board chairman
-
నందన్ నీలేకని సెకండ్ ఇన్నింగ్స్
-
నందన్ నీలేకని సెకండ్ ఇన్నింగ్స్
ముంబై: అందరూ ఊహించినట్టుగానే, ఆశించినట్టుగానే నందన్ నీలేకని ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. దీంతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తన ప్రస్థానాన్ని కొనసాగించానున్నారు. మరోవైపు శేషసాయి, రవి వెంకటేషన్ బోర్డులోని తమపదవులకు రాజీనామా చేశారు. వీరితోపాటు విశాల్ సిక్కా బోర్డుకు రిజైన్ చేశారు. ఇన్ఫీ సీఎండీ గా విశాల్ సిక్కా అనూహ్య రాజీనామాతో బోర్డులో తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. -
వర్జీనియా రైతులకు న్యాయం చేస్తాం
జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పొగాకు బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.వెంకటేష్ అన్నారు. గురువారం స్థానికంగా రెండు పొగాకు వేలం కేంద్రాలను ఆయన పరిశీలించారు. వేలం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సరాసరి ధర కేజీకి రూ.155 ఇవ్వాలని రైతులు కోరారు. అలాగే విదేశీ ఆర్డర్లు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాక ఈ ఏడాది దిగుబడి కొద్దిగా పెరిగిందని, అందువల్ల ఒక్కో బ్యారన్‌కు అదనంగా 4 క్వింటాళ్లు అమ్ముకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. కొనుగోళ్ల సమయంలో ఆయా పొగాకు కంపెనీలు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సంక్షేమ పథకానికి సంబంధించి కొన్ని నిబంధనల వల్ల రైతు కుటుంబాలకు న్యాయం జరగడం లేదని, దీనిపై కూడా దృష్టి సారించాలని కోరారు. అలాగే బ్యారన్లకు బీమా చేయిస్తున్నామని, అయితే సకాలంలో నష్టపరిహారం అందడం లేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కాగా దీనిపై పరిశీలించి అన్ని చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. పొగాకు బోర్డు కార్యదర్శి సీఎస్ఎస్ పట్నాయక్, ఆక్షన్ మేనేజర్ కె.రవికుమార్, ప్రొడక్షన్ ఏఎస్ సీహెచ్‌వీ మారుతీప్రసాద్, రీజినల్ మేనేజర్ ఎం.శ్రీరామమూర్తి, అకౌంట్ అసిస్టెంట్ మేనేజర్ చింతమనేని ఏసుదాసు, వేలం అధికారులు కేవీ రాజప్రకాష్, ఆర్.రమేష్‌బాబు, బోర్డు మాజీ వైస్‌చైర్మన్ గద్దే శేషగిరిరావు, పొగాకు బోర్డు సభ్యుడు గడ్డమణుగు సత్యనారాయణ, రైతు సంఘాల అధ్యక్షులు పరిమి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 16.3 మిలియన్ కిలోల అమ్మకాలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16.3 మిలియన్ కిలోలు పొగాకు అమ్మకాలు పూర్తయ్యాయి. మొత్తం 130 మిలియన్ కిలోలు పంట పండించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సరాసరి ధర 148.21 లభించింది. కాగా ఎన్‌ఎల్‌ఎస్‌లో ఇప్పటివరకు 3.86 మిలియన్ కిలోలు అమ్మకాలు జరిగాయి. జిల్లాలోని 5 వేలం కేంద్రాల్లో ఈ అమ్మకాలు పెరగ్గా, సరాసరి ధర 145.27 రూపాయలు లభించింది. ఎన్ఎల్ఎస్ పరిధిలో 42 మిలియన్ కిలోలు పంట పండించేందుకు బోర్డు అనుమతించింది. -
పరిశ్రమలు కాలుష్య రహితంగా ఉండాలి
కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మ¯ŒS ఫణికుమార్ సాక్షి, రాజమహేంద్రవరం : నానో టెక్నాలజీతో పరిశ్రమలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని. లేకుంటే ప్రజాఉద్యమాలు తప్పవని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి జీఎ¯ŒS ఫణికుమార్ హెచ్చరించారు. స్థానిక ఓ హోటల్లో సోమవారం ‘ఎన్విరా¯ŒSమెంటల్ క్లినిక్ ఆ¯ŒS పేపర్ ఇండస్ట్రీ’అంశంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఉభయగోదావరి జిల్లాలలోని పేపర్ పరిశ్రమల యాజమాన్యాలతో సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పరిశ్రమల కాలుష్యంపై ప్రజా ఉద్యమాలు ప్రారంభమైతే వాటిని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య నివారణకు అనుసరించాలి్సన పద్ధతులు, నీటిని తక్కువగా ఉపయోగించే విధానాలపై పరిశ్రమల యజమానులకు అవగాహన కల్పించారు. పేపర్ ఇండస్ట్రీ వల్ల వాయు, జల, భూమి కాలుష్యం అధికంగా ఉంటుందన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు కాలుష్య జలాలు గోదావరి లంకల్లోకి వదిలితే వరద వస్తే కాలుష్య జలాలు దిగువ ప్రాంతంలోని జలాలను కలుషితం చేస్తాయన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. శుద్ధి చేసిన జలాలనే గోదావరిలోకి వదలాలని ఆదేశించారు. గోదావరి కాలుష్యం కారాదు... రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు కాలుష్య జలాలు, నగరంలో నుంచి కలుస్తున్న మురికి నీటితో గోదావరి కలుషితం అవుతోందని కాలుష్య నియంత్రణ బోర్డు విశాఖ జోనల్ అధికారి ఎ¯ŒSవీ భాçస్కరరావుకు తెలిపారు. పేపర్‌మిల్లు నుంచి కాలుష్య జలాలు గోదావరిలో కలుస్తున్న విషయంపై తనిఖీ చేసి చర్యలు చేపడతామని విలేకరుల ప్రశ్నకు సమాధానం చెప్పారు. గంగా ప్రక్షాళన విధంగా గోదావరి ప్రక్షాళన చేపట్టే విషయం పరిశీలిస్తామన్నారు. బోర్డు మెంబర్ బీఎస్ఎస్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ నిపుణులు, పేపర్‌మిల్లుల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు.