మార్కెట్లోకి గూగుల్ క్రోమ్బుక్స్
న్యూఢిల్లీ: విద్యార్థులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా గూగుల్ ఇండియా వివిధ కంపెనీలకు చెందిన క్రోమ్బుక్స్, క్రోమ్బాక్స్లను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. క్రోమ్బుక్స్ గతేడాదే మార్కెట్ లోకి వచ్చాయని, ప్రస్తుతం తాము మూడు కొత్త క్రోమ్బుక్స్ను మార్కెట్లోకి విడుదలచేస్తున్నామని క్రోమ్ ఓఎస్ గ్లోబల్ ప్రాడక్స్ మేనేజర్ స్మిత హష్మిమ్ అన్నారు. జోలో, నిషియన్ క్రోమ్బుక్స్ రూ.12,999ల ధరతో అమెజాన్, స్నాప్డీల్లలో లభిస్తున్నాయని తెలిపారు.
వీటి ప్రి-బుకింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని చెప్పారు. ఆసూస్ క్రోమ్బుక్స్ మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, వ్యాపారవేత్తలకు క్రోమ్బుక్స్, క్రోమ్బాక్స్లు చాలా ఉపయుక్తంగా ఉంటాయన్నారు.