రాష్ట్రసాధనలో డీఎస్ది కీలకపాత్ర
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్: తెలంగాణ సాధనలో పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారని, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత తొలిసారిగా మార్చి 2న జిల్లాకు వస్తున్న ఆయనకు ఘనస్వాగతం పలుకుదామని కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు తాహెర్, కేశవేణు పిలుపునిచ్చారు. నగరంలో ని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం వి లేకరులతో మాట్లాడారు. అరవయేళ్ళ తెలంగాణ కలను సోనియాగాంధీ నిజం చేశారన్నా రు. ఇందులో డీఎస్ పాత్ర ఎంతో ఉందన్నా రు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ సోనియాగాంధీతో తెలంగాణ అవశ్యకతపై చెబుతూ వచ్చారన్నారు. సీమాంధ్రులతో పార్టీకి నష్టం కలిగినా సోనియాగాంధీ ఆలోచించకుండా తెలంగాణ ప్రజల అకాంక్షను నెరవేర్చిందన్నారు. తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమికను పోషించి తొలిసారిగా జిల్లా కేంద్రానికి వస్తున్న డీఎస్ కు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
బస్వాపూర్ నుంచి..
నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దున ఉ న్న బస్వాపూర్ నుంచి డీఎస్‌కు ఘనంగా స్వాగతం పలుకుతామని డీసీసీ అధ్యక్షుడు తాహెర్ అన్నారు. డీఎస్ రాక సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల కమిటీకి చైర్మన్‌గా డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌ను నియమించారు. కలెక్టరేట్ మైదానంలో కళా బృందాలు,జానపద బృందాలు,తెలంగాణ ఆట లు,పాటలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు గడు గు తెలిపారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి రత్నాక ర్, సురేందర్, మాజీ ఎమ్మెల్యే సతీశ్‌పవార్, బీసీ సెల్ చైర్మన్ శేఖర్‌గౌడ్, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు గన్‌రాజ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు సుమన్, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు పుప్పాల విజయ, వివిధ మండలాల అ ధ్యక్షులు శ్రీనివాస్, గంగాధర్, ఎల్లయ్య పాల్గొన్నారు.