Black spot
-
చండ ప్రచండ మార్తాండ!
భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ తొలిసారి ఈ నెల 18న కనిపించింది. భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది. వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తర్వాత ఫిబ్రవరి 24–26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఆ మచ్చ అమాంతంగా 25 శాతం పెరిగింది. తొమ్మిది భూగోళాలకంటే పెద్ద మచ్చ అది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఏర్పడిన అతిపెద్ద మచ్చ ఇదే. దీనికి ఏఆర్3590 అని పేరుపెట్టారు. ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్. క్రియాశీల ప్రాంతం అని అర్ధం. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. అయితే భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా ఈ సౌరమచ్చపై ఖగోళ శాస్త్రవేత్తలు ఓ కన్నేశారు. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతమైంది. సూర్యుడు అంతర్గతంగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సౌరమచ్చలు ఏర్పడతాయి. అక్కడి పరిసరాలతో పోలిస్తే ఈ మచ్చ ఉష్ణోగ్రత తక్కువ. మచ్చలో 3,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మచ్చల సంఖ్య 11 ఏళ్ల సౌరచక్రాన్ని అనుసరించి మారుతుంది. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం. గణించడం ఆరంభమయ్యాక ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచి్చపెడుతుందేమోనని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజు పెరగడం, తీవ్ర సౌర తుపాన్లు చూస్తుంటే సూర్యుడు తన 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను సమీపిస్తున్నాడని తెలుస్తోంది. తాము గతంలో ఊహించిన దాని కంటే చాలా ముందుగానే అంటే 2024 జూలైలోపే ‘చండ మార్తాండ’(సోలార్ మాగ్జిమమ్/సౌర గరిష్టం) దశ దాపురిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచి్చపెడుతుందోనని కలవరపడుతున్నారు. ఈ ఉగ్రరూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. సోలార్ మాగ్జిమమ్ దశ ముగిసిందనేది అది పూర్తయిన ఆరు నెలలకుగాని ఖగోళవేత్తలు గుర్తించలేరు. ఏఆర్3590తో ప్రమాదమే! సూర్యుడు లోలోపల ప్రజ్వలిస్తాడు. తన ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటిస్తాడు. అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హెచ్చు మొత్తంలో విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. వీటినే సౌరజ్వాలలు (సోలార్ ఫ్లేర్స్) అంటాం. ఇవి సూర్యుడి ఉపరితలంపై అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. తీవ్రత ఆధారంగా ‘సోలార్ ఫ్లేర్స్’ను X, M, C, B, A అంటూ అవరోహణ క్రమంలో 5 రకాలుగా వర్గీకరించారు. వీటిలో X రకం ఫ్లేర్స్ మహా శక్తిమంతం, భూమికి హానికరం. సౌరమచ్చ ఏఆర్3590 ఈ నెల 21న రెండు గీ రకం సౌరజ్వాలలను వెదజల్లింది. 22న X 6.3 తీవ్రతతో సౌరజ్వాలను వదిలింది. ఈ మచ్చలోని అస్థిర బీటా–గామా–డెల్టా అయస్కాంత క్షేత్రంలో మరిన్ని X రకం సౌరజ్వాలలకు కావాల్సిన శక్తి ఉండవచ్చని, మరో X రకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని సమీకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ రూపంలో ముప్పు తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. సౌరచక్రంలో అయస్కాంత ధ్రువాల మారి్పడి సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ట స్థితిని సంతరించుకునే ‘సోలార్ మాగ్జిమమ్’ దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మారి్పడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితమవుతాడు. అనుక్షణం క్రియాశీలమవుతాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ తర్వాత సూర్యుడు నెమ్మదిస్తాడు. మెల్ల గా సౌర కనిష్ట/సోలార్ మినిమమ్ దశకు చేరతాడు. ఇదొక చక్రం. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ‘కరోనా’ అనేది సౌర ధూళికణాలతో (ప్లాస్మా) నిండిన సూర్యుడి అతి బాహ్య పొర. X, M రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎంఈ)కు కారణమవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి. ‘నార్తర్న్ లైట్స్’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి. 1989 మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటలపాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్ గ్రిడ్స్ కుప్పకూలతాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి. జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభిస్తాయి. టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ–పైపులైన్ వ్యవస్థలు పాడవుతాయి. ఆ సమయాల్లో సౌరతుపాను గండం గడిచేదాకా కృత్రిమ శాటిలైట్లను స్విచాఫ్ చేస్తారు. లేకపోతే అవి మాడిపోయి భూమిపై పడతాయి. లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) బయటకు రారు. X, M రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే ‘దిగువ అయనోస్ఫియర్’లో ఎల్రక్టాన్ల సాంద్రత తీవ్రమవుతుంది. దాంతో రేడియో తరంగాల శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్ ఫ్లేర్స్ నుంచి వచ్చే సౌరధారి్మకత అదే వేగంతో భూమిని తాకుతుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఫలితంగా వందల కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లబడుతుంది. సీఎంఈ వేగం సెకనుకు 250 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ 15–18 గంటల్లో భూమిని చేరుతుంది. అతి పెద్ద సౌర తుపాను! 1860లో సోలార్ మాగ్జిమమ్ దశకు కొన్ని నెలల ముందు 1859 సెపె్టంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను ఇదే. 1859 ఆగస్టులో సూర్యబింబంలో నల్లమచ్చల సంఖ్య పెరగడం ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. లండన్‌లోని ఔత్సాహిక వీక్షకుడు రిచర్డ్ కారింగ్టన్ వీరిలో ఒకరు. 1859 సెపె్టంబర్ ఒకటిన సౌరమచ్చల్ని ఆయన చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా తెల్లటి కాంతి తళుక్కున మెరిసింది. అది 5 నిమిషాలు అలాగే ఉంది. నిజానికి అది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఈ ఘటనకు ఆయన గౌరవార్థం ‘కారింగ్టన్ ఈవెంట్’ అని పేరు పెట్టారు. ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్ 17.6 గంటల్లో భూమిని చేరుకుంది. కారింగ్టన్ ఈవెంట్ తర్వాత మర్నాడు జియోమాగ్నెటిక్ తుపాను ధాటికి టెలిగ్రాఫ్ వ్యవస్థలు మొరాయించాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ లైన్లపై టెక్నీíÙయన్లు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. కొన్నిచోట్ల టెలిగ్రాఫ్ సాధన సంపత్తి దగ్ధమైంది. నాటి ‘కారింగ్టన్ ఈవెంట్’కు కారణమైన నలమచ్చతో పోలిస్తే నేటి సౌరమచ్చ పరిమాణం 60 శాతంగా ఉంది. సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి వాడే సురక్షిత కళ్ళద్దాలు ఉంటే ఈ మచ్చను నేరుగా చూడొచ్చు. – జమ్ముల శ్రీకాంత్ -
