సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆన్లైన్ వ్యవస్థ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని జ వహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం మరో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేసిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఇకపై ఆన్లైన్లో నిర్వహించనుంది. గతంలో మూడు వారాల నుంచి మూడు నెలల సమయం తీసుకునే ఈ ప్రక్రియ ఇకపై ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మూడు నుంచి నాలుగు రోజుల్లోగా పూర్తికానుంది. యూనివర్సిటీ అధికారులు ఇప్పటివరకు మాన్యువల్ విధానాన్నే అవలంభిస్తుండడంతో ధ్రువపత్రాలు పరిశీలనలో అంతులేని జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు పొందిన విద్యార్థులకు ఒక్కోమారు తీరని నష్టం వాటిల్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ట్రయల్న్ విజయవంతం
జేఎన్టీయూహెచ్ అనుబంధ, అఫిలియేటెడ్ కళాశాలల్లో డిగ్రీ, పీజీ పూర్తిచేసిన విద్యార్థులు దేశీయంగా, అంతర్జాతీయంగా ఏవైనా విద్యా సంస్థలు(యూనివర్సిటీలు), ఉద్యోగ సంస్థల్లో చేరుతుంటారు. వీరి విద్యార్హత పత్రాలు నిజమైనవో, కావోనని నిర్ధారించుకునేందుకు ఆయా సంస్థలు వెరిఫికేషన్ కోసం జిరాక్స్ ప్రతులను జేఎన్టీయూహెచ్కు పోస్టుద్వారా పంపుతుంటాయి. కొన్నిసార్లు వెరిఫికేషన్ రిపోర్టు రాక ఆయా సంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగావకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. మరికొన్ని సందర్భాల్లో ఆయా సంస్థలు పోస్టు ద్వారా పంపిన పత్రాలు మిస్ అయిన సంఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యలో.. జేఎన్టీయూహెచ్ ఆన్లైన్ ద్వారా ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గత వారం రోజులుగా నిర్వహించిన ట్రయల్న్ రవిజయవంతమైనట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతానికి ఇండియా వరకే
ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సదుపాయాన్ని ప్రస్తుతానికి దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, ఉద్యోగాలిచ్చే సంస్థలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా 2010 తర్వాత డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను మాత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేశామని, అంతకు ముందు చదివిన విద్యార్థుల వివరాలను త్వరలోనే అప్లోడ్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ధ్రువపత్రాల వెరిఫికేషన్ కోరే సంస్థలు జేఎన్టీయూహెచ్ వెబ్సైట్లో ఆన్లైన్ వెరిఫికేషన్ సిస్టమ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజనల్ డిగ్రీ, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోలను జిరాక్సు పత్రులను మాత్రమే ఆన్లైన్లో వెరిఫికేషన్ కోసం పంపాలి. విద్యార్థి హాల్‌టికెట్ నంబరు తప్పనిసరిగా నమోదు చేయాలి.