జీవీకే బయోసెన్సైస్‌కు చుక్కెదురు
54 డ్రగ్స్ మార్కెటింగ్‌ను నిషేధించిన జర్మనీ
బెర్లిన్: జీవీకే బయో సెన్సైస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన 54 మెడిసిన్స్‌ను మార్కెటింగ్ చేయకూడదని జర్మనీ డ్రగ్స్ రెగ్యులేటర్ ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ 700 జెనరిక్ డ్రగ్స్‌పై నిషేధం విధించటం తెలిసిందే. ఈయూ నిర్ణయంలో భాగంగా దేశంలోని సప్లై చైన్ నుంచి మరిన్ని ఔషధాలను తొలగించి కొత్త జాబితాను ప్రచురించామని జర్మన్ మెడిసిన్స్, మెడిసిన్ పరికరాల పెఢ రల్ ఇన్స్టిట్యూట్(బీఎఫ్ఏఆర్ఎం) పేర్కొంది.
జీవీకే బయో వైద్య పరిశోధనల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. జీవీకే వైద్య పరిశోధనలు నిర్వహించిన ఔషధాల వినియోగం వల్ల ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టంచేసింది. జీవీకే 2004-14 మధ్యకాలంలో చేసిన బయో-ఈక్వలెన్స్ స్టడీస్ దర్యాప్తు ఫలితాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని బీఎఫ్ఏఆర్ఎం పేర్కొంది.