భంగపడ్డ భాస్కరుడు: మంత్రుల బుజ్జగింపు
కాకినాడ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండవసారి టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు భంగపడ్డారు. తూర్పుగోదావరి స్థానానికి మాజీ మంత్రి చిక్కాల పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు. అధిష్టానం నిర్ణయంపై ఆయన అనుచరులు మంత్రుల ముందు మండిపడ్డారు. అసంతృప్తితో ఉన్న భాస్కర రామారావును హోం మంత్రి చినరాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు బుజ్జగిస్తున్నారు.