రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా వాంకేడ్ మండలం బొంబాడ గ్రామంలో చోటుచేసుకుంది. బొంబాడకి చెందిన అప్పల రామయ్య మంగళవారం రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొన్నది. ఈ ఘటనలో గాయపడ్డ రామయ్య (63)ను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. రామయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.