అయ్యాంగార్ కి మోదీ ఘన నివాళి
న్యూఢిల్లీ: ప్రముఖ యోగ గురువు బీకేఎస్ అయ్యాంగార్ జయంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. యోగాను ప్రపంచావ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తుల్లో అయ్యాంగార్ ఒకరని మోదీ గుర్తు చేశారు. యోగ కోసం ఆయన సరికొత్త పద్దతులు తీసుకువచ్చారని తెలిపారు. అయ్యంగార్ సేవలు కొన్ని తరాల పాటు అలా నిలిచిపోతాయన్నారు. మోదీ ఈ మేరకు ఆదివారం ట్వీట్టర్లో పోస్ట్ చేశారు.
1918, డిసెంబర్ 14న కర్ణాటక బెలూరులో బీకేఎస్ అయ్యాంగార్ జన్మించారు. యోగా గురించి ఆయన పలు పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన సేవలు గుర్తించి భారత ప్రభుత్వం 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. అనారోగ్యంతో ఈ ఏడాది అగస్టు 20న పుణెలో మరణించారు.