Black Pepper Powder
-
వింటర్లో వ్యాధులు : మిరియాలతో చాలా మేలు!
లేదు..రాలేదు అనుకుంటూ ఉండగానే చలి పులి పరుగెత్తుకొచ్చేసింది. మరోవైవు ఫంగెల్ ప్రభావం, వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశంఉంది. చలికాలంలో వచ్చే కొన్ని అనారోగ్యసమస్యల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని వంటింటి చిట్కాలను పాటించాల్సిందే. ఇంట్లోనే లభించే నల్ల మిరియాలతో చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు మొదలైన సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. నల్ల మిరియాల్లో ఎన్నో ఔషధగుణాలుంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్నాయి. ఉంటాయి. ఇవి అంటువ్యాలులు సోకకుండా కాపాడతాయి. అలాగే నొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తాయి. నల్ల మిరియాల్లోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా మెగ్నీషియం, రాగి, ఇనుము, కాల్షియం, భాస్వరం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలకు మంచి మూలం. ఇందులో విటమిన్లు ఎ, కె, ఇ బి విటమిన్ కూడా ఉన్నాయి. ఇందులోని పైపెరిన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగులను శుభ్రం చేస్తుంది.మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా నల్ల మిరియాలను సేవిస్తే మలబద్ధకం సమస్య తీరుతుంది.రక్త ప్రసరణను మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తాయి.అంతేకాదుబరువు తగ్గడంలో కూడా మిరియాలు బాగా పనిచేస్తాయి. ఇందులో లభించే ఫైటో న్యూట్రియెంట్స్ అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి.అలాగే చలికాలంలో కీళ్లు,ఎముకల నొప్పులు బాగా వేధిస్తాయి. ఈ బాధలనుంచి ఉపశమనం కలిగించే ఔషధ గుణాలు మిరియాల్లో ఉన్నాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు కూడా ఇవి మేలు చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. నల్ల మిరియాలు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి. క్యాన్సర్‌ను నివారణలోనూ ఉపయోగపడ తాయంటున్నారు నిపుణులుమనకున్న అనారోగ్య సమస్యను బట్టి తులసి ఆకులు, పసుపు మిరియాలతో చేసిన కషాయం, మిరియాల పాలు,మిరియాలు తేనె, మిరియాలు, తమలపాకు రసం కలుపుకొని తాగవచ్చు.గ్రీన్ టీకి చిటికెడు నల్ల మిరియాలు కలుపుకోవచ్చు.కూరలు, సలాడ్లలో మిరియాల పొడి జల్లు కోవచ్చు. మిరియాలు ,యూకలిప్టస్ నూనె వేసి మరిగించిన నీళ్లో ఆవిరి పట్టవచ్చు. నోట్: ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మిరియాలు అందరికి ఒకేలా పనిచేయవు. శరీర తత్వాన్ని బట్టి, నిపుణుల సలహామేరకు తీసుకోవాలి. మిరియాలను ఎక్కువగా తీసుకుంటే కొన్ని నష్టాలు కూడా ఉంటాయనేది గమనించాలి. -
Black Pepper: జలుబు, దగ్గు, కఫం ఇబ్బంది పెడ్తున్నాయా.. అయితే ఇది మీ కోసమే
మనం వంటింట్లో ఉపయోగించే వాటిల్లో మిరియాలు ఒకటి. మనలో చాలా మందికి తెలిసిన మిరియాలు నల్ల మిరియాలు. వీటిని జలుబు, దగ్గు, కఫంతోపాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలను తగ్గించడంలో వాడుతూ ఉంటాము. మిరియాల వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉంటాయి. ►మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేసి, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో మిరియాలు ఎంతో సహాయపడతాయి. మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. ►మన జీర్ణాశయంలో అనేక రకాల యాసిడ్లు, ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆహారం జీర్ణం అవ్వడంలో సహాయపడతాయి. అజీర్తి సమస్య ఉన్న వారు మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఈ యాసిడ్ లు, ఎంజైమ్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అయ్యి అజీర్తి సమస్య తగ్గుతుంది. ►మిరియాలను హెర్బల్ టీ, నీళ్లు, పాలు, కషాయాలలో వేసి మరిగించుకొని తాగవచ్చు. మిరియాల పొడిని సలాడ్స్, మొలకెత్తిన విత్తనాలపై కూడా వేసుకొని తినవచ్చు. ఈ విధంగా మిరియాలను వాడడం వల్ల గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యల నుండి బయట పడవచ్చు. ►చిటికెడు రాతి ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసుకుని, గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్లవాపు తగ్గి రక్తం రావడం వంటివి తగ్గుతాయి. ►కొంచెం ఘాటుగా ఉన్నా రోజూ రెండు మిరియాలు నోట్లో వేసుకుంటే శరీరంలోని మెటబాలిజంను క్రమబద్ధం చేస్తుంది. ►టీలో చిటికెడు మిరియాల పోడి వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ►మిరియాలు తరచుగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సరే కాదు చర్మ, పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతుందని స్టడీస్ తేల్చాయి. ► అరగ్రాము మిరియాల పొడి, గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే.. తలనొప్పి నుంచి ఈజీగా బయటపడవచ్చు. -
బ్లాక్ పెప్పర్ వాటర్ ప్రతి ఉదయం తాగారంటే.. నెలరోజుల్లోనే..
