని పెంచి పోషించారు. ఈక్రమంలో సుధాకర్ తన వ్యవసాయ భూమివద్ద వ్యవసాయ పనులు చేస్తున్నాడు. అరుుతే, బిక్షం తన కుమారుడికి టిఫిన్ బాక్స్ తీసుకువెళ్లడంలో మంగళవారం కాస్తా ఆలస్యం జరిగింది.
దీంతో సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇరువురి నడుమ మాట మాట పెరిగింది. ఈ సందర్భంగా క్షణికావేశాని కి లోనైన సుధాకర్.. బిక్షంను తోసేసి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోయేసరికి బావి వద్ద పడుకున్నాడని అందరూ భావించారు. అరుుతే, బుధవారం వెళ్లి చూసేవరకు బిక్షం మృతి చెందినట్లు తెలుసుకున్న ఎల్లమ్మ తమకు ఫిర్యాదు చేసిందని ఎస్సై బందం ఉపేందర్‌రావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు.