breaking news
Bollywood Actor
-
బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ హఠాన్మరణం
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ (55) హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఆయన మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన ఆశిష్ పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు.అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’, అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం’, రాణీ ముఖర్జీ లీడ్ రోల్ పోషించిన ‘మర్దానీ’, సిద్ధార్థ్ మల్హోత్రా ‘ఏక్ విలన్’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆశిష్ వారంగ్. హిందీ సినిమాల్లోనే కాదు... మరాఠీ చిత్రాల్లోనూ నటించారాయన. ఆశిష్ వారంగ్ మృతిపై పలువురు నటీనటులు, దర్శకులు, సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే... ఆయన మృతికి కారణం ఏంటి? అనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, బాలీవుడ్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి. -
అనురాగ్ కశ్యప్ నిశాంచి.. ఆసక్తిగా ట్రైలర్
ఐశ్వరి థాకరే హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం నిశాంచి. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీని జార్ పిక్చర్స్ బ్యానర్‌పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రసూన్ మిశ్రా, రంజన్ చండేల్, అనురాగ్ కశ్యప్ కథ అందించారు.ట్రైలర్ చూస్తుంటే ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2000వ దశకంలో సాగిన ఈ కథలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య థాకరే కవలలుగా ద్విపాత్రాభినయం సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. -
ఖరీదైన కారు కొన్న సీనియర్ నటి.. ధర ఎంతంటే?
ప్రముఖ బాలీవుడ్ నటి, హేమ మాలిని ఖరీదైన కారును కొనుగోలు చేసింది. తన కొత్త కారుకు పూజ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లగ్జరీ కారు విలువు దాదాపు రూ.75 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం అభినందనలు చెబుతున్నారు.బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్‌పై పేరున్న హేమ మాలిని పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. పలువురు అగ్ర హీరోల సరసన మెప్పించారు. 1970-80 సమయంలో స్టార్ హీరోయిన్గా రాణించారు. ఆమె చివరిసారిగా 2020లో విడుదలైన సిమ్లా మిర్చి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మధుర నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనూ సూద్.. ఎన్ని కోట్ల లాభం వచ్చిందంటే?
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగువారికి కూడా సుపరిచితమైన పేరు. అరుంధతి మూవీలో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో విలన్‌గా మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు ఈ ఏడాది ఫతే మూవీతో ప్రేక్షకులను అలరించారు.తాజాగా సోనూ సూద్ తన ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని లోఖండ్వాలా మినర్వా ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మీ అపార్ట్‌మెంట్‌ను దాదాపు రూ.8.10 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. కాగా.. సోనూ సూద్ 2012లో ఈ భవనాన్ని రూ. 5.16 కోట్లకు కొనుగోలు చేశాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రూ. 2.94 కోట్ల లాభానికి అమ్మేశాడు.ఇక సోనూ సూద్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా ఫతే చిత్రంలో కనిపించారు. ఈ చిత్రానికి సోనూనే దర్శకత్వం వహించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఊహించనంత స్థాయిలో రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 13.35 కోట్లు వసూలు మాత్రమే చేసింది. ఈ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు సోనూ సూద్. ప్రస్తుతం అతను ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. -
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
