bommaiah
-
అందుకే ప్రియాభవానీ శంకర్‌తో రెండోసారి: ఎస్జే సూర్య
నటుడు, దర్శకుడు ఎస్జే సూర్య హీరోగా నటించి, నిర్మించిన చిత్రం 'బొమ్మై'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా చేసింది. ఈ చిత్రానికి రాధామోహన్ కథ అందించి దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈనెల 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్జే సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'దర్శకుడు రాధామోహన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ మూవీ నిర్మించాను. అలా మొదలైన ఈ చిత్రం చాలా సంతృప్తిగా వచ్చింది. 'మాన్స్టర్'లో నాతో కలిసి యాక్ట్ చేసిన ప్రియాభవానీ శంకర్‌నే ఇందులోనూ హీరోయిన్ గా ఎంచుకోవడానికి కారణం ఏమిటని అడుగుతున్నారు. మా అక్క కూతురికి ఇంచుమించు ప్రియాభవాని ఛాయాలు ఉంటాయి. నటి సిమ్రాన్‌కు, త్రిషకు అలాంటి ఫేస్ కట్ ఉంటుంది. అలా ముఖంలో ఓకే కట్ ఉన్న ఒకరికి, మరొకరికి మధ్య సారుప్యత ఉంటుంది' 'నటుడు షారూక్ ఖాన్‌కు, నటి కాజోల్కు అలాంటిదే ఉంది. కారణం ఏంటనేది చెప్పలేను గానీ నాకు, ప్రియాభవాని శంకర్‌కు ఒక మ్యాథమేటిక్స్ ఫ్యూచర్స్ సెట్ అవుతుంది. ఇది ఒక కారణం కావచ్చు. చాప్టర్‌ను మలరుమ్ పాటలో నేను, సిమ్రాన్ మాదిరిగానే ప్రియాభవాని శంకర్ ఉంది. ఇకపోతే ప్రియాభవాని శంకర్, తాను మాన్స్టర్ చిత్రంలో నటించాం. అది మంచి హిట్ కావడం కూడా ఇందులో మళ్లీ మేమిద్దరం కలిసి నటించడానికి కారణం అయ్యిండొచ్చు' అని ఎస్జే సూర్య చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: హీరో షారుక్ ఖాన్‌కి చేదు అనుభవం.. ఆమె అలా చేసేసరికి!) -
బెళగావిలో ఇక సెగలే
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): భిన్న సంస్కృతులకు వేదికైన బెళగావిలోని రెండో అసెంబ్లీ భవనం సువర్ణసౌధ శీతాకాల శాసనసభ సమావేశాలకు ముస్తాబైంది. సోమవారం ఉదయం నుంచి పదిరోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే సీఎం, విపక్ష నేతలు, మంత్రులు సహా ఉన్నతాధికారులు బెళగావికి చేరుకున్నారు. బొమ్మై సీఎం అయ్యాక జరుగుతున్న రెండో అసెంబ్లీ సమావేశాలు కాగా, అనేక ముఖ్య అంశాలతో సర్కారుపై దాడికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. కరోనా సమస్య, మేకెదాటు ఆనకట్ట, బిట్కాయిన్ల స్కాం, వరదల్లో జనం నష్టపోవడం, నిత్యావసర ధరల పెంపు ఇలా అనేక వైఫల్యాలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు ధీమాగా ఉన్నారు. కమీషన్ల ఆరోపణలు.. రాష్ట్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖల్లో 40 శాతం కమీషన్ నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సంబంధిత మంత్రులు సమాధానం ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రజాపనులు, జలవనరుల శాఖలపై ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు వరదమయం అయ్యాయి. అక్కడి ప్రజలకు పరిహారం అందజేయడంతో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తనున్నారు. రాష్ట్రంలో సుమారు 35 వేల ఇళ్లు దెబ్బ తిన్నాయి. ఇప్పటికి రూ.204 కోట్ల పరిహారం విడుదల చేశారు. మత మార్పిడి చట్టం రగడ.. రాష్ట్రంలో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టం తెస్తామని సీఎం ప్రకటించడం వివాదాస్పదమైంది. పలు మత సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రధాన ప్రతిపక్షం కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. సీఎం బొమ్మై మాత్రం కచ్చితంగా చట్టం చేస్తామని చెబుతున్నారు. తొలిరోజు నుంచే రభస జరిగేలా ఉంది. బెంగళూరు సమీపంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నమేకెదాటు ప్రాజెక్టును ఎందుకు నిర్మించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఎందుకు అనుమతులను తెచ్చుకోవడం లేదనేది చర్చకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు మంగళవారం విడుదల కానున్న 25 ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు ఈ సమావేశాలపై ప్రభావం చూపవచ్చు. చదవండి: ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి.. -
బిట్ కాయిన్ కుంభకోణం: ఇద్దరు మంత్రులపై నిఘా కన్ను
సాక్షి, బనశంకరి(కర్ణాటక): రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న బిట్‌కాయిన్ కుంభకోణంలో సొంత పార్టీ నేతలే విపక్షాలకు సమాచారం చేరవేస్తున్నారని బీజేపీ పెద్దల్లో అనుమానం ఏర్పడింది. దీంతో ఇద్దరు మంత్రుల కదలికలపై కేంద్ర బీజేపీ నేతలు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించాల్సిన కొందరు మంత్రులే ప్రతిపక్షాలతో కుమ్మక్కైనట్లు బీజేపీ సందేహిస్తోంది. హైకమాండ్‌కు సీఎం మొర బిట్‌కాయిన్‌పై ఆ ఇద్దరే ప్రతిపక్ష నేతలకు లీక్‌లు ఇస్తున్నారని సీఎం బసవరాజబొమ్మై పార్టీ అధినేత జేపీ.నడ్డా, హోం మంత్రి అమిత్‌షా కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిని తీవ్రంగా పరిగణించిన హై కమాండ్ ఇద్దరు మంత్రుల కదలికలపై నిఘాపెట్టడానికి రహస్య బృందాన్ని బెంగళూరుకు పంపించినట్లు తెలిసింది. బిట్‌కాయిన్ స్కాంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనే సమాచారాన్ని విపక్షాలకు లీక్ చేస్తున్నారని గుసగుసలున్నాయి. ఇటీవల హానగల్ ఉప ఎన్నిక సమయంలో విపక్షనేత సిద్దరామయ్య ఈ కేసును ట్విట్టర్ ద్వారా లేవనెత్తాక పెను దుమారం మొదలైంది. సీఎం బొమ్మై ఢిల్లీ పర్యటనలో మంత్రుల నిర్వాకంపై హైకమాండ్ ముందు వాపోయారు. తనకు మంత్రుల మద్దతు దొరకడం లేదని ఫిర్యాదు చేశారు. -
గుండె పోటుతో రైతు మృతి
అనంతపురం రూరల్: చియ్యేడు గ్రామానికి చెందిన రైతు బొమ్మయ్య(46) శుక్రవారం గుండె పోటుతో మృతి చెందాడు. తనకున్న 3 ఎకరాల పొలంలో రూ.5 లక్షల మేర అప్పులు చేసి 10కి పైగా బోర్లు తవ్వించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు రుణదాతల నుంచి వత్తిడి పెరగడంతో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.