ఏపీలోని రహదారులపై 466 బ్లాక్ స్పాట్స్: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం 2016-2018 మధ్య రాష్ట్రంలోని జాతీయ రహదారులపై 466 ప్రమాదకరమైన స్థలాలు (బ్లాక్ స్పాట్స్) గర్తించినట్లు రాజ్యసభలో బుధవారం రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను నిర్ధారించేందుకు తమ మంత్రిత్వ శాఖ ఒక ప్రోటోకాల్‌ను రూపొందించిందని మంత్రి తెలిపారు. జాతీయ రహదారిపై 500 మీటర్ల భాగంలో మూడేళ్లలో ఐదు రోడ్డు ప్రమాదాలు జరిగినా లేదా ఈ ప్రమాదాలలో 10 మంది మరణించినా ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తారు. ఆ విధంగా గుర్తించిన బ్లాక్ స్పాట్లను సరిదిద్దేందుకు తాత్కాలిక చర్యలతోపాటు శాశ్వత చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. జాతీయ రహదారులపై తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించడానికి ముందుగానే వాటిని నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత ఉన్నతాధికారులందరికీ తమ మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్‌లో లేఖ రాసినట్లు తెలిపారు. జాతీయ రహదారులు అభివృద్ధి చేయడానికి ముందుగానే రోడ్డు సేఫ్టీపై ఆడిట్ నిర్వహించి ఆయా నివేదికలను జాతీయ రహదారుల నిర్మాణంలో పాలుపంచుకునే సంస్థలతో పంచుకోవడం జరుగుతుందని అన్నారు. కొత్తగా చేపట్టబోయే రోడ్డు ప్రాజెక్ట్‌లు ఏవైనా ముందుగా రోడ్డు సేఫ్టీ ఆడిట్ పూర్తయిన తర్వాతే నిర్మాణం ప్రారంభించాలని కూడా మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో దాదాపు 80 శాతం వరకు శాశ్వత ప్రాతిపదికన సరిదిద్దినట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధి పథకం కింద కాఫీ ప్లాంటేషన్ అనుమతించం న్యూఢిల్లీ: మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కాఫీ ప్లాంటేషన్ కార్యకలాపాలను అనుమతించబోమని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాజ్యసభలో స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని పాడేరు ప్రాంతంలో నిరుపేద గిరిజన రైతుల ప్రయోజనం కోసం ఉపాధి హామీ పథకం కింద కాఫీ ప్లాంటేషన్ అభివృద్ధికి ప్రభుత్వం అనుమతిస్తుందా అని వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి ఈ విషయం చెప్పారు. ఉపాధి హామీ పథకం అనేది డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే కార్యక్రమం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల పేదలకు జీవనోపాధి భద్రత కల్పించాలన్నది ఉద్దేశం. ఈ పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ పేదలకు వంద రోజులపాటు వేతనంతో కూడిన ఉపాధికి హామీ ఇవ్వడం జరుగుతుందని మంత్రి చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద తమ సొంత భూమిలో వ్యక్తిగత ఆస్తులు సృష్టించుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. అందులో భాగంగా భూమి అభివృద్ధి పనులు, సాగు చెరువుల తవ్వకం, వ్యవసాయ బావుల తవ్వకం, ఉద్యానవన పంటలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు, కోళ్లు, మేకల షెడ్లు వంటి పనులను చేపట్టవచ్చని మంత్రి తెలిపారు. -
వేగం వద్దు.. ప్రాణం ముద్దు
సాక్షి, సిటీబ్యూరో: రోడ్లపై దూసుకెళ్లే వాహనదారులు అతివిశ్వాసానికి పోయి వాహనాల వేగం పెంచొద్దంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఎప్పుడూ వెళ్లే రోడ్డే కదా.. నాకేం అవుతుందిలే అన్న నిర్లక్ష్యం వద్దని.. ముఖ్యంగా వర్షాకాలంలో వాహన వేగానికి కళ్లెం వేయకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జరిగిన 79 రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ఆర్సీపురం నుంచి చందానగర్ మార్గంలో 21 ప్రమాదాలు జరిగాయని, ఈ రూట్లో వెళ్లే వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. జాతీయ రహదారి 65 మార్గంలోని శేరిలింగంపల్లి ఎంఐజీ కాలనీ పోచమ్మ గుడి నుంచి లింగంపల్లిలోని గాంధీ విగ్రహం వరకు ఈ ఏడాది 21 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మియాపూర్‌లోని సౌతిండియా షాపింగ్ మాల్ నుంచి సినీటౌన్ సమీపంలోని దుర్గమ్మ గుడి మార్గంలో 15 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కూకట్పల్లి వైజంక్షన్ నుంచి మూసాపేట మార్గంలో 14 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇక జాతీయ రహదారి 765 మార్గంలోని రాజేంద్రనగర్‌కు సమీపంలోని ఆరాంఘర్ ఎక్స్ రోడ్డు పిల్లర్ నంబర్ 314 నుంచి కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు 13 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇక మాదాపూర్‌లోని అంతర్గత రహదారిలో మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి బెంజ్ షోరూం యూటర్న్ వరకు 16 రోడ్డు ప్రమాదాలు జరిగి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండో స్థానంలో నిలిచింది. ప్రమాదాలకు కారణాలివే.. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగడంపై ఇటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అటు జీహెచ్ఎంసీ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు అధ్యయనం చేశారు. రోడ్లు ఇరుకుగా ఉండటం, యూటర్న్లు ఉండటం, రహదారి ఇంజినీరింగ్ పనుల్లో లోపాలతో పాటు వాహనదారుల అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కూడా చాలా మంది ప్రాణాలు తీస్తోందని గుర్తించారు. ఓవైపు వాహనదారులకు డ్రైవింగ్‌పై అవగాహన కలిగిస్తూనే.. మరోవైపు వర్షాకాలం సమీపించడంతో ఆ 79 బ్లాక్‌స్పాట్ ప్రాంతాల్లో ఇతర ప్రభుత్వ విభాగాల సహకారంతో మరమ్మతులు చేపడుతున్నారు. ఏది ఏమైనా ఆ ప్రాంతాల మీదుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు వాహనాలను జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఐదేళ్లుగా 700 బ్లాక్స్పాట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ కమిషనరేట్ పరిధిలో బ్లాక్స్పాట్లపై అధ్యయనం చేశారు. 2015లో 110, 2016లో 130, 2017లో 187, 2018లో 194, 2019లో 79 బ్లాక్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించారు. ఈ సంవత్సరాల్లో ఎక్కువగా రాజేంద్రనగర్‌లోని అరాంఘర్ ఎక్స్ రోడ్డు నుంచి డైమండ్ కంట, బాబుల్‌రెడ్డి నగర్, హైదరగూడ నుంచి అత్తాపూర్, ఉప్పర్‌పల్లి పిల్లర్ నంబర్ 190 నుంచి 226, అరాంఘర్ జంక్షన్ ఫ్లైఓవర్ నుంచి సూర్య ధాబా, అరాంఘర్ ఎక్స్ రోడ్డు పిల్లర్ నంబర్ 314 నుంచి కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరగడంతో వాటిని బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించారు. తర్వాత స్థానాల్లో ఆర్సీపురం, కేపీహెచ్‌బీ, మియాపూర్, బాలానగర్, మాదాపూర్ ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో 700 బ్లాక్‌స్పాట్‌ను ప్రకటించి అన్ని ప్రభుత్వ విభాగాల సహకారంతో మరమ్మతు పనులు చేపట్టారు. డ్రైవింగ్‌లో అప్రమత్తత తప్పనిసరి వర్షాకాలం కావడంతో రహదారులపై వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. ఎదురుగా వచ్చే ప్రాంతాలను బట్టి ముఖ్యంగా బ్లాక్‌స్పాట్ ప్రాంతాల్లో నిదానంగా ముందుకెళ్లాలి. అతివేగంతో వెళితే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవచ్చు. ఆయా ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి బాగా లేకపోవడంతో జాగ్రత్తగా వెళ్లాలి. కుటుంబ సభ్యులకు మాత్రం శోకం మిగల్చవద్దు. – వీసీ సజ్జనార్,సైబరాబాద్ పోలీస్ కమిషనర్ -