మాటిమాటికీ ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటే మీ ఇమ్యునిటీ సిస్టం బలహీణంగా ఉన్నట్టే! దీనికి పరిష్కారం మీ వంటగదిలోనే ఉంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి రోజూ తాగితే చాలు! ఈ పెప్పర్ వాటర్‌ని కనీసం ఒక నెలపాటు తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. పూజా కోహ్లీ చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా. రోగనిరోధకతను పెంచుతుంది సులభ మార్గంలో రోగనిరోధకతను పెంచడంలో బ్లాక్ పెప్పర్ వాటర్ బెస్ట్. ఇది శరీర కణాలను పోషించి, వాటి నష్టాన్ని నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది కూడా. సహజ మార్గాల్లో హానికారక వ్యర్థాలను బయటికి పంపేందుకు.. గట్ (పేగుల) హెల్త్ పైనే మన పూర్తి శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మిరియాలు కలిపిన వేడి నీరు శరీరంలోని వ్యర్థాలను, రసాయనాలను పూర్తిగా బయటకు పంపివేస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, కడుపులోని పేగు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. బరువు తగ్గేందుకు.. దీనివల్ల వనకూరే మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. బరువును అదుపులో ఉంచుతుంది. మన పూర్వికుల కాలం నుంచి నేటివరకు కూడా ఉదయం పొరకడుపున చిటికెడు నల్లమిరియాల పొడి కలిపిన నీరు తాగే అలవాటు ఆచారంగా పాటిస్తున్నారు. దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు బోలెడున్నాయి కాబట్టే. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అధిక క్యాలరీలు ఖర్చు అయ్యేలా ప్రేరేపిస్తుంది. తరచుగా ఈ నీళ్లు తాగడం వల్ల కేవలం ఒక నెలరోజుల్లోనే మీ శరీర బరువులో వచ్చే మార్పును స్పష్టంగా తెలియజేస్తుంది. తేమగా ఉంచుతుంది వేడి నీరు, నల్ల మిరియాల పొడి మిశ్రమం గట్ హెల్త్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మ కణాల పోషణకు తోడ్పడటం ద్వారా ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండటానికి సహాయపడుతుంది. చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేయడమేకాకుండా, రోజు మొత్తం యాక్టివ్ గా ఉండేందుకు ఉపకరిస్తుంది. మలబద్ధకం నివారణకు దివ్యేషధమే దీర్ఘకాలికంగా మలబద్దకంతో బాధపడేవారు ఈ నీటిని ప్రతిరోజూ తప్పనిసరిగా తాగాలి. ఇది మీ ప్రేగు కదలికలను మెరుగుపరచి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు దారితీసేలా చేస్తుంది. క్రమంగా మీ సమస్య తగ్గుముఖం పట్టి, శరీరం నుండి వ్యర్థాలను తొలగించి, కడుపును తేలిక పరుస్తుంది. శక్తి నిస్తుంది మీరు పెప్పర్ వాటర్ ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీవక్రియ బలం పుంజుకుని మీ శక్తి రెంట్టింపయ్యేటట్లు చేస్తుంది. అంతేకాకుండా మీ శరీరాన్ని డిటాక్సిఫై చేసి, చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. చదవండి: అలొవెరా జ్యూస్‌తో డల్ స్కిన్‌కు చికిత్స..!! -
మజారే మజారే... మసాలా ఆమ్లెటే!
పెళ్లాం ఊరెళితే మసాలా ఆమ్లెట్ మన ఆల్ టైమ్ ఫెవరెట్. తక్కువ టైంలో ఎక్కువ రుచితో తేలికగా చేసుకోగల డిష్ ఇది. కావలసినవి: 4 గుడ్లు, 4 ఉల్లిపాయలు. 2 పచ్చి మిర్చీలు, 2 చెంచాల పాలు. 4 చెంచాల క్యాప్సికం (తరిగినది) 4 స్పూన్ల టమోటో (తరిగినది) ఉప్పు తగినంత, కొత్తిమీర కొంత, 2 చెంచాల నూనె, పసుపు తగినంత బ్లాక్ పెప్పర్ పౌడర్...తగినంత. ఇలా చేయాలి: పైన చెప్పిన దినుసులలో గుడ్లు పగులగొట్టి వేసి బాగా కలపండి. పెనం మీద నూనె వేయండి. నూనె వేడి కాగానే ఎగ్ మిక్చర్‌ను పెనం మీద వేయండి. తక్కువ మంట మీద, బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటూ ఇటూ తిరగవేయండి. వేడి వేడిగా ఆరగించండి.