బీజేపీ తిరంగయాత్ర
జహీరాబాద్ టౌన్: మండలంలోని బూచినెల్లి గ్రామంలో బీజేపీ నాయకులు తిరంగ యాత్ర నిర్వహించారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పండరి ఆధ్వర్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను పట్టుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని బసవేశ్వరుడు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలే వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రం సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు.
17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా, జిల్లా మున్సిపల్ సెల్ కన్వీనర్ సుధీర్ బండారీ, నాయకులు విశ్వనాత్ యాదవ్, ప్రభాకర్‌రెడ్డి, అల్లాడి బక్కయ్య గుప్తా, వేణు తదితరులు పాల్గొన్నారు.