UP BJP leader
-
వారి అవినీతికి ‘ట్విన్ టవర్స్’ సజీవ సాక్ష్యం: డిప్యూటీ సీఎం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు క్షణాల వ్యవధిలోనే నేలమట్టమయ్యాయి. అనధికారికంగా, అక్రమంగా గ్రీన్జోన్లో నిర్మించిన అత్యంత ఎత్తైన టవర్స్‌ను కూల్చేయాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నోయిడా అథారిటీ అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో విపక్షాలపై విమర్శలు గుప్పించింది ఉత్తర్‌ప్రదేశ్ అధికార బీజేపీ. అలాంటి అక్రమ కట్టడాలతో రాజకీయ నాయకులు, బిల్డర్స్, అధికారుల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుస్తుందని విమర్శించింది. భవిష్యత్తులో రాష్ట్రంలోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నోయిడా ట్విన్ టవర్స్ నిర్మాణానికి 2004లో అనుమతులు లభించాయి. దీంతో అప్పటి సమాజ్‌వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య. ‘సమాజ్ వాదీ పార్టీ అవినీతి, అరాచకాలకు నోయిడా ట్విట్ టవర్స్ సజీవ సాక్ష్యం. నేడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఎస్పీ అవినీతి భవనం కూలిపోతుంది. ఇదే న్యాయం, ఇదే సుపరిపాలన.’ అని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం. नोएडा का सुपरटेक ट्विन टॉवर श्री अखिलेश यादव और सपा के शासनकाल के भ्रष्टाचार और अराजकता की नीति का जीवंत प्रमाण है। आज मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी के नेतृत्व में भाजपा की सरकार में सपा के भ्रष्टाचार की इमारत ढहेगी। यह है न्याय, यही सुशासन।#TwinTowers — Keshav Prasad Maurya (@kpmaurya1) August 28, 2022 డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరోపణలను తిప్పికొట్టింది సమాజ్ వాదీ పార్టీ. ‘ఈ అవినీత కట్టడం నిర్మించటానికి బీజేపీ సైతం కారణం. బీజేపీకి సూపర్‌టెక్ భారీగా నిధులు ముట్టజెప్పింది. కాషాయ పార్టీకి చెందిన ఆఫీసులో కూర్చుని ఓ బ్రోకర్ అందుకు బ్రోకరేజ్ అందుకున్నాడు.’ అని ఆరోపించింది. ఇదీ చదవండి: Noida Twin Towers: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోనే.. -
బీజేపీలో చేరితే చంపుతామంటున్నారు!
అలీగఢ్: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నందుకు సొంత వర్గీయులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని బీజేపీకి చెందిన మైనార్టీ నాయకురాలు తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదిస్తూ ఇటీవల పార్లమెంటులో కొత్త చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చర్యతో ప్రధాని మోదీ పట్ల అభిమానంతో పలువురు ముస్లిం మహిళలు బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. అంతేకాక బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముస్లిం మహిళలు చెప్పుకోదగ్గ స్థాయిలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో యూపీలోని ఆలీగఢ్‌లో మైనారిటీ వర్గానికి చెందిన బీజేపీ నాయకురాలు ఫరీన్ మోసిన్ స్థానికంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో తనకు బెదిరింపులు వచ్చాయనీ అంతేగాక, తన భర్త మహమ్మద్ మోసీన్పై అతని ఆఫీసులోనే దాదాపు ఏడెనిమిది మంది దాడి చేసి త్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా వ్యవహరిస్తే నిన్నూ, నీ భార్యను చంపేస్తామని బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన ఈ నెల 8న జరిగింది. అదే రోజు త్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. కాగా, ఈ కేసు విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అలీగఢ్ ఏఎస్పీ అభిషేక్ తెలిపారు. -
ఇది మా నాన్న వద్దనుకున్న శాలువా..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై చిందులు తొక్కుతున్న బీజేపీ నేతలు బీఎస్పీ అధ్యక్షురాలు, యూపీ మాజీ సీఎం మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా.. యూపీ బీజేపీ చీఫ్ ఎంఎన్ పాండే ఆ జాబితాలో చేరారు. మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఎస్పీ-బీఎస్పీ పొత్తు సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాయావతికి శాలువా కప్పుతున్న వీడియో అది. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఉన్నప్పుడు ఇది మా నాన్న కప్పుకునేవారు. కానీ, 1995 గెస్ట్‌హౌజ్ ఘటన తర్వాత ఆయన తన ఒంటి మీది నుంచి ఈ శాలువా తీసేశారు. మళ్లీ మీకు కప్పుతున్నా.. అని అఖిలేష్ మనసులో అనుకుంటున్నట్టుగా వీడియో కింద రాసుకొచ్చాడు’ అని పాండే ఉటంకించారు. కాగా, పాండే వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిగా రాజకీయాలు చేస్తే వీళ్లదేం పోయిందంటూ బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. యూపీలో ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి’ అని దుర్భాషలాడారు. కాగా, 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో 38-38 చొప్పున పోటీ చేస్తామని ఎస్పీ-బీఎస్పీ ప్రకటించాయి. -
‘చంపేస్తామని బెదిరిస్తున్నారు’
