నందిగామలో 69.49 శాతం పోలింగ్ నమోదు
(నందిగామ - అనిల్ )
నందిగామ: కృష్ణాజిల్లాలోని నందిగామ శాసనసభ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఆ నియోజకవర్గంలో మొత్తం 69.49 శాతం ఓట్లు పోలైయ్యాయి. ఆ శాసనసభ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో పోలైన ఓట్లు చంద్రలపాడు (72.02), నందిగామ (65.21), వీరులపాడు (76.27), కంచికచర్ల (69.49). ఇటీవల జరిగిన ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు విజయం సాధించారు.
అయితే ఆయన గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13న ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దాంతో టీడీపీ అభ్యర్థిగా తంగిరాల ప్రభాకరరావు కుమార్తె తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబురావు ఎన్నికల్లో నిలబడ్డారు.