మనం వంటింట్లో ఉపయోగించే వాటిల్లో మిరియాలు ఒకటి. మనలో చాలా మందికి తెలిసిన మిరియాలు నల్ల మిరియాలు. వీటిని జలుబు, దగ్గు, కఫంతోపాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలను తగ్గించడంలో వాడుతూ ఉంటాము. మిరియాల వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉంటాయి.
►మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేసి, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో మిరియాలు ఎంతో సహాయపడతాయి. మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు.
►మన జీర్ణాశయంలో అనేక రకాల యాసిడ్‌లు, ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆహారం జీర్ణం అవ్వడంలో సహాయపడతాయి. అజీర్తి సమస్య ఉన్న వారు మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఈ యాసిడ్ లు, ఎంజైమ్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అయ్యి అజీర్తి సమస్య తగ్గుతుంది.
►మిరియాలను హెర్బల్ టీ, నీళ్లు, పాలు, కషాయాలలో వేసి మరిగించుకొని తాగవచ్చు. మిరియాల పొడిని సలాడ్స్, మొలకెత్తిన విత్తనాలపై కూడా వేసుకొని తినవచ్చు. ఈ విధంగా మిరియాలను వాడడం వల్ల గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యల నుండి బయట పడవచ్చు.
►చిటికెడు రాతి ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసుకుని, గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్లవాపు తగ్గి రక్తం రావడం వంటివి తగ్గుతాయి.
►కొంచెం ఘాటుగా ఉన్నా రోజూ రెండు మిరియాలు నోట్లో వేసుకుంటే శరీరంలోని మెటబాలిజంను క్రమబద్ధం చేస్తుంది.
►టీలో చిటికెడు మిరియాల పోడి వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
►మిరియాలు తరచుగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సరే కాదు చర్మ, పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతుందని స్టడీస్ తేల్చాయి.
► అరగ్రాము మిరియాల పొడి, గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే.. తలనొప్పి నుంచి ఈజీగా బయటపడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment