ప్రముఖ న్యూరో సర్జన్ నాగరాజ కడపకు రాక
కడప కార్పొరేషన్: ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి. నాగరాజ ఆదివారం కడపకు రానున్నారు. ఈ విషయాన్ని బొల్లినేని డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని బొల్లినేని డయాగ్నోస్టిక్ సెంటర్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఆయన అందుబాటులో ఉంటారన్నారు. తిమ్మిరులు, నరాల బలహీనత, కీళ్లవాతము, పక్షవాతము, తలనొప్పులు, తల తిరుగుట, నడుము, మెడనొప్పి వంటి సమస్యలు ఉన్న వారు ఆయనను సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు.