1600 కిలోల బెల్లం స్వాధీనం
భద్రాద్రి: కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు గుడుంబా తాయరు చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1600 కిలోల నల్లబెల్లం, 50 కిలోల పట్టిక స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహించిన అధికారులు పెద్ద ఎత్తున బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అదుపులోకి తీసుకన్న ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.