నెలాఖరుకు 'రాజధాని'పై నిర్ణయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం 9 మంది సభ్యులతో సలహా కమిటీ వేసింది. రాష్ట్ర మంత్రి నారాయణ ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఎంపీలు సుజనాచౌదరి, గల్లా జయదేవ్, జీవీ సంజయ్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, బొమ్మిడాల శ్రీనివాస్ (జీఎమ్ఆర్ గ్రూప్), నూజివీడు సీడ్స్ చైర్మన్ ఎం. ప్రభాకర్‌రావు, చింతలపాటి శ్రీనివాసరాజు సభ్యులుగా ఉంటారు.
పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కాగా మంత్రి నారాయణ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. శివరామకృష్ణన్ కమిటీతో ఆయన భేటీ అవుతారు. రాజధాని ప్రతిపాదనను కమిటీకి అందజేయనున్నారు. నెలాఖరుకు రాజధానిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.