బ్లాక్ బెర్రీ ఆఖరి స్మార్ట్ ఫోన్..ధరెంతో తెలుసా?
స్మార్ట్ ఫోన్ కంపెనీల మెగా ఈవెంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రారంభానికి ముందు బ్లాక్ బెర్రీ తన లాస్ట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. బ్లాక్ బెర్రీ కీవన్ పేరుతో ఈ కెనడియన్ కంపెనీ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన ఇన్-హౌజ్‌లో రూపొందించిన చివరి స్మార్ట్ ఫోన్ బ్లాక్ బెర్రీకి ఇదే కాబోతుంది. ఇప్పటినుంచి స్మార్ట్ ఫోన్ డిజైన్‌ను, ఉత్పత్తిని ఈ కంపెనీ పూర్తిగా నిలిపివేయబోతుంది. గత సెప్టెంబర్‌లోనే ఈ నిర్ణయాన్ని బ్లాక్ బెర్రీ ప్రకటించింది. చివరిగా మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త బ్లాక్ బెర్రీ కీవన్, పిజికల్ కీబోర్డును కలిగి ఉంది. 2017 ఏప్రిల్ నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. ధర 549 డాలర్లు(సుమారు రూ.38,600)గా కంపెనీ నిర్ణయించింది. అయితే యూకేలో ఈ ఫోన్ 499 జీబీపీ(సుమారు రూ.41,400), యూరప్‌లో 599 యూరోలకు(సుమారు రూ.41,400) అందుబాటులో ఉండనుంది.
బ్లాక్ బెర్రీ కీవన్ స్పెషిఫికేషన్లు...
4.5 అంగుళాల ఫుల్-హెచ్డీ ఐపీఎస్ డిస్ ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా-కోర్ ఎస్ఓసీ
3జీబీ ర్యామ్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
2టీబీ వరకు విస్తరణ మెరీ
3505 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 7.1 నోగట్ విత్ బ్లాక్ బెర్రీ బిజినెస్, సెక్యురిటీ ఫీచర్లు