లక్నో : ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించిన షహజన్పూర్కు చెందిన మహిళ తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ నేత కుమారుడిపై ఆరోపణలు చేసినప్పటి నుంచి హెచ్చరికలు వస్తున్నాయని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కితీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని కొందరు దుండగలు బాధితురాలిని బెదిరిస్తున్నారని ఆమె న్యాయవాది అవధేష్ సింగ్ చెప్పారు. ఫిర్యాదును వెనక్కితీసుకోకుంటే హతమారుస్తామని గూండాలు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలిని బెదిరించారని వెల్లడించారు. తనను లైంగికంగా వేధించిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సదరు మహిళ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఉన్నావ్, కథువా లైంగిక దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై బాధితురాలు చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. -
మోదీ ర్యాలీకి రైలు బుక్ చేసినందుకు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ యూనిట్ బీజేపీ చీఫ్ వినోద్ సమారియాకు ఓ సమస్య వచ్చిపడింది. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ పాల్గొన్న లక్నో ర్యాలీకి ఆగ్రా నుంచి కార్యకర్తలను తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ఓ రైలును బుక్ చేసింది. బీజేపీ నాయకుడు వినోద్ సమారియా పేరు మీద ఈ రైలును బుక్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం, మోదీ ప్రధాని అయిన సంగతి తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్నా రెండేళ్ల క్రితం బుక్ చేసుకున్న రైలుకు బీజేపీ నాయకులు ఇంకా అద్దె చెల్లించలేదు. దీంతో రైలు అద్దె 12.3 లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా రైల్వే శాఖ వినోద్‌కు తాఖీదులు పంపింది. వినోద్ పేరు మీద రిజర్వేషన్ చేసుకున్నందుకు ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని పార్టీ నాయకులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన వినోద్.. బీజేపీ రైలు అద్దె చెల్లించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. -
కాల్చేస్తే 11 లక్షలు.. నాలుక కోస్తే 5లక్షలు
* ఢిల్లీలో కన్హయ్యపై ‘కాల్చివేత’ పోస్టర్లు.. కేసు నమోదు * నాలిక కోస్తే ఆఫర్ ఇచ్చిన బీజేపీ నేత న్యూఢిల్లీ/బదాయూ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ లక్ష్యంగా రివార్డుల ప్రకటనలు వెలువడ్డాయి. ఆయనను కాల్చేస్తే రూ. 11 లక్షలు ఇస్తామని ఢిల్లీలో ‘పూర్వాంచల్ సేన’ పేరుతో శుక్రవారం పోస్టర్లు వెలిశాయి. మరోవైపు.. ఆయన నాలుక కోస్తే రూ. 5 లక్షలు ఇస్తామని యూపీ బీజేపీ నేత ప్రకటించారు. ఢిల్లీ ప్రెస్‌క్లబ్ గోడపై పూర్వాంచల్ సేన పోస్టర్లు అతికిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. కేసు నమోదు చేసి, వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పోస్టర్లో పూర్వాంచల్ సేన అధ్యక్షుడిగా పేర్కొంటూ ఆదర్శ్ శర్మ పేరు, ఫోన్ నంబరు ఉన్నాయి. కాగా, కన్హయ్య విడుదలయ్యాక బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, అతని నాలుక కోసిన వారికి రివార్డు ఇస్తానని బాదాయూ జిల్లా బీజేపీ యువమోర్చా చీఫ్ కులదీప్ వర్షనయ్ ప్రకటించారు. దీంతో ఆయన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్ల పాటు బీజేపీ అధిష్టానం బహిష్కరించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోనివ్వం: రాహుల్ జేఎన్‌యూలోని 8 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడానికి బీజేపీని అనుమతించబోమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అస్సాం ఎన్నికల సభలో అన్నారు. ‘కన్హయ్య ప్రసంగాన్ని 20 నిమిషాలు విన్నాను. ఒక్క పదమూ దేశానికి వ్యతిరేకంగా లేదు’ అని చెప్పారు. * కన్హయ్యకు భద్రతలో లోపాలు తలెత్తకుండా వర్సిటీ వెలుపలికి సంబంధించి ఆయన కదలికల వివరాలను తమకు అందించాలని ఢిల్లీ పోలీసులు జేఎన్‌యూ అధికారులను కోరారు. * విడుదలైన తర్వాత కన్హయ్య ఇచ్చిన ప్రసంగం బావుందని, అది దేశానికి వ్యతిరేకంగా లేదని బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కొనియాడారు. * రాహుల్ జేఎన్యూకు వెళ్లినందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ అన్నారు. * రోహిత్ వేముల.. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు మద్దుతుగా సభ నిర్వహించాడని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. * భావప్రకటన స్వేచ్ఛపై కన్హయ్య తనతో చర్చలకు రావాలని లూధియానాకు చెందిన జాహ్నవి బెహల్ అనే 15 ఏళ్ల విద్యార్థిని సవాల్ విసిరింది. ఇక అలహాబాద్ వర్సిటీ వంతు! అలహాబాద్: తనను వర్సిటీ అధికారులు వేధిస్తున్నారని అలహాబాద్ వర్సిటీ విద్యార్థి నాయకురాలు రిచా సింగ్ ఆరోపించారు. వర్సిటీలో కొందరు అధికారుల నియామకాన్ని తాను వ్యతిరేకించడంతో లక్ష్యంగా చేసుకున్నారన్నారు. వర్సిటీలో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కార్యక్రమాన్ని వ్యతిరేకించినందుకు తనను బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్రపతికి లేఖ రాశారు.