BMTC bus
-
మితిమీరిన వేగం, ఎగిసిపడిన మంటలు: తృటిలో తప్పిన ఘోరం
బెంగుళూరులో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది.నాగరభావి-నాయండహళ్లి మధ్య రింగ్‌రోడ్డుపై కారు వెనుక నుంచి బీఎంటీసీ(బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్) బస్సును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు లోనయ్యారు. అయితే అదృష్టవశాత్తూ వారంతా సురక్షితంగా బయట పడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బైత్రయాణపుర ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగరభావి ప్రధాన రహదారిలోని చంద్రా లేఅవుట్ బస్టాండ్ వద్ద బస్‌స్టాప్‌లో ప్రయాణికులు వేచి ఉండగా, వేగంగా వచ్చిన కారు బస్సు వెనుక వైపు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. బస్సు పాక్షికంగా దగ్ధమైంది. అయితే ప్రయాణికులందరూ వెంటనే బస్సు నుండి క్రిందికి దిగి పోయారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి స్వల్ప గాయం కాగా, మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. -
సిటీ బస్‌లో బాలికపై వేధింపులు?
కర్ణాటక: బీఎంటీసీ బస్సులో విద్యార్థినులపై పట్టపగలే కండక్టర్, ఇద్దరు పురుషులు వేధించారు. ఈ కీచకకాండపై తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. వివరాలు.. ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలిక దొమ్మలూరు నుంచి రిచ్మండ్ సర్కిల్‌కు ప్రయాణం చేస్తుండేది. గుంజూరు డిపో, 41, కేఎ 57–ఎఫ్2695 బస్సులో బాలిక ఉచిత ప్రయాణం కోసం ఆధార్ కార్డు చూపింది. కండక్టర్ చూసి అందులో వేరేభాష ఉంది, డబ్బులిచ్చి టికెట్ తీసుకోమన్నాడు. సరేనని బాలిక టికెట్ కొనుక్కుంది. కానీ కండక్టర్, ఇద్దరు పురుషులు బాలికను చూస్తూ మాపైన నీ తల్లిదండ్రులకు చెబుతావా? నీ తండ్రి ఏమైనా సీఎం, పీఎమ్మా? అని గద్దించారని, మెడపట్టుకుని బయటకు తోసేయడానికి యత్నించారని బాలిక తల్లి ఆరోపించింది. రిచ్మండ్ సర్కిల్లో దింపకుండా, కార్పొరేషన్ సర్కిల్ వద్ద విద్యార్థినిని దింపి వెళ్లారని, తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది. -
త్వరలో ఎలెక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర వాసులకు అతి త్వరలో డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే అనుభవం రానుంది. ఇవన్నీ ఎలెక్ట్రిక్ బస్సులే కానున్నాయి. ఓ ప్రముఖ సంస్థతో బస్సుల కొనుగోలుకు బీఎంటీసీ ఒప్పందం చేసుకుంది. తొలుత ఐదు డబుల్ డెక్కర్ బస్సులకు రూ. 10 కోట్లు బీఎంటీసీ చెల్లించనుంది. తొలి బస్సు మార్చిలో, మరో నాలుగు బస్సులు ఏప్రిల్‌లో వస్తాయి. ఇందులో ఏసీ సహా పలు ఆధునిక వసతులు ఉంటాయని బీఎంటీసీ వర్గాలు తెలిపాయి. మొదటి ఏసీ డబుల్ డెక్కర్ బస్సు హెబ్బాల నుంచి సిల్క్ బోర్డు మార్గంలో ప్రయాణించనుంది. వోల్వో వజ్ర బస్సులో చెల్లించే టికెట్ చార్జీలే ఈ బస్సులోనూ ఉండనున్నాయి. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ బస్సుకు ముందు భాగం, వెనుక భాగంలో తలుపులు ఉంటాయి. 65 మంది ప్రయాణించవచ్చు. -
యువతితో బస్సులో కండక్టర్ అసభ్య ప్రవర్తన
బెంగళూరు : టికెట్ ఖరీదు పోనూ మిగతా చిల్లర ఇవ్వాలని అడిగిన యువతి పట్ల బెంగళూరు మెట్రో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(బీఎంటీసీ) బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. లవ్ లెటర్ ఇస్తే చిల్లర ఇస్తానని చెబుతూ లైంగిక వేధింపులకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు వివరాలను ఫేస్బుక్లో ఉంచింది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ కేసులో ఇలాగే జరిగిందంటూ ఆ పోస్ట్‌లో ఉదహరించింది. అయితే ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో పాటు బాధితురాలితో ఫోన్లో మాట్లాడించేందుకు ప్రయత్నాలు జరగటంతో ఆమె తన ఫేస్ బుక్ పోస్ట్‌ను తొలగించింది. కాగా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సౌత్‌జోన్ డీసీపీ డాక్టర్ శరణప్ప నిన్న మీడియాకు వెల్లడించారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి జనవరి 10న రాత్రి 8.30 గంటల సమయంలో విధులు ముగించుకొని రాగిగుడ్డ బస్టాప్ నుంచి ఉత్తరహళ్లికి వెళ్లే బస్సు ఎక్కింది. బస్సు బనశంకరి బస్టాండుకు చేరుకోగానే చాలా మంది దిగేశారు. దీంతో తనకివ్వాల్సిన చిల్లర ఇస్తే దిగిపోతానని చెప్పింది. ఈ సందర్భంలో కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన యువతి బస్సు ఆపాలని కోరినప్పటికీ డ్రైవర్ కూడా పట్టించుకోలేదు. తనకు లవ్ లెటర్ ఇస్తే చిల్లర ఇస్తానని కండక్టర్ వేధించాడు. వెనుక సీట్లలో కూర్చున్న నలుగురు యువకులు ముందుకొచ్చి యువతికి అండగా నిలబడటంతో కండక్టర్ వెనక్కి తగ్గి మిగతా చిల్లర ఇచ్చాడు. అప్పుడు కూడా ఆ యువతి చేతులు తాకి అసభ్యంగా వ్యవహరించాడు. బస్సు దిగాక సదరు యువతి ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు కండక్టర్‌తో పాటు బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కాగా బస్సులో యువతిపై వేధింపులకు పాల్పడలేదని డ్రైవర్, కండక్టర్ తెలిపారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించేందుకు బీఎంటీసీ ఎండీ అందుబాటులో లేదు. -
బీఎంటీసీ బస్సులో మంటలు
బెంగళూరు(బనశంకరి) : మూడ్రోజలు క్రితం పాత మద్రాస్ రోడ్డులో బీఎంటీసీ బస్సు అగ్నికి ఆహుతైన ఘటన మరువక ముందే గురువారం మరో ఘటన చోటు చేసుకుంది. లగ్గెరీ ఫ్లై ఓవర్‌పై వెళుతున్న బీఎంటీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి, కాలిపోయింది. కెంగేరి నుంచి యశ్వంతపురకు వెళుతున్న బీఎంటీసీ బస్సు ఉదయం 11 గంటలకు లగ్గెరీ ఫ్లై ఓవర్‌పైకి చేరుకుంది. ఆ సమయంలో బస్సు ఇంజన్లో నిప్పు రాజుకుంది. మంటలు గుర్తించిన వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపి ప్రయాణికులను కిందకు దిగాలని సూచించాడు. ప్రయాణికులు కిందకు దిగుతుండగానే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటలు చుట్టుముట్టక ముందే ప్రయాణికులు కిందకు దిగారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఘటనపై రాజగోపాల నగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బస్సు ఢీకొని సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
బెంగళూరు: బీఎంటీసీ బస్సు ఢీకొని మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన ఇక్కడి వైట్‌ఫీల్డ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక సర్జాపుర మెయిన్ రోడ్డులోని అపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజినీరు నివేదిత (28) నివాసముంటుంది. ఆమె బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరింది. మార్గంలో వైట్‌ఫీల్డ్ సమీపంలోని ఐటీపీఎస్ మెయిన్ రోడ్డులోక వస్తుండగా వెనుక నుంచి బీఎంటీసీ బస్సు డ్రైవర్ స్కూటర్‌ను ఓవర్టేక్ చేయడానికి యత్నించారు. ఆ క్రమంలో బస్సు... స్కూటర్‌ను ఢీకొట్టింది. దాంతో నివేదిత కింద పడిపోయింది. ఆమె తలపై నుంచి బస్సు వెళ్లి పోయింది. దీంతో నివేదిత అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.