biscuts
-
‘ఒక్క బిస్కెట్ తక్కువైంది సార్’, కోర్టు మెట్లెక్కిన ఢిల్లీ బాబు.. చివరికి ఏమైందంటే?
తాను కొన్న బిస్కెట్ ప్యాకెట్లో ఒక బిస్కెట్ తక్కువైందంటూ ఓ వ్యక్తి కోర్టు మెట్లెక్కాడు. రెండేళ్ల పాటు విచారణ జరిగిన ఈ కేసులో కోర్టు తుది తీర్పు ఏమని ఇచ్చింది. చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్‌కు చెందిన పీ. ఢిల్లీ బాబు అనే వ్యక్తికి మూగ జీవాలంటే మహా ఇష్టం. అందుకే ప్రతి రోజు వీధికుక్కలకు బిస్కెట్లను ఆహారంగా అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఢిల్లీ బాబు ఎప్పటిలాగే కుక్కలకి బిస్కెట్లు అందించేందుకు ప్రముఖ ఎఫ్ఎంసీజీ ఐటీసీ సంస్థకు చెందిన సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్లు ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. అనంతరం ఆ బిస్కెట్ ప్యాకెట్‌ను పరిశీలించగా అందులో ఓ తప్పు జరుగుతున్నట్లు గుర్తించారు. సంస్థ రేపర్ (చాక్లెట్ కవర్) మీద 16 బిస్కెట్లు ఉన్నాయని చెప్పింది. కానీ తాను కొన్న బిస్కెట్ ప్యాకెట్లో రేపర్ మీద పేర్కొన్న బిస్కెట్ల సంఖ్య కన్నా ఒక బిస్కెట్ తక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వివరణ కోసం స్థానిక స్టోర్‌తో పాటు ఐటీసీకి మెయిల్ చేసినా స్పందన లేదు. ఒక్క బిస్కెట్ తక్కువైంది సార్ దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి 2021 డిసెంబర్ నెలలో చెన్నైలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఒక్కో బిస్కెట్ ధర 75 పైసలు. ఐటీసీ రోజుకు 50 లక్షల బిస్కెట్ల ప్యాకెట్లను తయారు చేస్తుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే కంపెనీ వినియోగదారులను ప్రతిరోజూ రూ.29 లక్షలు మేర మోసం చేస్తోంది అంటూ కోర్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రతిస్పందనగా ఐటీసీ సంస్థ బిస్కెట్లను సంఖ్య ఆధారంగా కాకుండా బరువు ఆధారంగా విక్రయిస్తారని వాదించింది. ఇరు వాదనల విన్న కోర్టు సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్‌ను పరిశీలించింది. ప్రతి ప్యాకెట్‌పై పేర్కొన్న నికర బరువు 76 గ్రాములు. అయితే, 15 బిస్కెట్లు ఉన్న ఒక్కో ప్యాక్ 74 గ్రాముల బరువు మాత్రమేనని కోర్టు గుర్తించింది. అసంతృప్తికి గురైన కోర్టు 2011 నాటి లీగల్ మెట్రాలజీ నిబంధనలు ముందుగా ప్యాక్ చేసిన వస్తువులలో గరిష్టంగా 4.5 గ్రాముల వ్యత్యాసాన్ని అనుమతించాయని కోర్టుకు విన్నవించుకుంది. అయితే, అస్థిర ఉత్పత్తుల విషయంలో మాత్రమే ఇటువంటి మినహాయింపులు చెల్లుబాటు అవుతాయని కోర్టు సంస్థ ఇచ్చిన వివరణను తిరస్కరించింది. బిస్కెట్లు కాలక్రమేణా బరువు తగ్గవు కాబట్టి నియమం వర్తించదు అని స్పష్టం చేసింది. పైగా, రేపర్‌పై ఐటీసీ 16 బిస్కెట్లను పేర్కొన్నందున, సంఖ్య కాకుండా.. బరువు ఆధారంగా బిస్కెట్లు విక్రయించారనే వాదన కూడా కొట్టివేసింది. లక్ష చెల్లించాలని ఆదేశాలు బిస్కెట్ ప్యాకెట్లో రేపర్‌పై పేర్కొన్న బిస్కెట్ల సంఖ్య కన్నా ఒక బిస్కట్ తక్కువగా ప్యాక్ చేశారంటూ ఐటీసీకి వినియోగదారుల కోర్టు రూ. 1 లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ఫిర్యాదు దారుడు ఢిల్లీ బాబుకు చెల్లించాలని ఐటీసీ సంస్థకు వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్‌కాకి
