‘బుక్ ఆఫ్ ఎవరెస్ట్’లో యువరాజారెడ్డి
పెదపూడి : జి.మామిడాడకు చెందిన పీఈటీ ఉపాధ్యాయుడు, లయన్స క్లబ్ సభ్యుడు ద్వారంపూడి యువరాజారెడ్డి బుక్ ఆఫ్ ఎవరెస్ట్ ప్రపంచ రికార్డులో స్థానం సాధించారు. గత శ్రీరామ నవమి సందర్భంగా 12,345 బియ్యం గింజలపై శ్రీరామనామాన్ని తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో సూక్ష్మ పరికరాలు ఉపయోగించకుండా రాశారు. వీటిని రికార్డుల సేకరణ సంఘం(ఇన్వోరాన్స్) అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చింతా శ్యామ్‌కుమార్ పరిశీలించి అవార్డుకు సిఫార్సు చేశారు.
నేపాల్‌కు చెందిన బుక్ ఆఫ్ ఎవరెస్ట్ చీఫ్ ఎడిటర్ మధుకుమార్ ప్రేష్ట ధ్రువపత్రం జారీ చేశారు. దానిని లయన్స్ ఇంటర్నేషనల్ డెరైక్టర్ ఆర్ సునీల్‌కుమార్ చేతుల మీదుగా ఈ నెల 20న మండపేటలో జరిగిన కార్యక్రమంలో యువరాజారెడ్డి అందుకున్నారు. లయన్స్ గవర్నర్ డి.తిరుమలరావు, బాదం ఐ, బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడు బాదం బాలకృష్ణ, బీ ఛత్రపతి శివాజీ, మండ రాజారెడ్డి పాల్గొన్నారు.