విద్యుదాఘాతంతో రైతు మృతి
మంచాల: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బోడకొండలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవసోత్ రెడ్డినాయక్(32) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన పొలానికి వెళ్లి పత్తిపంటకు నీళ్లు పెడుతున్నాడు.
సమీపంలో ఉన్న ఓ ఇటుక బట్టీ నిర్వాహకుడు దగ్గరలోని ట్రాన్స్ఫార్మన్ నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకున్నా డు. కరెంట్ వైరును రైతు పొలంలోంచి తీసుకెళ్లారు. పంటకు నీళ్లుపెడుతున్న రెడ్డినాయక్కు తేలిన విద్యుత్ తీగ తగలడంతో కరెంట్ షాక్ తగిలింది. దీంతో రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య నీల, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది.
స్థానికుల ఆందోళన..
ఇటుక బట్టీల యాజమాన్యం, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే రైతు దుర్మరణం చెందాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలం నుంచి మృతదేహా న్ని తరలించకుండా అడ్డుకున్నారు. సమాచారం అం దుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని తరలించే యత్నం చేయ గా యువకులు అడ్డుతగిలారు. పోలీసులకు వ్యతి రేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో చేసేది లేక పోలీసులు మిన్నకుండిపోయారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు పట్టుబట్టారు.