ట్రంప్ కు తప్పని ఇంటిపోరు
వాషింగ్ టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీనుంచే భారీ ఎదురు దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరపున నామినేషన్ను ఖరారు చేసుకున్న ట్రంప్ కు మద్దతు ఇవ్వబోమని పార్టీలోని టాప్ సెక్షన్ బహిరంగంగానే ప్రకటించింది. ఈ మేరకు పార్టీలో రెండు వర్గాలుగా శనివారం చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతూ అధ్యక్ష పీఠానికి చేరువవుతున్న వివాదాస్పద రియల్టర్, బిలియనీర్ డోనాల్డ్ .ట్రంప్ కు చెక్ పెట్టేందుకు రిపబ్లికన్ పార్టీ పెద్దలు సిద్దమవుతున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఆయనకు మద్దతిచ్చేది లేదని తేల్చి చెబుతన్నారు. ట్రంప్ నామినేషన్ వ్యవహారంలో పార్టీ పెద్దల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ట్రంప్ కు ఇంటిపోరు తప్పేలా కనిపించడం లేదు.
అమెరికా మాజీ అధ్యక్షుల సోదరుడైన ఫ్లోరిడా మాజీ గవర్నర్ జెబ్ బుష్, సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహంకు జతకలిశాడు ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రంప్ కూడా మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పి ట్రంప్ కి ఝలక్ ఇచ్చాడు ట్రంప్ సరైన అభ్యర్తినని తాను నమ్మడం లేదంటూ ఫేస్ బుక్ లో బహిరంగ ప్రకటన చేశాడు. పార్టీకూడా ట్రంప్ ను సుప్రీంగా ఎన్నుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ లోజరిగే ఎన్నికల్లో తాను క్లింటన్ కుగానీ ట్రంప్ కు కానీ ఓటు వేయడం లేదన్నారు. అమెరికన్ అధ్యక్ష కార్యాలయం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, అధ్యక్షుడికి సవాళ్లను స్వీకరించే ధైర్యం, వినయం, మానవత్వం లాంటి లక్షణాలుండాలని, అలాంటివేవీ ట్రంప్ లో లేవని, అసలు అతను స్థిరమైన పార్టీ సభ్యుడుకాదని మిస్టర్ జెబ్ విమర్శించాడు. అటు క్లైవ్ లాండ్ కన్ వెన్షన్ కు తాను హాజరు కావడంలేదని జాన్ మెక్ కెయిన్ ప్రకటించాడు.
మరోవైపు టెక్సాస్ గవర్నర్ రిక్ పెర్రీ, 1996 అధ్యక్ష ఎన్నికల నామినీ, బాబ్ డోలే ట్రంప్ కు గట్టి మద్దతునందిస్తున్నారు. ప్రజలు ట్రంప్ ను ప్రజలు గౌరవించి అత్యధిక మెజార్టీతో గెలిపించారని, అలాంటి ప్రజల తీర్పును గౌరవించాలని ట్రంప్ కు మేజర్ సపోర్ట్ నిస్తున్న బోలే వాదించాడు. జూలై జరిగే క్లీవ్ లాండ్ కన్వెన్షన్ కు హాజరై, ట్రంప్ కు మద్దతుగా ఓటు వేస్తానని స్పష్టం చేశాడు.
అయితే జెబ్, గ్రాహం ఆరోపణలను ట్రంప్ కొట్టి పారేశారు. ఓటర్లను వారిని తిరస్కరించడంతో తనపై దాడికి దిగారని విమర్శించారు. హిల్లరీకి ఓడించడానికి పార్టీని ఏకం చేసే సమర్థతకు తనకు ఉందని స్పష్టం చేశాడు.
కాగా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.... తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నప్పటికీ కీలకమైన ఇండియానా ప్రైమరీ ఎన్నికల్లోనూ ఘన విజయంతో తన గట్టి పోటీదారుడైన టెడ్క్రుజ్ను మట్టికరిపించాడు. ఇండియానా ప్రైమరీ ఎన్నికల్లో గెలుపుతో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధిని తానేనని నిరూపించుకున్న ట్రంప్.... జూన్ 7న నామినేషన్ వేయనున్నారు. అలాగే అమెరికా అధ్యక్ష పదవికి అసలైన ఎన్నికలు నవంబర్ 8న జరగనున్నాయి.