'నాకు ఇంకో కొడుకు కావాలి'
లండన్: తనకు మరో కుమారుడు కావాలని ప్రముఖ హాలీవుడ్ సింగర్ పీటర్ ఆండ్రి(43) అన్నాడు. ఇప్పటికే ఆయనకు తన మాజీ భార్య కాతి ప్రైస్ ద్వారా ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. కాతీ నుంచి విడిపోయిన తర్వతా ఆయన తనకంటే పదహారేళ్లు చిన్నదైన ఎమిలీ మెక్ డోనాగ్ తో పీటర్ లివింగ్ రిలేషన్ పెట్టకున్నాడు.
దీంతో వారిద్దరికి జనవరి 7, 2014న అమెలా అనే కూతురు జన్మించింది. ఆ తర్వాత 2015 జూలై 11న వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె మరోసారి గర్భం దాల్చింది. ఈ ఏడాది (2016) మే 26న భార్య గర్భవతి అంటూ పీటర్ ప్రకటించాడు కూడా. అయితే, ప్రస్తుతం తనకు ఒక కుమారుడు ఉన్నాడని, ఇప్పటికే కూతురుకి ఒక చెల్లి ఉన్నందున, తన పెద్ద కుమారుడికి ఒక సోదరుడు ఉంటే బాగుంటుందని, అందుకే కొడుకు జన్మించాలని కోరుకుంటున్నాని, కూతురు పుట్టినా తనకు సంతోషమే అంటూ చెప్పుకొచ్చాడు.