మిల్లర్లకు బ్లాక్ స్పాట్
-ఎఫ్‌సీఐకి తరలిస్తున్న బియ్యంపై నల్లచుక్కలు -40 వేల టన్నులు తిరస్కరణ -ఘొల్లుమంటున్న రైస్ మిల్లర్లు తాడేపల్లిగూడెం : రైస్ మిల్లర్లకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ‘బ్లాక్ స్పాట్’ పేరిట కొర్రీ వేస్తోంది. బియ్యం గింజల మధ్యలో నల్లటి మచ్చ ల్లాంటివి ఉన్నాయంటూ గడచిన 20 రోజుల్లో సుమారు 40 వేల టన్నుల బియ్యాన్ని వెనక్కి పంపించింది. ఈ పరిస్థితితో మిల్లర్లు ఘొల్లుమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇచ్చి కస్టమ్ మిల్లింగ్ పేరిట బియ్యం ఆడించింది. ధాన్యాన్ని మరాడించినందుకు క్వింటాల్‌కు రూ.15 చొప్పున మిల్లర్లకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ధాన్యాన్ని ఆడగా వచ్చే ఊక, చిట్టు, తవుడు తదితరాలను మిల్లర్లకే ఇస్తోంది. క్వింటాల్ ధాన్యానికి బదులుగా 67 కిలోల చొప్పున బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఆ బియ్యాన్ని నేరుగా ఎఫ్‌సీఐకి అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆ బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లంతా ఎఫ్‌సీఐ డిపోలకు తరలించడం మొదలుపెట్టారు. టిప్ డ్యామేజీ ఉందంటూ.. మిల్లర్లు తీసుకొచ్చిన బియ్యాన్ని దిగుమతి చేసుకునే ముందు వాటి నాణ్యతను ఎఫ్‌సీఐ క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేస్తుంటారు. అయితే, ఇటీవల మిల్లర్లు తీసుకొస్తున్న బియ్యంపై నల్లటి మచ్చలు (టిప్ డ్యామేజీ) ఉందని క్వాలిటీ కంట్రోల్ గుర్తించింది. అలాంటి బియ్యాన్ని దిగుమతి చేసుకునేది లేదంటూ ఎఫ్‌సీఐ అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. గడచిన 20 రోజుల్లో సుమారు 60 వేల టన్నుల బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లు ఎఫ్‌సీఐ డిపోలకు తరలించగా, టిప్ డ్యామేజీ పేరిట అందులో సుమారు 40 వేల టన్నుల బియ్యాన్ని అధికారులు తిరస్కరించారు. దీంతో ఏం చేయాలో తెలియక రైస్‌మిల్లర్లు బేలచూపులు చూస్తున్నారు. 1.85 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలి ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా జిల్లావ్యాప్తంగా 10,65,436 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఈ ధాన్యాన్ని మరాడించి 6,63,842 టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో 50 వేల టన్నులను రేషన్ బియ్యం నిమిత్తం ఇప్పటికే పౌర సరఫరాల శాఖకు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎఫ్‌సీఐకి బియ్యం తరలింపు ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ వరకు 4,79,137 టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ డిపోలకు చేరవేశారు. ఇంకా 1,84,709 టన్నుల బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. గత నెల వరకూ రోజుకు 3 వేల నుంచి 4 వేల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి చేరవేసేవారు. గడచిన 20 రోజులుగా రోజుకు కనీసం వెయ్యి టన్నులు కూడా ఎఫ్‌సీఐ స్వీకరించడం లేదు. టిప్ డ్యామేజీ పేరిట బియ్యాన్ని తిప్పిపంపుతున్నారని మిల్లర్లు చెబుతున్నారు. నాణ్యత గుర్తించేదిలా ఎఫ్‌సీఐకి తరలించే బియ్యంలో ఒక బస్తా నుంచి 10 గ్రాముల్ని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బయటకు తీస్తారు. రంగు, పాలిష్, నూకల శాతం ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తారు. 