‘బ్లాక్ ప్లాంటేషన్’కు ప్రాధాన్యం
జిల్లా విద్యాశాఖ పరిధిలోని కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడె న్షియల్స్లో ఖాళీ స్థలం అందుబాటులో ఉంటుందని.. వీటిలో బ్లాక్ ప్లాంటేషన్ ఏర్పాటు కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నగరం పరిధిలో సుమారు 400 కు పైగా కాలనీ కమిటీలు ఉన్నాయని.. కమిటీల సహకారంతో మొక్కలు నాటాలని తెలిపారు. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు హరితహారం వారోత్సవాలు ఉంటాయని, విద్యార్థులతో ర్యాలీలు, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు అధికారికంగా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ, అసైన్డ్ భూములు సుమారు 23 వేల హెక్టార్లు ఉంటే అటవీశాఖ అధికారులు కేవలం 100 ఎకరాల్లో హరితహారం కింద మొక్కలు నాటడంపై అసహనం వ్యక్తం చేశారు. పూర్తిస్థారుులో నర్సరీల్లో మెక్కలు అందుబాటులో లేవనే సమాచారం తనదగ్గర ఉందని, పరిస్థితులు చక్కదిద్దాలని ఆదేశించారు. గ్రామాల్లో దేవాలయాలు, ఎండోమెంట్ ఆలయాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజా ఉద్యమంలా చేపట్టాలి.. : అటవీ శాఖ మంత్రి
హరితహారం కార్యక్రమం ప్రజా ఉద్యమంలా చేపట్టాలని అటవీశాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం లేక పోవడంపై అటవీశాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు హరితహారం కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా అంకితభావంతో చేపట్టాలన్నారు. రాష్ట్రంలో 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా 24 శాతం మాత్రమే ఉన్నాయని అన్నారు. పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. నగరంలోని పార్కులు, శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలని, వాటిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటించాలని అన్నారు. మొక్కల చుట్టూ కంచె ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీ చైర్మన్ గద్దల పద్మ మాట్లాడుతూ.. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కవాలని అన్నారు. ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ.. మొక్కలు నాటినంత మాత్రాన సరిపోదని వాటి సంరక్షణ బాధ్యతలు చూసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ కరుణ మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధి హామీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చే శామని తెలిపారు. 4.50 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం అక్టోబర్ ఆఖరు వరకు కొనసాగుతుందన్నారు. జిల్లాలో ఉద్యోగ సంఘాలు ఒక రోజు వేతనాన్ని, సర్పంచ్ల ఫోరం ఒక నెల వేతనాన్ని హరితహారం కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ.. పార్కులను సుందరీకరణ చేయాలని, సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని, శ్మశాన వాటికల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పరకాల నిరయోజకవర్గంలోని కేనాల్వెంట, సంగెం మండలంలోని 18 ఎకరాల ఎస్ఆర్ఎస్పీ భూముల్లో ఎక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.
ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. మహబూబాబాద్‌లో వందల ఎకరాలు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోందని దానిని గుర్తించి హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటాలని అన్నారు. సీపీ సురేంద్రబాబు మాట్లాడుతూ ధర్మసాగర్‌లోని సుమారు 80ఎకరాల స్థలంలో 40 ఎకరాలు హరితహారం కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఐనవోలు దేవాలయానికి సంబంధించి ఎనిమిదెకరాల్లో హరితహారం చేపట్టనున్నట్లు తెలిపారు. ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా మాట్లాడుతూ జిల్లాలో 42 పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 వేల మొక్కలు నాటుతామని, ప్రతి పోలీస్‌స్టేషన్ మండలంలోని ఒక గ్రామం దత్తత తీసుకుని హరితహారం చేపటడుతుందని పోషణ బాధ్యత కూడా తమదేనని అన్నారు. 200 మంది జిల్లా గార్డులు శ్రమదానం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటుతామని తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరితహారం పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు.