మూడేళ్లలో 20,000 మందికి ఉపాధి:బీఎన్ఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే మూడేళ్లలో తమ సభ్యుల ద్వారా 20,000 మందికి ఉపాధి కల్పించాలని బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) హైదరాబాద్ లక్ష్యంగా చేసుకుంది. హైదరాబాద్ విభాగం కింద ఉన్న 23 చాప్టర్లలోని 1,000కిపైగా ఉన్న సభ్యుల వద్ద 8,000 మందికిపైగా పని చేస్తున్నారు.
2020 నాటికి సభ్యుల సంఖ్యను రెట్టింపు చేస్తామని బీఎన్ఐ హైదరాబాద్ ఈడీ భరత్ షా తెలిపారు. బీఎన్ఐ సభ్యుడు కొడగంటి శ్రీనివాసులుతో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై 1న బీఎన్ఐ సభ్యులకు చెందిన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించేందుకు 100 స్టాళ్లతో హైటెక్స్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాపార అవకాశాలను ఒకరినొకరు పంచుకోవడమే బీఎన్ఐ సభ్యుల విధి అని తెలిపారు.