10 గ్రాముల్లో 0.03 గ్రాములకు మించి దెబ్బతిన్న (డ్యామేజీ) బియ్యం ఉండకూడదు. అందులో నూకల శాతం 25 వరకు ఉండవచ్చు. అంతకుమించితే చెల్లించే సొమ్ములో కోత విధించడం లేదా వెనక్కి పంపించడం చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి కారణాలేమీ లేకపోయినా బియ్యంపై నల్లమచ్చలు ఉన్నాయంటూ బియ్యాన్ని వెనక్కి పంపిస్తున్నారు. 20 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదని మిల్లర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన 1.85 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకుంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీ బియ్యాన్ని వెనక్కి తీసుకు రావాలంటే రూ.10 వేల వరకు ఖర్చవుతోందని మిల్లర్లు పేర్కొంటున్నారు. ఈ నష్టాన్ని ఎలా భరించాలని ప్రశ్నిస్తున్నారు. -
డర్మటాలజీ కౌన్సెలింగ్
నాడా కట్టుకున్నచోట నల్లమచ్చ...! నా వయసు 15 ఏళ్లు. నేను లెహంగా కానీ, సెల్వార్ గానీ కట్టుకున్నప్పుడు నా నడుము వద్ద నల్లగా మచ్చలాగా పడుతోంది. ఇలా నల్లమచ్చ పడకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి. - సుశాంతి, కర్నూల్ మీరు చెబుతున్న సమస్య అమ్మాయిల్లో చాలా సాధారణంగా కనిపించేదే. నడుము దగ్గర కాస్త బిగుతుగా కట్టుకున్నప్పుడు ఇలా ఏర్పడటం సహజం. నడుము దగ్గరి నాడా బిగుతుగా ఉండటంతో అక్కడ ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడ్డచోట రక్తప్రవాహం తగ్గుతుంది. దాంతో అక్కడ డార్క్ రంగును ఇచ్చే పిగ్మెంట్ కణాలు బాగా పెరుగుతాయి. దాంతో ఆ భాగం నల్లగా కనిపిస్తుంది. దీన్ని నివారించాలంటే... నాడాను మరీ బిగుతుగా కట్టుకోకుండా, కాస్త వదులుగా కట్టుకోండి. నాడా కట్టే ప్రాంతంలో కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్ ఉన్న స్కిన్ లెటైనింగ్ క్రీమ్ రాసుకోండి బిగుతుగా కట్టుకునే నాడాలకు బదులు, శరీరాన్ని అంటిపెట్టుకునేలా సాఫ్ట్ ఎలాస్టిక్‌తో ఉండే దుస్తులు వాడండి అప్పటికీ పిగ్మెంటేషన్ తగ్గకపోతే మీకు సమీపంలోని డర్మటాలజిస్ట్‌ను కలిసి గ్లైకోలిక్, ఫీనాల్ పీలింగ్ చికిత్సను ఒక కోర్స్లాగా తీసుకోవాల్సి ఉంటుంది. నా వయసు 16 ఏళ్లు. నేను సల్వార్, కమీజ్ లాంటి దుస్తులు ఎక్కువగా ధరిస్తుంటాను. అయితే స్లీవ్‌లెస్ లాంటివి వేసుకునే సమయంలో ఒక సమస్య ఎదురవుతుంది. నా దుస్తులు కప్పి ఉండే ప్రాంతం తెల్లగానూ, మిగతా ప్రాంతం కాస్త వన్నె తక్కువగానూ కనిపిస్తుంది. నా మోచేతి కింది భాగాలు కూడా... దుస్తులు కప్పి ఉండే భాగాల్లాగే నిగనిగలాడుతూ, మెరుస్తూ కనిపించాలంటే ఏం చేయాలో చెప్పండి. - రమ్య, హైదరాబాద్ శరీరంలో దుస్తులు కప్పి ఉండే భాగాలపై సూర్యకిరణాలు పడవు. కాబట్టి అక్కడి భాగం తేమను కోల్పోదు. ఫలితంగా సూర్యకాంతి వల్ల జరిగే నష్టం జరగదు. దాంతో దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు తమ తేమను కోల్పోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల 50 ఎస్పీఎఫ్ ఉండే బ్రాడ్‌స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి. ప్రతి మూడు గంటలకోసారి ఇలా సన్‌స్క్రీన్ రాసుకోవడం చేస్తూ ఉండాలి సాధారణంగా మీరు ఫుల్స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా మేనిభాగాలకు కూడా అదే నిగారింపు, మెరుపు వస్తుంది గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళల్లో మీ చర్మంపై పూసుకోండి పై సూచనలు పాటించినా ఇంకా మేనిపై ఆ తేడాలు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను కలిసి కెమికల్ పీలింగ్ చేయించుకోండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
రోడ్డు ప్రమాదాలకు చెక్..
- బ్లాక్ స్పాట్ల గుర్తింపునకు ఆదేశాలు - ఇప్పటికే సగం స్థలాలకు మరమ్మతులు - ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినచర్యలు సాక్షి, ముంబై: తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న స్థలాలను ‘బ్లాక్ స్పాట్’గా గుర్తించి, వాటిని సరిచేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల ట్రాఫిక్, రవాణా విభాగాల ఉన్నతాధికారులు బ్లాక్ స్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలతో ఢిల్లీకి రావాల్సిందిగా ఇటీవల హైవే రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఆదేశించారు. మాజీ మంత్రి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు సంబంధించి ఎక్కువ శ్రద్ధ వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఏడాదిలో మూడు అంతకంటే ఎక్కువ ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాలు వరుసగా జరిగితే ఆ ఘటన స్థలాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తారు. రాష్ట్రంలో ప్రతి ఏడాదీ 13 వేల మంది రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. అయితే తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న స్థలాలను ఇప్పటివరకూ ప్రభుత్వం సరిచేయకపోవడం గమనార్హం. ప్రమాదాలు జరుగుతున్న 150 స్థలాలను ‘బ్లాక్ స్పాట్స్’గా గుర్తించారు. ఇందులో 131 స్థలాలను నేషనల్ హైవేపైనా, 19 స్థలాలను స్టేట్ హైవేపైనా గుర్తించారు. వీటిలో జాతీయరహదారిపైన గుర్తించిన 63 స్థలాలను, రాష్ట్ర హైవేపైనా గుర్తించినా అన్ని స్థలాలను బాగుచేయించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. హైవే పోలీసు అధికారులు అందజేసిన వివరాల మేరకు.. ముంబై-అహ్మదాబాద్ హైవేపైన ఉన్న ఠాణే జిల్లాలోని కుడే నుంచి సతివాలి సెక్షన్ వరకు ఉన్న మార్గం రాష్ట్రంలోనే చాలా అపాయకరమైందిగా గుర్తించారు. ఈ స్థలంలో 2011-13 మధ్య కాలంలో దాదాపు 14 ప్రాణాంతకమైన ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇక్కడ రోడ్డు ప్రమాదాల సంఖ్యను కొంత మేర తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారి తెలిపారు. బ్లాక్ స్పాట్లను హైవే పోలీస్ విభాగం గుర్తిస్తుండగా, ప్రజా పనుల విభాగం, నేషనల్ హైవే అథారటీ (ఎన్హెచ్ఏఐ) ఈ ఘటనా స్థలాలను సరి చేయనున్నాయని హైవే డిప్యూటీ సూపరింటెండెంట్ బలిరామ్ కదమ్ తెలిపారు. రాష్ట్ర పోలీసులు అందజేసిన గణాంకాల ప్రకారం.. 2011లో 68,438 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన 58,41,782 మందిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా రూ.70.44 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేశారు. 2012లో 66,316 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 53,60,536 మందిపై ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించినందుకు గాను కేసు నమోదు చేసి రూ.68.31 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేశారు. 2013లో 63,019 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 51,97,460 మందిపై ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించిన కేసులు నమోదు చేసి, వారినుంచి రూ.63.62 కోట్లను వసూలు చేశారు. కాగా, 2014లో ఏప్రిల్ వరకు 21,049 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 18,85,498 మందిపై ట్రాఫిక్ నియమ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.23.20 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేశారు.