శ్రీశైలవాసు హత్యకేసులో పురోగతి
నందిగామ: జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు, చందాపురం గ్రామ మాజీ సర్పంచి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొగ్గవరపు శ్రీశైలవాసు(42) హత్యకేసులో పురోగతి కనిపించింది. ఈ హ్యతకేసులో అనుమానితులు హనుమంతరావు, పాషాకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
ఓ మెడికల్ షాపులో ఉంచిన సీసీ కెమెరాలో రికార్డయిన పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు శ్రీశైలవాసు ఆఫీసులోకి వెళుతున్న దృశ్యాలు ఇందులో రికార్డయ్యాయి. పాషానే కాల్పులు జరిపివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. శ్రీశైలవాసును సోమవారం తుపాకీతో కాల్చిచంపారు.