bikshapati yadav
-
మాజీ ఎమ్మెల్యే భిక్షపతి కుమారుడు మృతి
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతి యాదవ్ చిన్న కుమారుడు రాజ్ కుమార్ (35) అనారోగ్యంతో ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ అపోలో హస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. భిక్షపతియాదవ్‌కు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు రాజ్ కుమార్ కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మసీద్‌బండలోని నివాసంలో పార్థీవదేహాన్ని ఉంచారు. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్‌కుమార్‌కు భార్య, ఓ కుమారుడు(25) ఉన్నారు. భిక్షపతి యాదవ్‌కు బంధువైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మసీద్‌బండలో రాజ్‌కుమార్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, జైపాల్ యాదవ్, బాల్క సుమన్, శ్రీధర్ బాబు, మాజీ మంత్రి కె.జానా రెడ్డి, మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు పద్మావతి, వంశీచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు యోగానంద్, కార్పొరేటర్లు రాగం నాగేందర్‌యాదవ్, హమీద్‌పటేల్, జగదీశ్వర్ గౌడ్, బొబ్బ నవతా రెడ్డి, దొడ్ల వెంకటేష్ గౌడ్, వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ కుమార్ యాదవ్ పార్థీవ దేహం పై పూల మాలలు ఉంచి నివాళులర్పించారు. భిక్షపతియాదవ్ కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. -
కూటమిలో కొట్లాట
-
రేసులో నిలిచేదెవరో?
అధికారపార్టీలో అలజడి మొదలైంది. అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం దూత ఆదివారం జిల్లాకు రానుండడంతో రాజకీయవాతావరణం వేడెక్కనుంది. గెలుపు గుర్రాల అన్వేషణ సాగిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలకుడి ముందు బలప్రదర్శనకు ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యర్థులకు పార్టీ టికెట్లు దక్కకుండా వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్న నేతలు.. సీటు ఎగురేసుకుపోయేందుకు ఎత్తులు వేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటరీ స్థానంతోపాటు దాని పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయ సేకరణకు పార్టీ పరిశీలకుడు, కర్ణాటక రాణిబెన్నూర్ ఎమ్మెల్యే కేబీ. కోలివాడ్ ఆదివారంనుంచి డీసీసీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల నుంచి ఈ సారి పోటీకి దిగేందుకు మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్య ఉత్సాహం చూపుతున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ కూడా ఈ సీటు రేసులో ఉన్నారు. జైపాల్ రెడ్డి పోటీనుంచి తప్పుకుంటే మాత్రమే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వీరందరూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం సీటుపై గురి పెట్టారు. మరోవైపు అసెంబ్లీలో ప్రవేశించేందుకు కుతూహలం చూపుతున్న నాయకులు కూడా వేగును ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ స్థానానికి ప్రధానంగా ముగ్గురు రేసులో ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన రమేశ్ సహా మాజీ ఎమ్మె ల్యే నారాయణరావు కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. మహారాజ్ కుటుంబం నుంచి వీరిరువురిలో ఎవరో ఒకరు బరిలో ఉండే అవకాశముంది. మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్, సబిత సోదరుడు నర్సింహరెడ్డి కూడా తాండూరు నుంచి పోటీకి యత్నిస్తున్నారు. ఈ శాసనసభ స్థానం నుంచి ఎన్నికల గోదాలో దిగేందుకు అధికారపార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. 2009లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన కాలె యాదయ్య సహా ఎస్సీ సెల్ కన్వీనర్ వెంకటస్వామి ఈసారి టికెట్ రేసులో ఉన్నారు. వీరేగాకుండా మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా ఇక్కడి నుంచి పోటీచేస్తారని రాజకీ యవర్గాల్లో చర్చ సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ప్రసాద్‌కుమార్ మళ్లీ బరిలో దిగనున్నారు. ఇక్కడి నుంచి మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ కూడా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఈయన కూడా ఏఐసీసీ దూతకు తన అంతరంగాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి. మాజీ మంత్రి సబిత అండదండలతో టికెట్‌ను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ సీటుపై ప్రధానంగా ఇద్దరు నేతలు కన్నేశారు. మాజీ మంత్రి కమ తం రాంరెడ్డి మరోసారి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతుండగా.. 2009లో రెబల్‌గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన పీసీసీ ప్రధాన కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలు తక్కువేనని ప్రచారం జరుగుతోంది. ఈసారి పొరుగున ఉన్న రాజేంద్రనగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఈ నియోజకవర్గంతో ఉన్న పాత పరిచయాలు తనకు కలిసివస్తాయని ఆమె అంచనా వేస్తున్నారు. సబిత మాత్రం మహేశ్వరం నుంచే మళ్లీ పోటీ చేస్తానని చెబుతున్నారు. సబిత ఇక్కడి నుంచి తప్పుకుంటే చల్లా నర్సింహరెడ్డి, గుర్రం నర్సింహరెడ్డిలు టికెట్ రేసులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో పరాజయం పాలైన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈసారి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. మొదట్లో సబిత అనుచరుడిగా మెలిగి.. ప్రస్తుతం కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పంచన చేరిన జ్ఞానేశ్వర్ ఆయన ఆశీస్సులతో బీ ఫారంను దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి మద్దతు కూడా కూడగడుతున్నారు. మరోవైపు ఈ సీటుపై మాజీ మంత్రి సబిత కూడా కన్నేశారు. ఒకవేళ తన తనయుడు కార్తీక్‌రెడ్డికి ఎంపీ టికెట్ దక్కని పక్షంలో ఇక్కడి నుంచి బరిలో నిలిపే దిశగా ఆలోచన సాగిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ మరోసారి పోటీకి ఉవ్విళ్లురుతున్నారు. ఒకవేళ ఆయన కాదనుకుంటే తన కుమారుడు రవికుమార్‌ను తెరమీదకు తెచ్చే అవకాశముంది. రాష్ట్ర ఓబీసీ సెల్ కన్వీనర్ రాగం నాగేందర్, హఫీజ్‌పేట కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ టికెట్ రే సులో ఉన్నారు. ఎమ్మెల్యేకు దీటుగా పరిశీలకుడి ఎదుట బలప్రదర్శన చేసేందుకు ఈ ఇరువురు నేతలు సన్నద్ధమవుతున్నారు.