బిస్కెట్ల డబ్బా తీసుకుని దాక్కుని తింటూ కూర్చున్న చిన్నారి వీడియో మురిపిస్తోంది. తనను గమనించిన తండ్రి వచ్చి చూడగా ఆ చిన్నారి ముసిముసిగా నవ్వుతూ బిస్కెట్ తింటుండడం నవ్వులు తెప్పిస్తోంది. ఆ చిన్నారి బిస్కెట్ల డబ్బా దొంగతనం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఎక్కడి వీడియో తెలియదు కానీ పాప పేరు మాత్రం డైలీన్. కూతురిని పిలుస్తూ తండ్రి ‘డైలీన్ ఎక్కడ’ అంటూ వీడియో తీసుకుంటూ వెతుకు డైనింగ్ టేబుల్ పక్కన ఉన్న టేబుల్ వద్దకు వచ్చాడు. చదవండి: ‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు ఆ టేబుల్ పక్కన చిన్నారి ఒరియో బిస్కెట్ జాడీతో కనిపించింది. పాపను చూసి ఆ తండ్రికి నవ్వాగలేదు. తండ్రిని చూసిన డైలీన్ చిన్న నవ్వు నవ్వింది. అది అందరినీ ఆకట్టుకుంటోంది. ముసిముసి నవ్వు హృదయాలను పిండేస్తోంది. ‘ఏం చేస్తున్నావ్ డైలీన్? ఏం చేస్తున్నవ్’ అని రెండు మూడుసార్లు అడిగాడు. ఆ పాప నవ్వుతూ బిస్కెట్ నోట్లో పెట్టేసుకుంది. ‘ఇక చాలు. నీకు అన్నేసి బిస్కెట్లు అవసరం లేదు’ అని తండ్రి చెబుతున్నా పాప పట్టించుకోలేదు. ఈ సందర్భంగా తండ్రికి చేయి చాపి ఏదో చెప్పబోయింది. రెండేళ్ల పాప బిస్కెట్ల దొంగతనం వీడియోను అప్వర్తీ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించింది. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి ఈ వీడియో నెటిజన్లను మురిసిపోయేలా చేసింది. చిన్నారి బోసినవ్వు హృదయానికి హాయి కల్పించేలా ఉంది. పాప అందంగా.. ఫన్నీ ఉందని ఒకరు కామెంట్ చేయగా.. ‘పాప నవ్వుకు నేను ఫిదా అయిపోయా’ అంటూ మరొకరు తెలిపాడు. మీరు కూడా ఆ పాప నవ్వు చూసేయండి. ఉన్న స్ట్రెస్సంతా మాయమైపోతుంది. View this post on Instagram A post shared by Upworthy (@upworthy) -
బంగారం బిస్కెట్లు అపహరణ
ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా బ్యాగ్ నుంచి ప్యాకెట్ మాయం అన్నవరం : బస్సులో తుని వెళుతున్న ఓ వ్యక్తి బ్యాగ్‌లోని రూ.15 లక్షల విలువైన బంగారం బిస్కెట్లను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటనపై అన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై పార్ధసారథి తెలిపిన వివరాలిలా ఉన్నాయి...రాజమహేంద్రవరంలోని భాగ్యలక్ష్మీ జ్యూయలర్స్‌లో పనిచేసే కర్రి అప్పారావు యజమాని దీపక్‌కుమార్ జైన్ ఇచ్చిన బంగారాన్ని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చిరు బంగారు వ్యాపారులకు తీసుకెళ్లి అప్పగిస్తుంటాడు. అదే విధంగా గురువారం ఆ జ్యూయలర్స్‌కు చెందిన 1,200 గ్రాముల బరువు గల 12 బంగారు బిస్కెట్లు గల బ్యాగ్‌ను తునిలోని ఓ వ్యాపారికి అప్పగించేందుకు బయలుదేరాడు. ఉదయం 10.45 గంటలకు రాజమహేంద్రవరం - ఇచ్ఛాపురం బస్సు ఎక్కి అన్నవరంలో 12.45 గంటలకు దిగాడు. అక్కడి నుంచి తుని వెళ్లేందుకు మరో బస్సు ఎక్కాడు. అతడితో పాటు ఆ బస్సులోకి మరో నలుగురు వ్యక్తులు ఎక్కారు. వారు కాకినాడ పోర్టుకు బస్సు వెళుతుండగా అని అడగడంతో కండక్టర్ వెళ్లదని సమాధానం చెప్పాడు. దీంతో వారు బస్సుదిగి వెళ్లిపోయారు. అప్పటికే బస్సు అన్నవరం పాత బస్టాండ్ వరకూ వచ్చేసింది. ఆ నలుగురూ దిగిపోయాక అప్పారావుకు అనుమానం వచ్చి బ్యాగ్ తెరచి చూడగా బంగారం బిస్కెట్లతో ఉన్న ప్యాకెట్ కనిపించలేదు. అతడు కూడా బస్సు దిగి ఆ నలుగురి కోసం గాలించాడు. వారి జాడ లేకపోవడంతో యజమాని దీపక్‌కుమార్ జైన్‌కు సమాచారం అందించాడు. ఆయన సూచనల మేరకు అర్ధరాత్రి 12 గంటలకు అన్నవరం పోలీసులకు అప్పారావు ఫిర్యాదు చేశాడు. ఎస్సై పార్థసారధి కేసు నమోదు చేయగా ప్రత్తిపాడు సీఐ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. చోరీపై పలు అనుమానాలు ఈ బంగారు బిస్కెట్ల చోరీ ఫిర్యాదుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదుదారుని మాటల్లో అంత స్పష్టత లేకపోవడంతో అతడిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.15 లక్షల విలువైన 1,200 గ్రాముల బంగారం తెచ్చే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉంటాడని, కానీ ఫిర్యాదుదారుని మాటల ప్రకారం చూస్తే అతను జాగ్రత్తగా ఉన్నట్టు కనిపించడం లేదంటున్నారు. అతను బంగారం పెట్టిన బ్యాగ్ చూస్తే సులువుగా జిప్ వచ్చేదిగా కనిపించడం లేదంటున్నారు. దగ్గరకు నొక్కినట్టు ఉండే ఆ బ్యాగ్‌ను విడదీసి అప్పుడు జిప్ తీయాల్సి ఉంటుందంటున్నారు. ఆ బ్యాగ్ నుంచి బంగారం చోరీ సులభంగా జరిగే పని కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాగ్ కూడా ఎక్కడా కోసినట్టు లేదని పోలీసులు తెలిపారు. దీనిపై పలు కోణాల్లో దర్యాప్తు చేయనున్నారు. -
మత్తుమందిచ్చి చోరీ
విజయవాడ (రైల్వేస్టేషన్): ప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన బుధవారం న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తుతున్న కేరళ ఎక్స్‌ప్రెస్(12626)రైల్లో జరిగింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నీలిమ సొప్పాంజి(35), మణిక్కాం(41) దంపతులు న్యూఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌కు కేరళ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. మార్గ మధ్యలో ముగ్గురు యువకులు వీరు ప్రయాణిస్తున్న ఎస్7 బోగీలో ఎక్కి, దంపతులతో మాటలు కలిపి బిస్కెట్లు ఇచ్చారు. అందులో మత్తు మందు కలిపి ఉండటంతో దంపతులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో వారి వద్ద ఉన్న లాప్‌ట్యాప్, రూ.3,000 నగదు, బంగారపు గొలుసును చోరీ చేశారు. వీరికి మెలకువ వచ్చేసరికి రైలు వరంగల్ చేరింది. అక్కడ రైలు ఎక్కువసేపు ఆగక పోవడంతో జీఆర్పీ పోలీసులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. వారిని విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.