ఆరోగ్యంగా మంచి ఫిజిక్‌తో తమ వయసు కన్నా బాగా తక్కువున్నట్టు కనిపించే ఎవరిని ఫిట్నెస్ సీక్రెట్ చెప్పమన్నా....సాధారణంగా వచ్చే సమాధానాలు అన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ‘‘ఉదయాన్నే లేస్తాను, వ్యాయామం చేస్తా, తాజా పండ్లు తింటాను..దురలవాట్లకు దూరంగా ఉంటా, రాత్రుళ్లు త్వరగా నిద్రపోతా, కనీసం 7గంటలైనా నిద్ర ఉండేలా చూసుకుంటా...’’వంటివి. అయితే వీటన్నింటికీ భిన్నంగా చెబుతున్నాడో హీరో. మరో రెండు నెలల్లో 60ఏళ్ల వయసుకు చేరుకోబోతున్న ఆ హీరో ఇప్పటికే సిక్స్ ప్యాక్ మాత్రమే కాదు ఎయిట్ ప్యాక్ కూడా చేసేశాడు. అది కూడా మద్యం సేవించడం, రాత్రుళ్లు నిద్రపోకపోవడం...వంటివి చేస్తూనే... ఎవరా హీరో? ఏమాతని కధ?వచ్చే నవంబర్ 2వ తేదీ నాటికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)కు 60 ఏళ్లు నిండుతాయి, కానీ అతని వయస్సులో సగం ఉన్న పురుషులను కూడా సిగ్గుపడేలా చేసే శరీరాకృతి అతని స్వంతం. గత ఎన్నో సంవత్సరాలుగా గ్రీకు వీరుని తలపించే ఫిజిక్‌తో ఈ సూపర్ స్టార్ కొనసాగుతున్నాడు. ఇటీవలే తన ఫిట్నెస్ అలవాట్లు ఆహార క్రమశిక్షణ గురించి మీడియాతో పంచుకున్నాడు. బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో లాగే ఇప్పటికీ తనను చురుగ్గా కనిపించేలా చేసే దినచర్యల గురించి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ వివరించాడు.‘నేను ఉదయం ఐదు గంటలకు పడుకుంటాను అంతేకాదు.. తొమ్మిది లేదా పది గంటలకు మేల్కొంటాను‘ అని ఆయన చెప్పాడు. అంతేకాదు రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు పని ముగించుకుని తాను ఇంటికి తిరిగి వస్తానన్నాడు. అప్పుడు ఆ టైమ్‌లోనే తాను వ్యాయామం చేస్తానని చెబుతున్నాడు. బహుశా చాలా మందికి ఇది అసాధ్యం., కానీ షారూఖ్‌కు కొన్ని సంవత్సరాలుగా అది సాధారణం. వ్యాయామం చేసి, స్నాన ం అన్నీ పూర్తి చేసుకుని తెల్లవారుఝామున 5గంటలకు నిద్రపోతాడన్నమాట. అంతేకాదు ఆసక్తికరంగా, షారూఖ్ తాను పండ్లు తిననని చెబుతున్నాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారి నుంచి సాధారణంగా ఇలాంటి మాట వినడం # జరగదు. ఆయన తన మందు అలవాటు గురించి మాట్లాడుతూ...‘‘ఒక నిర్దిష్ట పాత్ర కోసం ఒక షేప్ లోకి రావాలంటే మాత్రం ఆల్కహాల్‌ను మానేస్తాను అని చెప్పాడు. దానితో పాటే తెల్ల రొట్టె, తెల్ల బియ్యం, స్వీట్లు కూడా అంటూ వివరించాడు. కొన్నిసార్లు ఐస్ క్రీం లేదా చాక్లెట్ తింటాను అంటున్న షారుఖ్ జంక్ ఫుడ్ లేదా డెజర్ట్‌లను తానేమీ ప్రత్యేకంగా ఇష్టపడనని చెప్పాడు. అంతేకాదు తందూరీ చికెన్ అంటే తాను పడి చస్తానంటున్నాడీ హీరో.దశాబ్దాలుగా ఆయన వదల్లేని వంటకం ఏదైనా ఉంటే, అది తందూరీ చికెన్. దీనిని తన కంఫర్ట్ ఫుడ్ అని పేర్కొంటూ నేను దీనికి బానిసని చెప్పాలి. అవసరమైతే నేను సంవత్సరంలో 365 రోజులు ఇదే తినగలను’’ అన్నాడు.మరి మంచి లక్షణాలు, అలవాట్లు ఏమీ లేవా అంటే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కఠినమైన వ్యాయామం, ప్రోటీన్ అధికంగా ఉండే, శుభ్రమైన భోజనం తన ఆహారం, తన ఎవర్ గ్రీన్ ఎనర్జీకి ఆధారం అంటాడు షారుఖ్. తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ ‘నేను గ్రిల్డ్ చికెన్, లీన్ మీట్స్, పప్పుధాన్యాలు తీసుకుంటాను. గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటాను‘ అని స్పష్టం చేశాడు. ‘నేను తక్కువ పరిమాణంలోనే ఆహారం తీసుకుంటాను. ‘ అని ఆయన చెప్పాడు. ఇది వివిధ సినిమా పాత్రల డిమాండ్లకు అనుగుణంగా తన శరీరాన్ని త్వరగా మార్చుకోవడానికి తాను అనుసరించే వ్యూహం అని చెప్పాడు.సినిమా సెట్లలో తయారుచేసిన ఆహారానికి బదులుగా ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినడానికి ఇష్టపడతాడు. అతని సాధారణ మధ్యాహ్నం భోజనంలో తరచుగా చేపలు లేదా తందూరీ చికెన్ ఉంటుంది, కొన్నిసార్లు బీన్ స్ప్రౌట్స్ లేదా ఏదైనా వెజ్‌కర్రీ జతవుతుంది. ‘సాధారణంగా తందూరీ రోటీతో తందూరీ చికెన్, అప్పుడప్పుడు మటన్ డిష్‘ అంటూ తన డిన్నర్ మెనూ వివరిస్తాడు.ఆయన భార్య చిత్ర నిర్మాత ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ ‘డైజెస్టివ్ బిస్కెట్లతో మంచి ఐస్ క్రీం‘ అని పిలిచే దానిని తయారు చేస్తారు. మీ 50 ఏళ్ల వయసు దాటాక ఫిట్‌గా ఉండటం అంటే విపరీతమైన భోజన ప్రియత్వమో, దురలవాట్లో కాదు అలాగే ఆకలితో అలమటించడం కూడా కాదు. శరీరానికి ఏది పని చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం అంటాడు షారూఖ్.