పేకాటరాయుళ్లు అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం బొల్లకడియంలో14 మంది పేకాటరాయుళ్లను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5.5 లక్షల నగదు, 13 సెల్ ఫోన్లతోపాటు 5 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ... దర్యాప్తు చేస్తున్నారు.